విశాఖపట్నం, మార్చి 8: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజగర్జన సదస్సు విజయవంతానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త శ్రమించాలని ఆపార్టీ నగర శాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ పిలుపునిచ్చారు. నగర పార్టీ కార్యాయలంలో శనివారం వేర్వేరుగా జరిగిన పార్టీ లీగల్‌సెల్, యువత సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజగర్జన సదస్సు సందర్భంగా విశాఖ వచ్చే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతం పలకడంతో పాటు భారీ స్థాయిలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ చేపట్టనున్నట్టు ఈసందర్భంగా తెలుగుయువత అధ్యక్షుడు లొడగల కృష్ణ తెలిపారు. నగరంలోని 72 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని కోరారు.
అంతకు ముందు పార్టీ లీగల్‌సెల్ విభాగం ఆధ్వర్యంలో కన్వీనర్ నర్రా వెంకటరమణ ఆధ్వర్యంలో వాసుపల్లి ప్రజాగర్జన పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రతిష్టాత్మకమైన గర్జన సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరాన నడిపే సత్తా చంద్రబాబు నాయుడుకే ఉందని అన్నారు. సమావేశంలో సి.ఉమాదేవి, కెవి స్వామి, కర్రి పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.
* గర్జనకు తరలిరండి * లీగల్‌సెల్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల
english title:
garjana
Date:
Sunday, March 9, 2014