
షెర్లిన్ చోప్రా రేటు పెంచేసిందా? ‘కామసూత్ర -3డి’ ఎఫెక్ట్ షెర్లిన్‌పై బాగానే పడినట్టుంది. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కలెక్షన్ల సంగతి తెలీదు. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థంకాదు. కానీ - ఆ సినిమా తాలూకు ట్రైలర్స్, టీజర్‌ని తిలకించిన నిర్మాతలు.. అందునా దక్షిణాది సినీ నిర్మాతలు ఓ సినిమాకి కోటి రూపాయలు ఆఫర్ చేశార్ట. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో షెర్లిన్ ప్రధాన భూమిక పోషించనుంది. ఇదే విషయాన్ని షెర్లిన్‌ని అడిగితే- ప్రస్తుతం అలాంటి ‘డీల్’ ఏదీ జరగలేదని నిర్మొహమాటంగా చెప్పింది. కానీ ఆమె పర్సనల్ మేనేజర్ మాత్రం కన్‌ఫర్మ్ చేశాడు. సూపర్ మోడల్ పాత్రలో అలరించనున్న ఆ పాత్రకి కోటి ఏమిటి? ఇంకోటి ఇచ్చినా ఫర్లేదు అన్న ధీమాని వ్యక్తం చేస్తున్నార్ట సదరు నిర్మాత.
పాత్రకోసం
సినిమా ప్రారంభించేటప్పుడే నటీనటుల బాడీలాంగ్వేజ్, కొలతలు తదితర అంశాలు దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారనుకున్న విధంగా లేకపోతే కొన్ని సలహాలు, సూచనలు తదితర నటీనటులకు ఇచ్చేది ఆనవాయితీనే. అయితే కొత్తముఖాలైతే దర్శక నిర్మాతలు చెప్పిన రూల్స్‌ను తు.చ తప్పకుండా పాటిస్తారు. అదే అగ్ర కథానాయిక అయితే పాటిస్తుందా? పాటించకపోగా చెడామడా తిట్టేస్తుందని అనుష్క నిరూపించింది. తమిళంలో అజిత్‌తో కలిసి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో అనుష్క నటిస్తోంది. ఈ చిత్రంలోని పాత్రకోసం ఉన్న లావుకన్నా కొంత తగ్గితే బావుంటుందని దర్శకుడు సూచించాడట. అప్పటికి అర్ధంకాలేదేమోనని డైరెక్ట్‌గానే చెప్పాడట. అలా సన్నగా వుంటే చూడడానికి బావుంటుందని పరోక్షంగా అన్నాడట. దానికి కోపగించుకున్న అనుష్క తాను లావుగా వున్నానని ఎవరంటారు? చూడండి మరోసారి! చూసి మాట్లాడండి అంటూ పటపటా పండ్లు కొరుకుతూ అరిచిందట! దాంతో సాఫ్ట్‌వేర్ గౌతమ్‌మీనన్ మరో హీరోయిన్‌ను వెతుకులాటలో పడ్డాడట. మొత్తానికి దర్శకుడు అనుష్కకు భలే షాక్ ఇచ్చాడు. ఓకే! ఇలాంటివన్నీ పరిశ్రమలో సహజమేలే!
నావల్లకాదు
ఎక్కడైనా నటించలేను అనచ్చుకానీ కెమెరా ముందు మాత్రం నావల్లకాదంటే ఎవరూ ఒప్పుకోరు. ముఖ్యంగా దర్శక నిర్మాతలు నటించలేనప్పుడు ఎందుకొస్తారు కెమెరా ముందుకు? అని ఎద్దేవా చేస్తారు. అలా కాకుండా ఏ పాత్రైనా సరే ఛాలెంజ్‌గా తీసుకొని నటిస్తానంటేనే ఆ తర్వాత వాళ్లకి స్టార్‌డమ్ వస్తుంది. నటిగా పుట్టకపోయినా తల్లి స్టార్‌డమ్‌తో గుర్తింపు పొందిన రాధ కూతుళ్లు సినిమా నటనపై సరైన కమిట్‌మెంట్ లేకపోవడంతో నిర్మాతలను ఇబ్బందిపాలుచేస్తున్నారు. రెండో కూతురు తులసి మణిరత్నం నిర్మించిన మహాకావ్యం ‘కడలి’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆమెకు ఎటువంటి పేరు తేకపోగా దర్శకుడి ఇమేజ్‌ని కిందపడేసింది. అటువంటి తులసితో జీవా కథానాయకుడుగా ‘యాన్’ చిత్రం మొరాకోలో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ పాట చిత్రీకరణ జరుగుతోంది. హీరోయిన్లంటే సహజంగా ఐటమ్ పాపల్లాగా చిన్నచిన్న డ్రెస్‌లు వేసుకోవాల్సింది కదా. అదే విధంగా తులసికి కూడా రెండు పీస్‌ల డ్రెస్‌లు వేశారట. భయంకరమైన చలిలో వచ్చి డాన్స్‌చేయమని చెప్పడంతో అమ్మడు మొరాకోలో మొరాయించిందట. తాను అంత చలిలో బైటికి రాలేనని, అక్కడ డాన్స్ చేయడం నావల్లకాదని, రూమ్‌లోనే ఉండిపోయిందట. తులసి దెబ్బతో తలపట్టుకున్న దర్శక నిర్మాతలు వెంటనే రాధకు ఫోన్ చేశారట. ఆతర్వాత తల్లి పీకిన క్లాస్‌తో బుద్ధిగా వచ్చి షూటింగ్ చేసిందట తులసి. అలా వుంటుంది వారసుల కమిట్‌మెంట్!