
శ్రీకాకుళం, మార్చి 11: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి సంపూర్ణ కిరణ దర్శనంతో మంగళవారం భక్తులు ఆనంద పరవశులయ్యారు. చివరిరోజు ఉదయభానుని లేలేత కిరణాలు ఆదిత్య ధృవమూర్తిని సంపూర్ణంగా స్పర్శించాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. ఉదయం 6.23 గంటల నుండి 6.32 గంటల వరకు తొమ్మిది నిముషాలపాటు బంగారు వర్ణ్ఛాయలో స్వామివారి పాదాలను నుంచి శిరస్సు వరకు తాకిన దృశ్యాన్ని తిలకించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. మరుపురాని దృశ్యం ఆవిష్కృతమైన సందర్భాల్లో వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. ఆంగ్ల క్యాలెండర్‌ను అనుసరించి ప్రతీఏటా ఉత్తరాయణం, దక్షిణాయణంలో రెండు పర్యాయాలు మూడురోజులు చొప్పున ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి సంపూర్ణ కిరణ దర్శనంతో
english title:
aditya
Date:
Wednesday, March 12, 2014