బసెల్, మార్చి 16: స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ ఇహాన్ వాంగ్ గెల్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె సన్ యూను 21-23, 21-8, 21-11 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌లో తీవ్రంగా పోరాడినప్పటికీ సన్ యూ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న ఇహాన్ ఆతర్వాత రెండు సెట్లలో సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వాటిని సొంతం చేసుకొని టైటిల్ అందుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో ఇక్సిన్ బవో, జిషు టాంగ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఈ జోడీ 19-21, 21-16, 21-13 తేడాతో నిత్య క్రిషిందా మహేశ్వరి, గ్రేసిన్ పొలీ జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సె న్ 21-7, 16-21, 25-24 ఆధిక్యంతో హూవెయ్ తియాన్‌ను ఓడించి టైటిల్ సాధించాడు.
పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో బియావో చయ్, వెయ్ హాంగ్ జోడీ 22-20, 21-14 స్కోరుతో హైఫెంగ్ ఫూ, నన్ జాంగ్ జోడీపై గెలుపొంది టైటిల్ గెల్చుకుంది.
స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్
english title:
swiss
Date:
Monday, March 17, 2014