లాసానే్న (స్విట్జర్లాండ్), మార్చి 4: ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయిన భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్)లో నెలకొన్న ప్రతిష్టంభనపై మండిపడిన అంతర్జాతీయ బాక్సంగ్ అసోసియేషన్ (ఏఐబిఏ) భారత్‌ను తమ అసోసియేషన్‌నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫీసు బేరర్లు ఈ క్రీడ ప్రతిష్ఠను, పేరు ప్రఖ్యాతులను, దాని ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని దుయ్యబట్టింది. భారతీయ బాక్సింగ్‌కు సంబంధించిన భాగస్వాములనుంచి పరస్పర భిన్నమైన సందేశాలు అందిన తర్వాత భారత బాక్సింగ్ ఫెడరేషన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సరిగా అంచనా వేసే స్థితిలో తాము లేమని తీవ్ర పదజాలంతో కూడిన ఒక ప్రకటనలో ఏఐబిఏ వ్యాఖ్యానించింది. అయితే ఈ పరిణామం ప్రభావం భారతీయ బాక్సర్లు, కోచ్‌లపై ఉండదని, సమస్య పరిష్కారమయ్యే దాకా వారు ఏఐబిఏ పతాకం కింద అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీ పడవచ్చని ఆ ప్రకటన తెలిపింది. ‘్భరత్‌లో బాక్సింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత భారత బాక్సింగ్ ఫెడషన్‌కు చెందిన ప్రస్తుతం సస్పెండయిన ఏ సభ్యుడితోను ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందని తెలియజేయడానికి చింతిస్తున్నాం’ అని ఏఐబిఏ తన తాజా ప్రకటనలో తెలియజేసింది. తాజా ఎన్నికలు జరిగి కొత్త ఆఫీసు బేరర్లు ఎన్నికయ్యే దాకా ఐబిఎఫ్‌ను తిరిగి గుర్తించే అవకాశాలు లేవని ఏఐబిఏ అధ్యక్షుడు చింగ్ కువో వు చెప్పాడు. ఈ ఎన్నికలకోసం అభ్యర్థుల స్క్రీనింగ్‌ను ఏఐబిఏ చేస్తుంది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఏఐబిఏ అధ్యక్షుడిగా తాను మొత్తం బాక్సింగ్ కుటుంబం తరఫున విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన చెప్పాడు. ఐబిఎఫ్‌కు చెందిన ప్రస్తుత ఆఫీసు బేరర్లను గుర్తించేలా ఏఐబిఏను ఒప్పించాలంటూ భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా లేఖ రాయడమే ఏఐబిఏ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. అయితే ఐఓఏపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) ఎత్తివేసిన తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని ఏఐబిఏ హామీ ఇచ్చింది.
అంతర్జాతీయ సంఘం నిర్ణయం
english title:
boxing
Date:
Wednesday, March 5, 2014