కడప, మార్చి 11: ఎడా పెడా వచ్చిన ఎన్నికలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి నేతలు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కడప జిల్లా నేతలు ఎన్నికల ధన ప్రవాహాన్ని మరింత వేగవంతం చేశారు. మంగళవారం జిల్లాలోని అట్లూరు వద్ద జరిపిన తనిఖీల్లో 58 లక్షల నగదు పట్టుబడింది. అంతకు ముందు రెండు రోజుల్లో తనిఖీ అధికారులు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లోని చెక్ పోస్టుల ద్వారా వివిధ రకాల వాహనాల్లో తరలిపోతున్న దాదాపు 50 లక్షల రూపాయలు పట్టుకున్నారు. పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండడంతో నగదుతోపాటు మద్యం, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు చీరలు ఇతరత్రా సరుకులు సమీకరించుకుంటున్నారు. ఇందులోభాగంగా తనిఖీ అధికారులనుండి తప్పించుకోవడానికి చాకచక్యంగా స్థావరాలు మారుస్తున్నారు. ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన మైలవరంలో 41 గ్యాస్ స్టౌవ్‌లను పోలీసుల తనిఖీల్లో బయట పడ్డాయి. బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు విజయావకాశాలను మెరుగు పరుచుకునే ప్రయత్నంలో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి భారీ సంఖ్యలో చీరలు సిద్ధం చేశారు. భారీగా నిల్వ చేసిన చీరలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎడా పెడా వచ్చిన ఎన్నికలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి నేతలు భారీగా
english title:
money flow
Date:
Wednesday, March 12, 2014