Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గ్యాంగ్ ఆఫ్ గబ్బర్‌సింగ్

$
0
0

గబ్బర్‌సింగ్ చిత్రంలో అంత్యాక్షరి సన్నివేశంలో నటించిన నటీనటులందరికీ హీరోలుగా అవకాశాలు వచ్చాయి. తారా-నీలు కార్పొరేషన్ పతాకంపై బాబు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. గబ్బర్‌సింగ్ చిత్రంలో అంత్యాక్షరిలో పాల్గొన్న బంటి (సతీష్), రమేష్, సాయిబాబు, ఆంజనేయులు, రామ్‌సన్ రాజు, ప్రవీణ్, నవీన్, నగేష్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటిస్తుండడం విశేషం. శ్యామలాదేవి (వీరంగం ఫేమ్) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. నటీనటులపై శ్రీరామ్ క్లాప్‌నివ్వగా హరనాధ్ పొలిచర్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. బాలాజీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక నిర్మాత బాబు మాట్లాడుతూ- సినిమాలో కథానాయకులందరూ రౌడీలైనా, వారిలో మార్పు వస్తే సమాజానికి ఏవిధంగా మేలు చేస్తారు అనే కథాంశంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, గబ్బర్‌సింగ్ అంత్యాక్షరి టీమ్ ఎంత గుర్తింపు పొందిందో మనకు తెలిసిందేనని, ఆ వినోదానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈనెలాఖరునుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నామని తెలిపారు. తమకు ఈ అవకాశం లభించడానికి కారణమైన పవన్‌కల్యాణ్‌కు, దర్శకుడు హరీశ్ శంకర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గబ్బర్‌సింగ్ అంత్యాక్షరి టీమ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:నాగిరెడ్డి, సహ నిర్మాత:ఎస్.కె.మక్బూల్, నిర్మాత, దర్శకత్వం: బాబు.

గబ్బర్‌సింగ్ చిత్రంలో అంత్యాక్షరి సన్నివేశంలో
english title: 
gang of gabbar singh

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>