విజయవాడ, మార్చి 11: రాష్టవ్య్రాప్తంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు, మాస్ కాపీయింగ్‌ను నివారించేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్ మోగినా, ఎస్‌ఎంఎస్ వెళ్లినా కూడా నిమిషాల్లో హైదరాబాద్‌లోని కేంద్రీకృత కార్యాలయానికి సమాచారం చేరుతుంది. ఇటీవల కొన్ని పరీక్షల్లో అత్యాధునిక టెక్నాలజీతో కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈదఫా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే వారెవరైనా సెల్‌ఫోన్లు వినియోగిస్తే కాల్‌లిస్ట్ వివరాలు వెంటనే హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయానికి ఇట్టే తెలిసిపోతాయి. నిఘా ప్రక్రియలో భాగంగా సెల్‌టవర్లను ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగించబోతున్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జిపిఎస్) ద్వారా ఈ కొత్త విధానాన్ని ఇప్పటి నుంచే రాష్టవ్య్రాప్తంగా అమలు చేయబోతున్నారు. కృష్ణా జిల్లాలోని మొత్తం 159 కేంద్రాలకు కూడా సెల్‌టవర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్ కేంద్రానికి అనుసంధానం చేశారు. పలుమార్లు సమావేశాలు నిర్వహించి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు, లేదా సిబ్బంది సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్‌మెంటల్ అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా తీసుకొస్తే సెల్‌టవర్ల ద్వారా తెలుసుకుని వారిని కఠినంగా శిక్షించనున్నట్లు సమాచారం.
విభజన దృష్ట్యా ఈదఫా తెలంగాణ ప్రాంత సమాధాన పత్రాలను అక్కడే దిద్దించాలని, సీమాంధ్ర జిల్లాలకు పంపించవద్దంటూ ఆ ప్రాంత నేతలు ఇంటర్మీడియట్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈవిషయమై బోర్డు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీమాంధ్రలోని విజయవాడ, విశాఖ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులోని కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారిలో 60శాతం మందికి పైగా తెలంగాణ ప్రాంత విద్యార్థులేనన్నది ఒక అంచనా. తెలంగాణ నేతల డిమాండ్‌పై గుంటూరు హిందూ కళాశాలలో సుదీర్ఘకాలం అధ్యాపకునిగా పనిచేసి యుటిఎఫ్‌లో ముఖ్యనేతగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ఎస్ లక్ష్మణరావు స్పందిస్తూ.. ఎలాగూ విడిపోయింది కనుక మూల్యాంకనంపై లేనిపోని అనుమానాలు రేగకుండా విడివిడిగానే జరిపితే బాగుంటుందన్నారు.
రాష్టవ్య్రాప్తంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల్లో
english title:
cell towers
Date:
Wednesday, March 12, 2014