ముంబయి, మార్చి 5: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఈ ఏడాది జనవరి 23నాటి రికార్డుస్థాయి ముగింపునకు చేరువైంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య మదుపర్లు ఉదయం ప్రారంభం నుంచే కొనుగోళ్లపై ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో కాస్త అమ్మకాలు నమోదైనప్పటికీ.. చివరకు సెనె్సక్స్ 67.13 పాయింట్ల లాభంతో 21,276.86 వద్ద నిలిచింది. ఇది జనవరి 23నాటి సెనె్సక్స్ ముగింపు రికార్డు 21,373.66కు 97 పాయింట్ల దూరం. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 30.70 పాయింట్లు అందుకుని 6,328.65 పాయంట్ల వద్దకు చేరింది.
* 21,276 స్థాయకి సూచీ
english title:
k
Date:
Thursday, March 6, 2014