
రాజమండ్రి, మార్చి 11: కేంద్రమంత్రి జైరాం రమేష్ మంగళవారం రాజమండ్రి పర్యటనలో జై సమైక్యాంధ్ర పార్టీకి చెందిన యువకుల నుండి నిరసన ఎదుర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం పర్యటనను ముగించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్న ఆయన ఒక హోటల్‌లో విలేఖర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో వ్యూహాత్మకంగా కొంత మంది యువకులు హోటల్ లోపలకు ప్రవేశించి, ఎవరికీ అనుమానం రాకుండా దూరంగా నిలబడ్డారు. విలేఖర్ల సమావేశాన్ని ముగించుకున్న అనంతరం కాకినాడ బయలుదేరేందుకు కారు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 20మంది యువకులు కేంద్రమంత్రి జైరాంరమేష్ కారు వైపునకు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ దూసుకొచ్చే ప్రయత్నంచేసారు. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, జైరాంరమేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
- 11మంది అరెస్టు, విడుదల -
english title:
arrest
Date:
Wednesday, March 12, 2014