అనంతపురం, మార్చి 11: అనంతపురం వైకాపాలోఎంపి అనంత వెంకటరామిరెడ్డి చేరిక చిచ్చురేపింది. అనంత చేరికను మొదటినుంచి ఎమ్మెల్యే గురునాథరెడ్డి వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది. చివరకు అనంత హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో పార్టీలో చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో గురునాథ్‌రెడ్డి వర్గీయులు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఒక దశలో గురునాథ్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధిష్ఠానం మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని మంగళవారం అనంతపురం పంపింది. వీరితో పాటు జిల్లా వైకాపా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు గురునాథరెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో మాట్లాడారు. పెద్దిరెడ్డిని వైకాపా కార్యకర్తలు అడ్డుకాని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతపురం వైకాపాలోఎంపి అనంత వెంకటరామిరెడ్డి చేరిక చిచ్చురేపింది
english title:
anantha
Date:
Wednesday, March 12, 2014