ముంబయి, మార్చి 16: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ టొయోటా బెంగళూరు సమీపంలోని బిదాడి వద్దనున్న తమ రెండు తయారీ కేంద్రాలను లాకౌట్ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. వేతన సంప్రదింపులపై కార్మిక సంఘాలు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రెండు ప్లాంట్లను లాకౌట్ చేస్తున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ స్పష్టం చేసింది. ఏటా 3,10,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లలో గత 25 రోజుల నుంచి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిమాండ్లపై గత పది నెలలుగా యాజమాన్యం, కార్మిక సంఘం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ద్వైపాక్షిక ఒప్పందం సఫలం కాకపోవడంతో సెటిల్మెంట్‌లో భాగంగా కర్నాటక కార్మిక శాఖ ఏడుసార్లు త్రైపాక్షిక సమావేశాలు నిర్వహించింది. అయినా రాజీ చర్చలు సత్ఫలితం చూపలేకపోయాయి.’ అని ఓ ప్రకటనలో టొయోటా తెలిపింది.
ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ టొయోటా బెంగళూరు సమీపంలోని బిదాడి వద్దనున్న తమ రెండు తయారీ
english title:
k
Date:
Monday, March 17, 2014