నిడదవోలు, ఫిబ్రవరి 24: విధి వక్రించి, కాలం కనె్నర్ర చేసి కలిసి కొన్ని గంటల్లో నిశ్చితార్థం జరగబోయే వరుడిని మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళితే..నిడదవోలుకు చెందిన షేక్ ఇమ్రాన్‌భాషా(23), షేక్ ఇర్ఫాన్ (22) ఆదివారం తెల్లవారుఝామున 3 గంటలకు నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జిపై బైక్ నడుపుతూ అదుపు తప్పి పుట్‌పాత్‌ను ఢీకొని మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. షేక్ ఇమ్రాన్‌కు నిడదవోలులో సోమవారం ఉదయం నిశ్చితార్ధం జరగనుంది. ఇతను సమిశ్రగూడెంలోని ఒక మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడు. షాపులో సోమవారం మాంసం ఆర్డర్ ఉండడం వల్ల, అతను స్నేహితుడిని బండిపై ఎక్కించుకుని త్వరగా ఆర్డర్ ముగించుకుని ఇంటికి త్వరగా వెళ్లిపోదామనే ఉద్దేశంతో బైక్‌ను స్పీడుగా నడపడంవల్ల అదుపుతప్పి ఇద్దరూ పుట్‌పాత్‌ను ఢీకొన్నారు. మరో వ్యక్తి ఇర్ఫాన్‌భాషాకు తల్లి, చెల్లెలు ఉన్నారు. ఇతనిపైనే కుటుంభం ఆధారపడి జీవిస్తున్నారు. పోషించే కొడుకు లేక ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. సోమవారం ఉదయం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు. సమిశ్రగూడెం ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
విధి వక్రించి, కాలం కనె్నర్ర చేసి కలిసి కొన్ని గంటల్లో నిశ్చితార్థం జరగబోయే వరుడిని మృత్యువు కబళించింది.
english title:
r
Date:
Tuesday, February 25, 2014