Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కోస్తాలో జడ్పీటిసిలకు తొలిరోజు 28 నామినేషన్లు

$
0
0

విజయవాడ, మార్చి 17: జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. కోస్తా జిల్లాల్లో తొలిరోజు ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. తొమ్మిది జిల్లాల్లోని 168 జడ్పీటిసి స్థానాలకు గాను 28 నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లాలో 1, గుంటూరులో 2, ప్రకాశంలో 2, నెల్లూరులో 5, పశ్చిమగోదావరిలో 2, తూర్పుగోదావరిలో 3, విశాఖలో 12, శ్రీకాకుళం జిల్లాలో 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 31 ఎంపిటిసి నామినేషన్లలో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధులు 10, తెలుగుదేశం అభ్యర్ధులు 8, బిజెపి నుండి 2, సిపిఎం నుండి 2, ఇతర రాజకీయ పార్టీల నుండి 2, స్వతంత్య్ర అభ్యర్ధుల నుండి 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రకాశం జిల్లాలోఎంపిటిసి స్థానాలకు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. నెల్లూరు: జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు జడ్పీటిసికి-5, ఎంపిటిసిలకు 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు సోమవారం నుంచి
english title: 
zptc

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>