విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 24: పట్టణంలో పన్నుల వసూళ్లకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ సోమన్నారాయణ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీరోజూ 30 లక్షల రూపాయల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మున్సిపల్ బిల్లుకలెక్టర్లతోపాటు మిగతా విభాగాల ఉద్యోగులు, పొదుపుసంఘాల మహిళలు ప్రత్యేక బృందంలో ఉంటారన్నారు. పట్టణంలో 12 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉందన్నారు.
నిరుపేదలకు మెరుగైన వైద్యం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 24:నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఎంపీ ఝాన్సీలక్ష్మి చెప్పారు. సోమవారం ఆమె మహారాజ ఆసుపత్రిలో అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో అధునాతన వైద్యపరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించలేకపోతున్నామని చెప్పారు. వెంటిలేటరుకు అవసరమైన వైద్యులు, ఇతర సాంకేతికపరమైన అవసరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఆరోగ్య శ్రీ అమల్లో జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. కమిటీ అధ్యక్షులైన కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి నిధులు ప్రాధాన్యమైన అంశాల కోసం, ఆసుపత్రి పనితీరు మెరుగుపరిచేందుకు నిధులు ఖర్చు చేయాలన్నారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ విజయలక్ష్మి, ఘోషాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ గౌరీశంకర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్సీ సొసైటీ పిడి ప్రసాద్ పాల్గొన్నారు.
ఎస్సీ వసతి గృహంలో ఎసిబి తనిఖీలు
పాచిపెంట, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాంలో సోమవారం ఎ.సి.బి తనిఖీలు జరిగాయి. ఎ.సి.బి డి.ఎస్.పి సి.హెచ్.లక్ష్మిపతిరాజు(విజయనగరం) ఆధ్వర్యంలో బృందం తనిఖీలు నిర్వహించారు. వసతి గృహాంలో పిల్లల వివరాలను సేకరించి రికార్డులను పరిశీలించారు. ఇక్కడ విద్యార్థులు ఏ ఏ పాఠశాల్లో చదువుతున్నారో, ఆయా పాఠశాల ఉపాధ్యాయులను వసతి గృహాంనకు రప్పించి సమాచారం సేకరించారు. వసతి గృహాంనకు సంబందించి పలు రికార్డులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎ.సి.బి సి.ఐ లక్ష్మాజి, రమేష్‌లు విలేకర్లుతో మాట్లాడుతూ వసతి గృహాంపై వచ్చిన ఆరోపణలు మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. వసతిగృహాంలో చిన్నచిన్ని లోపాలున్నాయని, ఇటువంటి తనిఖీలు వలస వసతి గృహాల పనితీరు మెరుగుపడతాయని వారు తెలిపారు. గతంలో పట్టణాల్లో ఉన్న వసతి గృహాల తనిఖీ చేశామన్నారు. మరో సి.ఐ రమణమూర్తి బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ తనిఖీలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు.
‘గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి’
కురుపాం, ఫిబ్రవరి 24: కురుపాం మేజర్ పంచాయితీకి పారిశుద్ద్య పనుల కోసం ఎం.పి ల్యాడ్స్ నిధులను ట్రాక్టర్ మంజూరు చేశారు. కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ తన ఎం.పి ఎల్.ఎ.డి నిధుల నుండి రూ. 5.5 లక్షలు కేటాయించారు. 13వ ఆర్థిక సంఘ నిధుల్లో 54వేలు కలిపి 6లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. దీనిని కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ పారిశుద్ద్య పనుల కోసం ట్రాక్టర్‌ను సద్వినియోగం చేయాలన్నారు. అపారిశుద్ద్యం లేకుండా క్లీన్‌గా ఉండేటట్లుగా పంచాయితీని తీర్చి దిద్దాలని సర్పంచ్‌లు కోరారు. పాత ట్రాక్టర్‌ను కూడ దీనికోసం వినియోగించాలన్నారు. సర్పంచ్ పువ్వల పద్మావతి, గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.