Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఓటర్ల జాబితాలో విచిత్రం

$
0
0

నెల్లూరు , మార్చి 17: నెల్లూరు నగరంలో ఓటర్ల జాబితాలు తప్పులతడకగా ఉన్నాయంటూ అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కొందరి పేర్లు అయితే ఏ డివిజన్‌లోనూ నమోదుకాక గల్లంతైన అంశాలు కోకొల్లలు. వింతలు, విడ్డూరాలతో కూడిన నెల్లూరు ఓటర్ల జాబితాలో అందరినీ విస్మయపరిచే మరొక విచిత్రం తాజాగా వెలుగు చూసింది. ఎక్కడెక్కడో నివాసం ఉండే ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో చోటు చేసుకోవడం విశేషం. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు నెల్లూరులో అధికారులు ఓటు హక్కు కల్పించారు. 45వ డివిజన్ ఓటర్ల జాబితాలో పుల్లెల ఓటు ప్రత్యక్షమైంది. మరి ఆయన ఏ పార్టీ మద్దతుదారుడో, ఏ పార్టీ ఆయన పేరు నమోదు చేయించాలని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేరో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కే ఏరుక. పుల్లెల గోపీచంద్ ఓటు ఈ డివిజన్‌లోప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏటూరి రవికుమార్ ఆయన ఇంటికోసం ఆ డివిజన్ అంతా గాలించారు. చివరకు పుల్లెల గోపీచంద్ ప్రముఖ క్రీడాకారుడని తెలుసుకున్నారు. ఇలాంటి జాబితాను సవరించకుండానే ఎన్నిలకలకు అధికార యంత్రాగం సమయాత్తం కావడాన్ని ఏమనాలి?

నెల్లూరులో పుల్లెల గోపీచంద్‌కు ఓటు!
english title: 
gopichand

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>