కోల్‌కతా, మార్చి 16: రంజీ, ఇరానీ కప్ చాంపియన్ పోటీల్లో విజేతగా నిలిచిన కర్నాటక ఆదివారం ఇక్కడ జరిగిన విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లోనూ విజయభేరి మోగించి, చారిత్రాత్మక ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఈ జట్టు నాలుగు వికెట్ల తేడాతో రైల్వేస్‌ను ఓడించి, విజయ్ హజారే ట్రోఫీ విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన కర్నాటక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 47.4 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. రోగ్సెన్ జొనథాన్ 46, అరిందమ్ ఘోష్ 33 పరుగులతో రాణించగా, మిగతా బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. కర్నాటక బౌలర్లలో అభిమన్యు మిథున్ 19 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చాడు. రాబిన్ ఉతప్ప 19 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. దేశవాళీ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీ ఫైనల్‌కు ఏ మాత్రం తగని అత్యంత సాదాసీదా లక్ష్యాన్ని కర్నటక 43 ఓవర్లలో, ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. కరుణ్ నాయర్ అజేయంగా 53 పరుగులు చేసి కర్నాటక విజయానికి సహకరించాడు. లోకేష్ రాహుల్ 38 పరుగులు సాధించాడు. రైల్వేస్ బౌలర్లలో కృష్ణ కాంత్ ఉపాధ్యయ 30 పరుగులకు మూడు, అనురీత్ సింగ్ 41 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్
english title:
f
Date:
Monday, March 17, 2014