చిన్నగొట్టిగల్లు, మార్చి 11: ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్‌పైపు తెగిపోవడంతో గ్యాస్‌లీకై ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు పట్ణణంలో జరిగింది. ప్రధాన రహదారి పక్కనే చిన్న టిఫిన్ సెంటర్‌ను తన భార్య శోభారాణి (47)తో కలిపి జూటూరు గోపాల కృష్ణయ్య (55) నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల వరకు టిఫిన్ సెంటర్ నడపి, సాయంత్రానికి టిఫిన్ సెంటర్‌కు కావలసిన వంటకాలు తయారు చేస్తుండగాప్రమాదవశాత్తూ గ్యాస్‌పైపు తెగిపోయి గ్యాస్ పూర్తిగా లీకయింది. దీంతో మంటలు పెద్దఎత్తున చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. శోభారాణి, గోపాలకృష్ణయ్య, వేరొక గదిలో టివి చూస్తున్న దత్తకుమార్తె పావని (18), మరదలి కుమార్తె భారతి (20) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లోని వస్తువులు, డబ్బులు, వంట సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో నుండి పెద్దగా కేకలు రావడంతో పక్క ఇళ్లల్లోని వారు మంటలు ఆర్పివేశారు. పీలేరు అగ్ని మాపక అధికారి జలాన్‌ఖాన్ తన సిబ్బందితో అగ్ని మాపక వాహనంతో ఘటనాస్థలానికి చేరుకున్నా అప్పటికే మంటలను ఆర్పివేశారు.
* నలుగురికి తీవ్రగాయాలు
english title:
four injured
Date:
Wednesday, March 12, 2014