న్యూఢిల్లీ, మార్చి 15: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి వంద సీట్లు దక్కడం కష్టమంటూ వస్తున్న వివిధ సర్వేలను కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అపహాస్యం చేశారు. ఎన్నికల సర్వేలు నిజానికి ‘జోకులు’ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలతో శనివారం భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రధాని కావడం, బిజెపి అధికారం చేపట్టడం జరిగే పనికాదన్నారు. మోడీతో పాటు అనేక మంది సీనియర్ నేతలకు టిక్కెట్లు ఇచ్చే విషయమై బిజెపిలో అంతర్గత పోరు కొనసాగుతోందన్నారు. ఓటర్లను తక్కువగా అంచనా వేసేందుకే ‘కాంగ్రెస్‌కు వంద సీట్లు..’ అంటూ తప్పుడు సర్వేలను బిజెపి నేతలు చేయిస్తున్నారని ఆరోపించారు. సర్వేలను పట్టించుకోనపుడే ఓటర్లు బిజెపిని తరిమికొట్ట వచ్చని అన్నారు. ఇలాంటి సర్వేలు వచ్చినప్పటికీ 2004, 2009లో కాంగ్రెస్‌కే అధికారం దక్కిందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీలు విసిరే వలలో చిక్కుకోవద్దని రాహుల్ ఓటర్లకు సూచించారు. మతతత్వాన్ని పెంచే మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం లోకి వస్తుంది గనుక మోడీకి ప్రధాని పదవిని చేపట్టే అవకాశం రాదన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి వంద సీట్లు దక్కడం
english title:
rahul
Date:
Sunday, March 16, 2014