హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక బిజెపి చేసిన కృషిని, రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేసిందో వివరించేందుకు బిజెపి మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ అభినందన సభను హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్, సీనియర్ నేత అరుణ్‌జైట్లీ సహా పార్టీ సీనియర్ నేతలు అంతా పాల్గొంటారని అన్నారు. బిజెపి నేతల బృందం సోమవారం సాయంత్రం నిజాం కాలేజీ గ్రౌండ్‌ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిధిగా హజరుకానున్న ఈ సభకు నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచే గాక, శివార్ల నుంచి కూడా భారీగా జనసమీకరణ చేసే పనిలో కమలనాధులు నిమగ్నమై ఉన్నారు. గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి నేతృత్వంలో నగర కార్యవర్గం జనసమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తుంది. అలాగే యువమోర్చా, మహిళా మోర్చా, దళిత మోర్చాలకు చెందిన నేతలు ఎవరికి వారే తమ బలాన్ని చాటుకునేందుకు జనాన్ని సమీకరించే పనిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగటంతో టికెట్లు ఆశిస్తున్న నేతలు సభకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో జనసమీకరణ చేసే దిశగా వ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచే గాక, తెలంగాణలోని పది జిల్లాల నుంచి భారీగా జనాన్ని తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావ అభినందన సభను 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్, సీనియర్ నేత అరుణ్‌జైట్లీ సహా పార్టీ సీనియర్ నేతలు అంతా పాల్గొంటా రు. కాగా బిజెపి నేతల బృందం నిజాం కాలేజీ గ్రౌండ్‌ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిజాం కళాశాలలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న బిజెపి నేతలు