బార్బడాస్, మార్చి 12: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో టి-20 క్రికెట్ మ్యాచ్‌ని వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో చివరిదైన మూడో టి-20కి ప్రాధాన్యం లేకుండా పోయింది. తొలి టి-20లో విజయం సాధించి, హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులకు కట్టడి చేసింది. డానియెల్ హాలెల్ (40), జోస్ బట్లర్ (67) ఇంగ్లాండ్‌కు మెరుగైన స్కోరు సాధించేందుకు ప్రయత్నించారు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ విండీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ప్రత్యేకించి క్రిష్మన్ శాంటోకీ బంతులను అర్థం చేసుకోలేక ఇబ్బంది పడ్డారు. శాంటోకీ నాలుగు ఓవర్లలో 21 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. డ్వెయిన్ బ్రేవో 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఇంగ్లాండ్‌ను ఓడించడానికి 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ ఐదు వికెట్లు కోల్పోయింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. డ్వెయిన్ స్మిత్ (30), క్రిస్ గేల్ (36), మార్లొన్ సామ్యూల్స్ (28), కెప్టెన్ డారెన్ సమీ (30 నాటౌట్) విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టిమ్ బ్రెస్నెన్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. డెర్న్‌బ్యాచ్, రవిబొపారా, ల్యూక్ రైట్ తలా ఒక వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లతో రాణించిన విండీస్ పేసర్ శాంటోకీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మోయెన్ అలీ, స్టెఫెన్ పారీ టి-20 ఫార్మెట్‌లో అరంగేట్రం చేశారు.
...............
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్రిష్మన్ శాంటోకీ
..................
స్విస్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్
రెండో రౌండ్‌కు
కశ్యప్, సింధు
బసెల్, మార్చి 12: భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, ఆనంద్ పవార్ పురుషుల విభాగంలో, పివి సింధు మహిళల విభాగంలో ముందంజ వేశారు. ఇక్కడ జరుగుతున్న స్విస్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో కశ్యప్, పవార్ రెండో రౌండ్ చేరారు. కాగా, క్రాంత్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు ఎరిక్ మెజిస్‌ను ఢీకొన్న కశ్యప్ 21-17, 21-15 తేడాతో వరుస సెట్లలో గెలిచాడు. ఈ మ్యాచ్ 34 నిమిషాల్లోనే ముగిసింది. పవార్ 21-17, 21-10 ఆధిక్యంతో మలేసియాకు చెందిన కాక్ పాంగ్ లోక్‌ను ఓడించాడు. అయితే, థాయిలాండ్ గ్రాండ్ ప్రీ విజేత శ్రీకాంత్ తొలి రౌండ్‌లో స్వీడన్ ఆటగాడు హెన్రీ హర్స్‌కెనిన్ చేతిలో 21-19, 18-21, 17-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. రెండో రౌండ్‌కు చేరలేకపోయినప్పటికీ శ్రీకాంత్ కడ వరకూ గొప్ప పోరాట పటిమతో, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.
మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ పివి సింధు తొలి అడ్డంకిని సులభంగానే అధిగమించింది. మలేసియాకు చెందిన సనాతసా సనిరూను ఆమె 21-18, 21-15 తేడాతో, కేవలం 32 నిమిషాల్లోనే ఓడించింది. సైలీ రాణే పోరాటానికి మొదటి రౌండ్‌లోనే తెరపడింది. ఆమెను 21-8, 21-9 తేడాతో షియానన్ వాంగ్ చిత్తుచేసింది. అదే విధంగా మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తరుణ్ కోన, అశ్వినీ పొన్నప్ప పోరు ముగిసింది. రాబర్ట్ మాటెసియక్, అగ్నేజ్కా వజికొవ్‌స్కా జోడీ 21-10, 16-21, 21-13 స్కోరుతో తరుణ్, అశ్వినీ జోడీపై గెలుపొంది రెండో రౌండ్ చేరింది.
రీస్ కోల్పోయిన ఇంగ్లాండ్
english title:
v
Date:
Thursday, March 13, 2014