విశాఖపట్నం, మార్చి 17: దేశానికి ఆశాకిరణమైన నరేంద్రమోడీని ప్రధానిని చేయడం.. అందుకు అవసరమైన 272 ఎంపి సీట్లుగెలవడం తమ ముందున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ భిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. ఎపి బిజెపి శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖపట్నం వచ్చిన ఆయన సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తుల అంశాన్ని కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వారం రోజుల్లోగా దీనిపై ఒక స్పష్టత వస్తుందని తెలుగుదేశంతో పొత్తుపై ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, జెడ్పీ, ఎంపిపి ఎన్నికలపై ఏ రాజకీయ పార్టీలకు పెద్దగా ఆసక్తి లేదని, ముందున్న సార్వత్రిక ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయని అభిప్రాయపడ్డారు. బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ త్వరలోనే సీమాంధ్ర ప్రాంలో పర్యటించనున్నట్టు తెలిపారు. విభజన సమయంలో బిజెపి నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ పట్టుబట్టడం వల్లే సీమాంధ్రకు స్వయంప్రతిపత్తితో వచ్చిందన్నారు.
దేశానికి ఆశాకిరణమైన నరేంద్రమోడీని ప్రధానిని
english title:
one week
Date:
Tuesday, March 18, 2014