Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆ ‘పాత’ మధురాలను వెండితెరపై చూడలేమా?

$
0
0

రాజకుమారుడు కళ్ల ముందు కనిపించినా వీడు రాజకుమారుడెమిటి? రాజకుమారుడంటే కాంతారావులా ఉండాలనిపిస్తుంది. కాంతారావు ఒక చేత్తో కత్తి ఝులిపిస్తూ మరో చేత్తో గుర్రాన్ని అదిలిస్తున్నాడు. గుర్రం పరుగులు తీస్తోంది. మీ చేతిలో పల్లీ పొట్లం ఉంది. ఒక్కో పల్లీకాయ తింటూ పెద్ద తెరపై ఈ దృశ్యం చూస్తుంటే ఎలా ఉంటుంది. ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా ఉంటుంది కదూ! సాహసం సేయరా డింభకా రాజకుమారి లభిస్తుంది అని ఎస్వీఆర్ చెబితే పాపం రాజకుమారిని ప్రేమించిన తోటమాలి ఎన్టీఆర్ ఆమె కోసం ఎస్వీఆర్‌ను నమ్ముకొంటే ప్రేమకోసమై వలలో పడెనే అయ్యో పాపం పసివాడు అనే పాట బ్యాక్ గ్రౌండ్ నుంచి వినిపిస్తుంటే ఎన్టీవోడి ప్రేమ ఎలాగైనా విజయవంతం కావాలని మొక్కుకోకుండా ఉంటామా?
ఎన్టీఆర్ చాంతాడంత పద్యాలు చదివితే, ‘్ఛ.. బానిసలు’ అని ఎస్వీఆర్ ఒక్క ముక్కలో తేల్చేయడం గుర్తుందా? పెద్దతెర కన్నా ఎస్వీఆర్ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటి భారీ నటున్ని బుల్లితెరపై చూసి సంతృప్తి పడగలమా?
రాముడు భీముడులో ఎన్టీఆర్ హోటల్‌కెళ్లి షుష్టుగా భోజనం చేసిన తరువాత అమాయక చూపులతో రెండో ఎన్టీఆర్ వచ్చి టిఫిన్ చేయకముందే బిల్లు కట్టడం చూసి అమాయకులంటే అందరికీ చులకనే అనుకోకుండా ఉంటామా?
మాయాశశిరేఖగా సావిత్రి నటన, కన్యాశుల్కంలో మధురవాణిగా ఆమె నవ్వు పెద్ద తెరపై చూసిన వాళ్లం మరిచిపోతామా? మిస్సమ్మలో జమున పెంకితనం గుర్తుందా? ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ లాంటి హేమా హేమీలుంటే గుండమ్మ కథ అంటూ గయ్యాలి సూర్యకాంతం పేరుతో సినిమా టైటిల్ పెట్టడం సాహసం కాకమరేమిటి? వాణిశ్రీ స్టైల్ , అందగత్తెలు భారతి, కృష్ణకుమారి, కాంచన ఒక్కోక్కరిది ఒక్కో ప్రత్యేకత. వీరందరి సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి ల హాస్యం. రాజబాబు, రమాప్రభల జంట చిలిపి చేష్టలు ఎనె్నన్నో... సూర్యకాంతం గయ్యాళితనం వల్లే కదా ఇప్పటి వరకూ ఆ పేరును ఎవరూ పెట్టుకోవడం లేదు.
ఇలాంటి అద్భుతమైన సినిమాలన్నీ చిన్నప్పుడు పెద్దతెరపై చూసిన మనం వాటిని ఏనాటికీ మరిచిపోలేం. ఈ సినిమాలు మొదటి సారి థియోటర్లలో విడుదలైనప్పుడు ఆనాటి తరం అనుభూతి ఏమిటో కానీ 85 వరకు వీటిని థియేటర్లలో మార్నింగ్ షోల్లో చూసిన వారు మాత్రం మరిచిపోలేరు. మనం చూడాలనుకుంటే ఈ సినిమాలన్నీ క్షణాల్లో ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షం అవుతాయి. కానీ ఆనాడు సినిమా చూసినప్పటి అనుభూతి ఇంటర్‌నెట్ ద్వారా చూడడంలో లభిస్తుందా? పెద్ద తెరపై ఇలాంటి సినిమాలను చూడడంలో ఉన్న మజానే వేరు. 1985 ప్రాంతం వరకు ఇలాంటి అద్భుతమైన కళాఖండాలన్నీ పెద్ద తెరపై చూసే అవకాశం ఉండేది.
మళ్లీ మనం వాటిని పెద్ద తెరపై చూడగలమా?అది మన చేజారిపోయిన అదృష్టమేనా? ప్రభుత్వం దయతలిస్తే, కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఆనాటి అదృష్టం మళ్లీ మనం అనుభవించవచ్చు.
దాదాపు 1985 వరకు ఇలాంటి అద్భుతమైన సినిమాలను పెద్ద తెరపై చూసే అవకాశం ఉండేది. కళాకారుడైన ఎన్టీరామారావు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పాలన విషయం ఎలా ఉన్నా సినిమా అభిమానులకు మాత్రం ఈ అదృష్టం లేకుండా పోయింది. దాదాపు 85 వరకు హైదరాబాద్‌తో పాటు పెద్ద పట్టణాల్లో సినిమా హాళ్లలో మార్నింగ్ షోలను ప్రత్యేకంగా ప్రదర్శించే వారు. ఇప్పుడు ఏ సినిమా అయినా నాలుగు ఆటలు ప్రదర్శిస్తున్నారు. అప్పుడు అలా ఉండేది కాదు. కొత్త సినిమా మొదటి మూడు నాలుగు రోజులు నాలుగు ఆటలు ప్రదర్శించినా, ఆ తరువాత మార్నింగ్ షోను పాత సినిమాలనే ప్రదర్శించే వారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ మనం పది అద్భుతమైన సినిమాల పేర్లు చెప్పుకుంటే, ఆ పదీ 1955 నుంచి 70 ప్రాంతంలో వచ్చినవే. మాయాబజార్, మిస్సమ్మ, రాముడు భీముడు, దేవదాసు వంటి సినిమాలన్నీ ఆ కాలంలో వచ్చినవే.
1980 కాలం నాటి యువత, పిల్లలు సైతం ఈ సినిమాలను థియేటర్లలో తిలకించి, ఇప్పటికీ వాటిని మరిచిపోలేకపోతున్నారు. దానికి కారణం ఆ రోజుల్లో సినిమా హాళ్లలో ఉదయం పూట పాత సినిమాలను ప్రదర్శించే అవకాశం ఉండడమే. గతంలో ఇప్పటి మాదిరిగా వందలాది థియోటర్లలో కొత్త సినిమాల విడుదల వంటివి ఉండేవి కావు.
మూడు షోలు కొత్త సినిమా, లేదా కొన్ని థియేటర్లలో ఆడి వచ్చిన సినిమా అయినా ప్రదర్శించే వారు. మార్నింగ్ షో మాత్రం పాత సినిమాలు ప్రదర్శించే వారు. మార్నింగ్ షోకు థియేటర్ వాళ్లు చెల్లించే పన్ను తక్కువగా ఉండేది, అదే సమయంలో టికెట్ ధర కూడా తక్కువగా ఉండేది.
దీని వల్ల థియేటర్ల వాళ్లు పాత సినిమాలనే మార్నింగ్ షోలుగా ప్రదర్శించే వాళ్లు. సహస్ర శిరచ్ఛ్ధే అపూర్వ చింతామణి, భీష్మ, బభ్రువాహన, శభాష్ సత్యం, రాము, రేలంగి హీరోగా వచ్చిన పక్కింటి అమ్మాయి, గుళేభకావళి కథ ఎనె్నన్నో అద్భుతమైన సినిమాలను మార్నింగ్ షోలుగా ప్రదర్శించే వాళ్లు.
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత థియేటర్ల వాళ్లు పన్నులు చెల్లించే విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని స్లాబ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో మార్నింగ్ షోలకు ఉరి తీసినట్టు అయింది. ఎన్ని సీట్లు ఉంటే అంత పన్ను కట్టాలి. మార్నింగ్ షోలకు ప్రత్యేక రాయితీ ఏమీ లేదు. దాంతో థియేటర్లు మార్నింగ్ షోలకు మంగళం పాడి ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు నాలుగు షోలు ఒకే సినిమాను ప్రదర్శిస్తున్నారు.
ఆ నిర్ణయంతో పాత సినిమాలను హాయిగా సినిమా హాలులో పెద్ద తెరపై చూద్దామనుకునే వారికి ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆ కాలంలోనే ఎన్టీఆర్ సినిమా వారోత్సవాలు అంటూ ఆయన నటించిన అద్భుమైన ఏడు సినిమాలను రోజు కొకటి చొప్పున కొద్ది థియేటర్లలో ప్రదర్శించే వాళ్లు. అదే విధంగా అక్కినేని సినిమా వారోత్సవం, కృష్ణ, సావిత్రిల పేర్లతో ఇలానే చూపించే వాళ్లు.
ఇప్పుడు ఈ సినిమాల సీడీలు దొరుకుతున్నాయి. టీవిల్లో అప్పుడప్పుడు వీటిని ప్రదర్శిస్తున్నారు. టీవిల్లో ఐదు నిమిషాల కోసారి వచ్చే ప్రకటనల మధ్య ఇలాంటి సినిమాలను చూడడం, వాటిని జీర్ణం చేసుకోవడం కొంచం కష్టమే. ఇక సీడీల్లో వీటిని బంధించినా బుల్లితెరపై ఇంట్లో చూడడం వేరు, థియేటర్లలో ఇలాంటి సినిమాలు చూసేప్పుడు ఉండే అనుభూతి వేరు.
టూరిజం అభివృద్ధి అంటూ కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఐ మాక్స్‌ల పేరుతో థియేటర్లకు కట్టబెట్టేవాళ్లు కనీసం ఒకటి రెండు థియేటర్లలోనైనా పాత సినిమాలను ఉదయం సమయంలో ప్రదర్శించేందుకు పన్ను రాయితీ ఇవ్వలేరా? పాత సినిమాలు ప్రాచీన సంపద వంటివే. కళాఖండాలను కాపాడు కోవడం మన ధర్మం. ఇలాంటి కళాఖండాలను పెద్ద తెరపై చూసే అదృష్టం కల్పించలేరా? ఇలాంటి అద్భుతమైన సినిమాల డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలతో సికింద్రాబాద్‌లోని రాష్టప్రతి రోడ్ కళకళలాడుతూ ఉండేది. పాత పోస్టర్లలా ఇప్పుడా కార్యాలయాలు బోసిపోయాయి. ఈ సినిమాల రీళ్లు వాళ్ల వద్ద భద్రంగానే ఉండొచ్చు. కాస్త కళాహృదయంతో ప్రభుత్వం ఆలోచిస్తే వాటిని తిరిగి వెండితెరపై చూసే భాగ్యం దక్కుతుంది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో కేవలం 5శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయనుకుంటే భ్రమనే. ప్రభుత్వం పన్నురాయితీలతో ముందుకు రాకపోయినా ప్రయోగాత్మకంగా ఒకటి రెండు థియేటర్లు మార్నింగ్ షోలుగా పాత సినిమాలను ప్రదర్శించి చూస్తే పోయేదేముంది.

రాజకుమారుడు కళ్ల ముందు కనిపించినా వీడు
english title: 
old hits
author: 
- బుద్దా మురళి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>