న్యూఢిల్లీ, మార్చి 16: ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో తయారీ రంగం ద్వారా 3.2 మిలియన్ ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పారిశ్రామిక వ్యవస్థ అసోచామ్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగైనకొద్దీ క్రమంగా పుంజుకునే తయారీ రంగంతో అదనంగా 3.2 మిలియన్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అసోచామ్ తెలిపింది. 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12) లోనూ పెరిగిన ఉద్యోగ కల్పనలో తయారీ రంగం 28.5 శాతం వాటాను కలిగి ఉందని అసోచామ్ ఈ అధ్యయనంలో గుర్తించింది. ‘2007-08 లో 10.45 మిలియన్ ఉద్యోగాలుంటే, 2011-12 నాటికి వీటికితోడు మరో 2.9 మిలియన్ ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి.’ అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇదిలావుంటే గత పంచవర్ష ప్రణాళికలో దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యోగ సృష్టిలో తమిళనాడు అత్యధికంగా 14.5 శాతం వాటాతో ముందున్నట్లు అసోచామ్ సర్వే ద్వారా తేటతెల్లమైంది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (14 శాతం), గుజరాత్ (10 శాతం) రాష్ట్రాలున్నాయి. అయితే 11వ పంచవర్ష ప్రణాళికలో తయారీ రంగం ద్వారా ఏర్పడిన ఉద్యోగాలను చూస్తే ఉత్తరాఖండ్‌లో ఇవి అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత బీహార్ (71.8 శాతం), హిమాచల్ ప్రదేశ్ (70 శాతం), ఒడిషా (54 శాతం), మహారాష్ట్ర (38.8 శాతం) ఉన్నాయి. చత్తీస్‌గఢ్ (19 శాతం), ఉత్తరప్రదేశ్ (15 శాతం), హర్యానా (14 శాతం), కేరళ (10.5 శాతం), పంజాబ్ (9 శాతం) రాష్ట్రాలు ఉద్యోగ కల్పనలో చివరి స్థానంలో ఉన్నాయి.
* అసోచామ్ అధ్యయనం వెల్లడి
english title:
t
Date:
Monday, March 17, 2014