తిరుపతి, మార్చి 3: సీమాంధ్రకు ప్రత్యేక హోదా లోక్‌సత్తా కృషి ఫలితమేనని ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలో లోక్‌సత్తా ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా జెపి తనదైన శైలిలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనేది సున్నితమైన అంశమన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకువచ్చిందన్నారు. సీమాంధ్రులను బకరాలను చేసింది ఢిల్లీ పెద్దలే కాకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి అసెంబ్లీలో రాజీలేని పోరాటం చేశామన్నారు. కాగా లోక్‌సత్తాలో చేరిన ప్రముఖ సినీగేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ తనదైన శైలిలో గేయాలను ఆలపిస్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. ప్రజలకు మేలు చేసే సత్తా ఒక్క లోక్‌సత్తాకే ఉందని ఉద్ఘాటించారు.
జెపి
english title:
a
Date:
Tuesday, March 4, 2014