అమేథీ, మార్చి 15: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌పై అమేథీ నియోజకవర్గంలోని కమ్‌రాలి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ అధికారి ఎ.పి.తివారి తెలిపారు. విశ్వాస్‌తోపాటు మరో 65 మందిపై కేసు నమోదు చేసినట్లు, వారిలో ఆ గ్రామాధికారి ఇషాక్ అహ్మద్ కూడా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు తమను అడ్డుకున్నందుకే గొడవలు జరిగాయని విశ్వాస్ ఆరోపించారు. విశ్వాస్ ఆరోపణలను స్థానిక కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. అమేథీలో ఏదో ఒక విధంగా అలజడి సృష్టించేందుకు కుమార్ విశ్వాస్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి చంద్రకాంత్ దుబె ఆరోపించారు. ప్రజల నుంచి ఏమాత్రం మద్దతు లభించనందువల్లే విశ్వాస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. ఘర్షణల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. ఈ సంఘటనలపై దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా మేజిస్ట్రేట్ జగత్రజ్ విలేఖరులకు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌పై అమేథీ
english title:
fir
Date:
Sunday, March 16, 2014