Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అభివృద్ధితో ఆరోగ్య కిరణాలను ప్రసాదించే... తూర్పు ఫేసింగ్ ఆస్పత్రులు

$
0
0

స్పీడు యుగం ఇది. మనిషి సూర్యునితోపాటు ఉదయాస్తమానాలకు తేడా తెలీకుండా సూర్య కిరణాలంత వేగంగా ఉద్యోగాల పేరిట పరుగులు తీసే ప్రతి మానవునికి చక్కని ఆరోగ్యం అవసరం. అనుకోకుండా రోగాల బారిన పడి సరైన వైద్యసేవలు సమయానికి అందక వారి వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతుంటాయ. ఇటీవల కాలంలో చక్కటి మేలైన వైద్యాన్ని అందించే ఆస్పత్రులు వున్నా రకరకాల వాస్తు దోషాలతో తమ తమ ప్రాభవాన్ని కోల్పోతుంటాయ. కచ్చితమైన వాస్తు మార్పులు చేసుకున్నా లేదా ఆస్పత్రి నిర్మాణం చేసేముందు సరైన దిక్కుల ప్రకారం దాన్ని నిర్మించినా ఎనలేని ఖ్యాతితో చాలా తక్కువ టైంలో గొప్ప ఆస్పత్రిగా వెలుగొందటం ఖాయం.
ఆస్పత్రి భవనం తూర్పు ముఖంగా కనుక కట్టినట్టయతే ప్రతి రోజు పడే సూర్య కిరణాలతో దాని ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తునే వుంటుంది. రోగ కారక క్రిములు త్వరగా నాశనమై పోవటానికి ఉదయపు సూర్యకిరణాలు చాలా ప్రశస్థమైనవి అని శాస్త్రాలు చెబుతున్నాయ. వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా కనుక ఆస్పత్రి కడితే దానిలోని అన్ని విభాగాలు వాటి వాటి గొప్పదనాలతో వెలుగొంది పోతుం టాయ.
కన్సల్‌టింగ్ రూం: ఈ గది ద్వారానే ఆస్పత్రి పేరు ప్రఖ్యాతులు, డాక్టర్ల ఆదాయం పెరిగేది. దీన్ని ఆస్పత్రి బిల్డింగ్‌కి నైరుతి దిశలో గాని దక్షిణం వైపున గాని, పడమర వైపున గాని, వాయవ్యం వైపున గాని కట్టాలి. ఈ గదిలో కూర్చున్న డాక్టర్లు పేషంట్లని చూసేపుడు తమ ముఖాలని ఈశాన్యం వైపు, లేదా తూర్పు, లేదా ఉత్తరం చూసేవిధంగా కూర్చోవాలి. డాక్టర్లు ఈ గదిలో నైరుతి దిశలో కాని, దక్షిణ లేదా పడమర దిశలో కాని కూర్చోవాలి. ఈ డాక్టర్ల ఎదురుగా కూర్చునే పేషంట్లు ‘ఎల్ ’ ఆకారంలో వుండే టేబుల్ లేదా కుర్చీల్లో కూర్చోవాలి. ‘ఎల్ ’ ఆకారం ఈశాన్యం వైపు పొడిగింపుగా వుండాలి. ఇలా కనుక వుంటే ఆస్పత్రి యజమానితో పాటు, ఆ గదిలో పేషంట్లని చూసే డాక్టర్లకి నిరంతరంగా ఆదాయం, పేరు ప్రఖ్యాతులు లభిస్తూనే వుంటాయ.
మెడికల్ ఎక్విప్‌మెంట్ రూం: ఈ గదిని మొత్తం భవనంలో నైరుతి దిశలో పడమర లేదా దక్షిణంవైపు ఎత్తుగా నిర్మిస్తే చాలా మంచిది. న్యూక్లియర్ మెడిసిన్ విభాగం అనగా క్యాన్సర్ చికిత్సా విభాగంలో ప్రక్రియలు వాటి తాలూకు మందులు మొదలైనవి ఉత్తర దిశలో వుండాలి. అన్ని పరీక్షలు చేసే ఎనలైటికల్ లాబొరేటరీలు, రేడియాలజీ, అల్ట్రాసౌండ్, ఎమ్. ఆర్.ఐ., సిటి స్కాన్, ఇ.సి.జి మొదలైనవి పడమర దిశలో కచ్చితంగా వుండాలి. కాని క్లినికల్ లేబొరెటరీలు మాత్రం దక్షిణ దిశలోనే వుండి తీరాలి.
స్టోర్ రూం: నైరుతి దిశలో పడమరగా కాని, దక్షిణంగా కాని వుండితీరాల్సిన రూం ఇది. దీనికుండే ప్రత్యేకత ఏంటంటే ఈ గది ఆస్పత్రిలో మిగతా గదుల కంటే ప్రత్యేకమైన విధంగా నిర్మాణం జరగాల్సినది. ఎలాగంటే ఈ గదిలో ఎక్కడ బరువైన వస్తువులు పెట్టాలో అక్కడ గోడలకు అరలు అరలుగా ఏర్పాటు చేయంచుకోవాలి. ఈశాన్య భాగంలో మాత్రం సెలైన్ బాటిల్స్ మాత్రమే వుంచాలి. బ్లడ్ బాటిళ్లు పొరపాటున కూడా వుంచవద్దు.
మెడికల్ వార్డ్/ ఐ.సి.యు: ఈ వార్డ్ ఆస్పత్రి ఆదాయానికి గుండెలాంటిది. దీంట్లో చేరిన రోగులు త్వరితగతిన కోలుకుని ఇళ్లకు వెళుతుంటే ఆస్పత్రికి పేరు డబ్బూ వస్తుంటుంది. అందుకే దీన్ని వాయవ్యంలో వుండే విధంగా వాస్తు ప్రకారం వుంచాలి. ఆస్పత్రిలోకి రోగి ఎమర్జెన్సీ వైద్యానికి రాగానే హుటాహుటిన వైద్యం అందించేందుకు ఈ దిశలో ఈ వార్డ్ చక్కగా వుంటుంది. ఈ వార్డ్‌లో వేసే పేషెంట్ల బెడ్‌లు కచ్చితంగా వాస్తు ప్రకారం వుండాలి. లేకుంటే వారికి మృత్యుదేవత ఆహ్వానం పలుకు తుంటుంది. ప్రతి పేషంట్ తల దక్షిణ దిశవైపు వచ్చే విధంగా బెడ్‌లు ఏర్పాటు చేయాలి. అంటే బెడ్ మీద పడుకున్న రోగి ముఖం ఉత్తర దిశ చూస్తుండాలి అన్నమాట. ఇలా వుంటే రోగికి చేసే వైద్యం చక్కటి ఫలితాలనిస్తూ వుంటుంది. దీంట్లో వుండే నర్సింగ్ స్టేషన్ నైరుతి దిశలో పడమరగా కాని, దక్షిణంగా కాని ఏర్పాటు చేసుకోవాలి. పేషెంట్ల అవసరాలు తీర్చే రకరకాల పరికరాలు ఈ వార్డ్‌లో వాయవ్యంలో వుంచాలి.
ఆపరేషన్ థియేటర్స్: వీటిని ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం ఈ మూలల్లో తప్పించి వేరే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆపరేషన్లు చేసే డాక్టర్లు మాత్రం తూర్పువైపు గాని, ఉత్తర దిక్కు వైపు గాని వారి ముఖం చూసేలా వుండాలి. ఇలా వుండి కనుక సర్జరీలు చేస్తుంటే వాటి ఫలితాలు నూటికి నూరుశాతం సక్సెస్‌ల వైపు నడుస్తాయ. ఎమర్జన్సీ కేసులుగాని, బాగా సీరియస్‌గా లేక కాంప్లికేటెడ్‌గా వుండే కేసులుగాని ఆపరేషన్ థియేటర్‌లో నైరుతి మూలలో వుంచకండి. అలాంటి వాటిని వాయవ్య దిశలో వుంచటం చాలా మంచిది.
ఆపరేషన్ చేసేందుకు అవసరమైన ఇంజనీరింగ్ సామాగ్రిని ఈశాన్యం దిశగా వుంచాలి. ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ తల దక్షిణ దిక్కుకు వుండాలి. ఆపరేషన్‌కు అవసరమైన పరికరాలన్నీ పేషెంట్‌కి నైరుతి దిశలో దక్షిణంవైపు గాని, పడమర వైపుగాని వుండాలి.
ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వార్డులు: మామూలుగా ప్రతి ఆస్పత్రి రెండు ముఖ్యమైన డిపార్ట్‌మెంట్లను కలిగివుంటుంది. అందులో ఒకటి ఔట్ పేషెంట్ల విభాగం, రెండోది ఇన్ పేషెంట్ల విభాగం. వీటిలో ఔట్ పేషెంట్ల విభాగం ఆస్పత్రి నడిచే ప్రక్రియలో చాలా ముఖ్య భూమిక పోషిస్తుంటుంది. దీంట్లో ఆస్ప్రతిలోని అన్ని విభాగాలు తమతమ బాధ్యతలను పేషెంట్ల పట్ల అతి జాగ్రత్తగా నిర్వహిస్తుంటాయ. ఎందుకంటే వీరంతా ఇన్ పేషెంట్లు కాదు కనుక, వారి వారి రోగాలను అడిగి, వాటికి తగిన ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సివుంటుంది. ఇక్కడ వాస్తు పరంగా చాలా చాలా స్టడీ చేయాలి.
ఇక పోతే ఇన్ పేషెంట్ల విభాగం. ఇది ఆస్పత్రికి ఒక విధంగా లాభాలను తెచ్చిపెట్టేది. పేషెంట్లను అడ్మిట్ చేసుకోవటం వ్యాధిని పట్టి కొన్ని నెలలు, రోజులు వార్డ్‌లో వుంచటం. వ్యాధి తీవ్రత తగ్గాక పేషంట్ ఆర్థ్ధిక స్థితిని బట్టి పేయంగ్ రూంలోకి మార్చటం. దీన్ని కూడా వాస్తు పరంగా చాలా పకడ్బందీగా నిర్మించాలి. ఇక్కడ తప్పు కనుక జరిగిందో ఆస్పత్రి మూతేసుకోవాల్సి వుంటుంది.
ఆస్పత్రి బేస్‌మేంట్ వాహనాల పార్కింగ్‌కి వాడాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఛైర్మన్ గది, ఇంకా ఇతర డైరక్టర్ల గదులు క్లినికల్ ల్యాబ్, ఆల్ట్రాసౌండ్ నైరుతిలో దక్షిణ, పడమర సెక్టార్లలో వుండాలి. దాంతో పాటే ఫార్మసీ, రిసెష్షన్, క్యాజువాలిటీ, ఎమర్జన్సీ, మైనర్ ఆపరేషన్ థియేటర్స్, ఇ.సి.జి.,ఎక్స్‌రే, ఫిజియోథెరపీ రూంలు, కన్సల్‌టేషన్ రూంలు ఈశాన్యంలో వుండాలి. ఆగ్నేయ దిశలో కిచెన్, క్యాంటీన్, జనరేటర్‌రూం, ఫ్లాంట్‌రూం, లాండ్రీ వుండాలి. వాయవ్యంలో టాయలెట్స్, ఆస్పత్రి మెట్లు ఇంకా లిఫ్ట్స్ వుండాలి.
ఆస్పత్రి రెండో ఫ్లోర్‌లో పేషెంట్ల సింగిల్ , డబుల్ వార్డ్‌లు, నర్సుల గదులు వుండాలి. డబుల్ వార్డ్‌లు ఆగ్నేయ భాగంలో దక్షిణ, పడమర దిశలుగా వుండాలి. సింగిల్ వార్డ్‌లు ఈశాన్య భాగంలో వుండాలి.
ఆస్పత్రి మూడో ఫ్లోర్‌లో కాన్ఫరెన్స్‌హాలు దాంతో పాటే క్లోజ్‌డ్ సర్క్యూట్ టీవీలు ఉత్తర దిశగా కాని, తూర్పు దిశగా కాని ఈశాన్య సెక్టార్లో వుండాలి. నైరుతి భాగంలో చెడిపోయన ఎక్స్‌పైరీ అయన వేస్ట్ మందులను నైరుతి దిశలో పడేయాలి. మగవారి, ఆడవారి టాయలెట్స్ వాయవ్యంలో కట్టాలి. నైరుతి సెక్టర్‌లో దక్షిణ దిశగా రాక్ గార్డెన్ ఈశాన్య దిశకు పల్లంగా వుండేలా ఏర్పాటు చేసుకోవాలి. నర్సుల నివాస ప్రదేశాలు మొత్తం ఆస్పత్రికి ఆగ్నేయ దిశగా కాని, వాయవ్య దిశగా కాని నిర్మించుకోవాలి.
ఇన్ని రకాల వాస్తు సూత్రాలతో తూర్పు ముఖంగా వున్న ఆస్పత్రులు కట్టినట్టయతే వాటి అభివృద్ధి ఎవరికీ అందనంత ఎత్తులో, నిరంతరంగా తన అభివృద్ధి కిరణాలను యజమానులమీద ఎల్లవేళలా ప్రసరింప చేస్తునే వుంటాయ అనటంలో సందేహం లేదు.
*

అభివృద్ధితో ఆరోగ్య కిరణాలను ప్రసాదించే...
english title: 
toorpu facing hospitals
author: 
-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ 96 42 70 61 28 www.sampadha.com

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>