ఏలూరు, ఫిబ్రవరి 24: జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ(ఐటిడిఎ) ప్రాజెక్టు ఆఫీసరుగా పులి శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఐటిడిఎ ఇన్‌ఛార్జి పిఓగా వ్యవహరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు కార్పోరేషన్ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును ఐటిడిఎ పిఓగా ప్రభుత్వం నియమించింది.
బాధ్యతలు స్వీకరించిన కలెక్టరేట్ ఎఓ
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 24: జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారిగా సూర్యనారాయణ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం తహసిల్దార్‌గా పనిచేస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. అనంతరం కలెక్టరు, జాయింట్ కలెక్టరు, డిఆర్వోలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ(ఐటిడిఎ) ప్రాజెక్టు ఆఫీసరుగా పులి శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు
english title:
itda
Date:
Tuesday, February 25, 2014