విశాఖపట్నం, మార్చి 11: విశాఖలో టిడిపి బుధవారం నిర్వహించనున్న ప్రజాగర్జన సభకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విశాఖలో ఈ సభను ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు శ్రేణులకు పిలుపు ఇవ్వడంతో సభకు భారీ సమీకరణ చేసే పనిలో ఉన్నారు. ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభను నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అక్కడ సభ నిర్వహించకూడదని అధికారులు చెప్పారు. టిడిపి నాయకులు ఆర్‌కె బీచ్‌లో గర్జన సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అక్కడ జెసిబిలతో ఇసుకను చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఐఎఎస్ అధికారి శర్మ స్పందించి, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని ఇసికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న అధికారులు అదనపు జాయింట్ కలెక్టర్ వై.నర్సింహరావును సభా స్థలికి పంపించారు. వెంటనే పనులు నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు సభా స్థలికి చేరుకుని, పనులు కొనసాగిస్తామంటూ ఆందోళనకు దిగారు.
విశాఖలో టిడిపి బుధవారం నిర్వహించనున్న ప్రజాగర్జన
english title:
tdp
Date:
Wednesday, March 12, 2014