నూజివీడు, మార్చి 19: రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించే బస్సు యాత్ర వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్న ఘనత ఒక్క కాంగ్రెస్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నూజివీడు నియోజకవర్గం ముఖ్యనాయకులు, పురపాలక సంఘం వార్డులలో పోటీ చేసే అభ్యర్థుల సమావేశం బుధవారం సాయంత్రం స్థానిక పట్టణ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పార్టీ అద్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు ప్రజలను నిలువునా చీల్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో పదేళ్ళుగా సాగుతున్న కాంగ్రెస్ పాలన వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని అన్నారు. మూడు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవటంతో ప్రజాపాలన స్తంభించిపోయిందని అన్నారు. జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికునిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
* పురపాలక సంఘాల్లో టిడిపి విజయం ఖాయం
జరుగుతున్న పురపాలక సంఘాల ఎన్నికలలో జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఉమ ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎనిమిది పురపాలక సంఘాలలో అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. విజయవాడ కార్పొరేషన్‌లో కూడా గణనీయమైన స్థానాలు సంపాదిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, మండల పార్టీ అధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నూతక్కి వేణుగోపాలరావు, పార్టీ నాయకులు విజయబాబు, పసుపులేటి జగన్‌మోహనరావు, అక్కినేని చందు, జగ్గవరపు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన వైకాపా జడ్‌పి చైర్మన్ అభ్యర్థిని
* తాతినేని పద్మావతి
మచిలీపట్నం టౌన్, మార్చి 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ జడ్‌పి వైస్ చైర్మన్ అయిన తాతినేని పద్మావతి తోట్లవల్లూరు మండల జడ్‌పిటిసి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరధ మహారధులు కోనేరు ప్రసాద్, కుక్కల విద్యా సాగర్, పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ఉప్పులేటి కల్పన తదితరులు హాజరయ్యారు. తోట్లవల్లూరు మండలం నుండి భారీ ఊరేగింపుగా ఆమె జడ్‌పి కార్యాలయానికి తరలి వచ్చారు. జడ్‌పి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో తోట్లవల్లూరు స్థానానికి ఆమె రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా ఆమె కుమార్తె తాతినేని శిల్ప మరో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు అనంతరం కొడాలి నాని, పేర్ని నాని, తాతినేని పద్మావతి విలేఖర్లతో మాట్లాడారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం తధ్యమన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని వైకాపా కైవసం చేసుకుని తీరుతుందన్నారు.
మూడోరోజు వందల్లో నామినేషన్ల దాఖలు
* జడ్‌పిటిసిలకు 112, ఎంపిటిసిలకు 1374 నామినేషన్లు దాఖలు
* నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 19: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడవ రోజైన బుధవారం అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 35 మండలాలకు గాను 112 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా విస్సన్నపేట మండల జడ్‌పిటిసి పదవికి ఏడు నామినేషన్లు వచ్చాయి. గురువారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్‌పిటిసి పదవులకు, జిల్లాలోని 49 మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపిటిసి పదవులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బంటుమిల్లి మండలానికి ఒకటి, బాపులపాడుకు నాలుగు, ఆగిరిపల్లికి రెండు, అవనిగడ్డకు రెండు, చందర్లపాడుకు ఒకటి, చాట్రాయికి ఐదు, జి.కొండూరుకు రెండు, గంపలగూడెంకు ఒకటి, మోపిదేవికి నాలుగు, మండవల్లికి మూడు, కోడూరుకు నాలుగు, కృత్తివెన్నుకు నాలుగు, ముదినేపల్లికి ఒకటి, మైలవరంకు రెండు, ముసునూరుకు మూడు, బందరుకు ఒకటి, మొవ్వకు నాలుగు, కంకిపాడుకు ఒకటి, పమిడిముక్కలకు ఐదు, పెడనకు ఒకటి, నూజివీడుకు నాలుగు, పెనమలూరుకు మూడు, నందిగామకు రెండు, విస్సన్నపేటకు ఏడు, రెడ్డిగూడెంకు నాలుగు, తోట్లవల్లూరుకు నాలుగు, తిరువూరుకు ఆరు, ఉయ్యూరుకు ఒకటి, గన్నవరంకు రెండు, ఘంటసాలకు రెండు, గూడూరుకు నాలుగు, ఇబ్రహీంపట్నంకు ఆరు, జగ్గయ్యపేటకు ఏడు, కైకలూరుకు ఒకటి, కంచికచర్లకు ఎనిమిది చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఎంపిటిసి పదవులకు జిల్లాలోని 49 మండలాల్లో 1374 నామినేషన్లు దాఖలయ్యాయి. బందరు డివిజన్‌లో 202, గుడివాడ డివిజన్‌లో 181, నూజివీడు డివిజన్‌లో 568, విజయవాడ డివిజన్‌లో 423 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో టిడిపి తరఫున 644 మంది, వైకాపా తరఫున 516 మంది, కాంగ్రెస్ తరఫున 59 మంది, బిజెపి తరఫున ఏడుగురు, సిపిఐ తరఫున 14 మంది, సిపిఎం తరఫున 39 మంది, లోక్‌సత్తా తరఫున ఇద్దరు, ఇండిపెండెంట్లుగా 91 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీ గా ఎంపిటిసి పదవులకు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ మండలంలో 21, గుడ్లవల్లేరులో 24, కైకలూరులో 26, కలిదిండిలో 35, మండవల్లిలో 14, ముదినేపల్లిలో 18, నందివాడలో 16, పామర్రులో 14, పెదపారుపూడిలో 13, అవనిగడ్డలో నాలుగు, బంటుమిల్లిలో 17, చల్లపల్లిలో 14, ఘంటసాలలో తొమ్మిది, గూడూరులో 21, కోడూరులో 11, కృత్తివెన్నులో 35, మచిలీపట్నంలో 25, మోపిదేవిలో 16, మొవ్వలో 21, నాగాయలంకలో 13, పెడనలో 16, ఎ.కొండూరులో 31, అగిరిపల్లిలో 35, బాపులపాడులో 41, చాట్రాయిలో 27, గంపలగూడెంలో 67, గన్నవరంలో 12, ముసునూరులో 36, నూజివీడులో 34, పమిడిముక్కలలో 61, రెడ్డిగూడెంలో 12, తిరువూరులో 48, ఉంగుటూరులో 14, విస్సన్నపేటలో 33, ఉయ్యూరులో 12, చందర్లపాడులో 27, జి.కొండూరులో 42, ఇబ్రహీంపట్నంలో 71, జగ్గయ్యపేటలో 61, కంచికచర్లలో 27, కంకిపాడులో 13, మైలవరంలో 40, నందిగామలో 29, పెనమలూరులో 80, పెనుగంచిప్రోలులో 31, తోట్లవల్లూరులో మూడు, వత్సవాయిలో 52, వీరుళ్ళపాడులో 23, విజయవాడ రూరల్ మండలంలో 69 నామినేషన్లు దాఖలయ్యాయి.
నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో...
19వార్డుల్లో బహుముఖ, ఒక్క వార్డులో త్రిముఖ పోటీ
నందిగామ, మార్చి 19: నామినేషన్ల ఉపసంహరణల అనంతరం నందిగామ నగర పంచాయతీకి సంబంధించి 20వార్డుల ఎన్నికల బరిలో 131మంది ఉన్నారు. 19వ వార్డులో కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపా అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉండగా మిగిలిన 20వార్డుల్లో బహుముఖ పోటీ నెలకొని ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి మహమ్మద్ మస్తాన్ పోటీ చేస్తున్న 6వ వార్డులో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులతో కలిసి మొత్తం 13మంది రంగంలో ఉండగా టిడిపి చైర్మన్ అభ్యర్థి పోటీ చేస్తున్న 11వ వార్డులో బిజెపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి, సిపిఎం అభ్యర్థులతో కలిసి 8మంది రంగంలో ఉన్నారు. 1వ వార్డులో ఏడుగురు, 2వ వార్డులో 9మంది, 3వ వార్డులో నలుగురు, 4వ వార్డులో 12మంది, 5వ వార్డులో ఆరుగురు, 6వ వార్డులో 13మంది, 7వ వార్డులో నలుగురు, 8వ వార్డులో నలుగురు, 9వ వార్డులో ఏడుగురు, 10వ వార్డులో ఆరుగురు, 11వ వార్డులో 8మంది, 12వ వార్డులో 6, 13వ వార్డులో నలుగురు, 14వ వార్డులో ఏడుగురు, 15వ వార్డులో 8మంది, 16వ వార్డులో ఐదుగురు, 17వ వార్డులో ఆరుగురు, 18వ వార్డులో ఐదుగురు, 19వ వార్డులో ముగ్గురు, 20వ వార్డులో ఏడుగురు పోటీలో ఉన్నారు. 20వార్డులో టిడిపి, 19వార్డుల్లో వైఎస్‌ఆర్‌సిపి, 9వార్డుల్లో బిజెపి, 17వార్డుల్లో కాంగ్రెస్, 3వార్డుల్లో సిపిఎం, రెండు వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తుండగా 19వ వార్డు మినహా అన్ని వార్డుల్లో కలిపి 61మంది ఇండిపెండెంట్‌లు రంగంలో ఉన్నారు. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలకు చెందిన వారు అత్యధిక వార్డులు కైవసం చేసుకుని నగర పంచాయతీ పాలకవర్గ పగ్గాలు చేపడతామని ధీమా వ్యక్తం చేస్తుండగా బిజెపి, కాంగ్రెస్, ఇండిపెండెంట్‌లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తాము కీలకం కానున్నామని పేర్కొంటున్నారు. ఇవిఎంల ద్వారా తొలిసారిగా జరుగుతున్న నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన
గుడివాడ, మార్చి 19: గుడివాడ డివిజన్‌లోని గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో లెహర్, హెలెన్ తుఫాను నష్టాలను అంచనా వేసేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా రెండు తుఫానులకు నష్టపోయిన పంటపొలాలు, రహదారులు, వంతెనలను బృందం సభ్యులు పరిశీలించారు. బృందానికి నాయకత్వం వహించిన కె రాంవర్మ మాట్లాడుతూ వరుస తుఫాను విపత్తులతో తీవ్రంగా పంటలను నష్టపోయిన రైతులను అన్నివిధాలా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇందు కోసం అవసరమైన నివేదికలను అందజేస్తామన్నారు. గుడ్లవల్లేరు మండల కవుతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తుఫానుల వల్ల జరిగిన నష్టాలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలన జరుపుతున్నామన్నారు. బృందం సభ్యుడు ఆర్‌పి సింగ్ మాట్లాడుతూ రైతుల సూచనలను పరిశీలించి కేంద్ర జలసంఘానికి కూడా నివేదిక అందజేస్తామన్నారు. మరో సభ్యుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రహదారులు, నీటి పథకాల పునరుద్ధరణకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల నిధులను అడ్వాన్స్‌గా విడుదల చేయడం జరిగిందన్నారు. అంతకు ముందు కేంద్ర బృందం గుడివాడ రూరల్ మండల పరిధిలోని తట్టివర్రు గ్రామంలో వరి, మినుము పంటలను పరిశీలించారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో కూలిపోయే స్థితిలో ఉన్న వంతెనను, మామిడికోళ్ళ గ్రామంలో నష్టపోయిన మినుము పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్ జి జయరాజు, డిఇ ప్రసాద్, ఇఇ ఎ అశోక్‌కుమార్, ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీర్ కె శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంట్లో నగలు, నగదు అపహరణ
కూచిపూడి, మార్చి 19: ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగలు, నగదు దొంగిలించిన సంఘటన బుధవారం మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో 44వేల రూపాయల నగదు, దాదాపు నాలుగు కాసుల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు ఈడే నాంచారమ్మ పేర్కొన్నారు. కూచిపూడి ఎస్‌ఐ నాగ సురేష్ అందించిన సమాచారం ప్రకారం మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలోని గౌడ రామాలయం వీధిలోని ఈడే నాంచారమ్మ గృహంలో ఈ దొంగతనం జరిగినట్లు తెలిపారు. నాంచారమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవటంతో హైదరాబాదులోని బంధువులు ఇంటికి ఈనెల 15న వెళ్ళింది. బుధవారం ఉదయం 5గంటలకు బస్సు దిగిన ఆమె ఇంటికి వెళ్ళగా అప్పటికే తలుపులు తాళాలు పగులగొట్టినట్లు గుర్తించింది. లోనికి తొంగి చూడగా బీరువా తలుపులు కూడా తెరిచి ఉండి ఇల్లు అంతా చిందరవందరగా ఉంది. సమీపంలోని బంధువులతో పాటు లోనికి వెళ్ళి చూడగా నగదు, నగలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. ఈ సంఘటనపై ఆమె కుమారుడు రవి కూచిపూడి పోలీసులకు తెలియపర్చాడు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ నాగ సురేష్, చల్లపల్లి సిఐ దుర్గారావు, మచిలీపట్నం క్లూస్‌టీములు పరిశీలించి వేలిముద్రలు స్వీకరించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోండి
* వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్ అక్షయ్‌రౌడ్
మచిలీపట్నం టౌన్, మార్చి 19: రానున్న మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్ అక్షయ్‌రౌడ్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం పటిష్ఠం చేయడంలో ఎన్నికల పాత్ర ఎంతో గణనీయమైనదన్నారు. గత ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ జరిగిన కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు. నైతిక విలువలు పాటించి ఓటు వేసేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో పెయిడ్ ఆర్టికల్స్ నిరోధించేందుకు మీడియా సర్ట్ఫికేషన్ కమిటీ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ మురళి, కమిటీ నోడల్ అధికారి డా. టి దామోదర నాయుడు, ఎంసిఎంసి కమిటీ కన్వీనర్ కె సదారావు, సభ్యులు మహ్మద్ సిలార్, సి సెక్షన్ సూపరింటెండెంట్ సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు
* పోలీసుల అదుపులో నిందితులు
మైలవరం, మార్చి 19: గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొందుగల శివారు పంగిడి చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పొలాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపటానికి ముందు విజయవాడకు చెందిన తోటేటి సత్యానంద్, కుందుర్తి పిచ్చయ్యశాస్త్రులు, కొత్తా హనుమంతరావులతోపాటు విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి మండలం పోతుల మల్లయ్యపాలెం గ్రామానికి చెందిన లెక్కల సత్యం అనే నలుగురు బుధవారం సాయంత్రం పూజలు మొదలెట్టారు. గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించి ఆ ప్రాంతంలో మంటలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్న విషయాన్ని గ్రామస్థురాలు గుర్తించి పెద్ద మనుషుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ వై దుర్గారావు సిబ్బందితో వెళ్ళి గుప్త నిధుల కోసం పూజలు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు. వీరు గతంలో సైతం ఇదే ప్రాంతంలో పూజలు చేసి కొంత భూ భాగాన్ని తవ్వినట్లు స్థానికులు చెబుతున్నారు. అర్థరాత్రి వరకూ వీరు పూజలు నిర్వహించి అర్థరాత్రి నుండి నిధుల కోసం తవ్వకాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో పురాతన పాలరాతి విగ్రహాలు బయల్పడ్డాయి. వీటిపై పురావస్తు శాఖ అధికారులు సైతం పరిశోధనలు చేసి బౌద్ధుల నాటి ఆలయం భూమిలో ఉందని తేల్చారు. దీనిపై స్థానిక అధికారులు సైతం నిఘా వేసి ఉంచారు. ఇదే సమయంలో విజయవాడకు చెందిన పలువురు గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రారంభించటం సంచలనం సృష్టించింది.
గుడివాడలో 36వార్డుల్లో 109నామినేషన్ల దాఖలు
* 31 మంది స్వతంత్రులు
గుడివాడ, మార్చి 19: ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 109 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో 31మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పట్టణంలో మొత్తం 36 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. వైఎస్సార్‌సిపి నుండి 1వ వార్డుకు వసంతవాడ పెదదుర్గారావు, 2వ వార్డుకు కిలారపు రంగప్రసాద్, 3వ వార్డుకు గుత్తా రతన్‌ప్రసాద్, 4వ వార్డుకు రావులకొల్లు లలితకుమారి, 5వ వార్డుకు రంగిశెట్టి గాయత్రి, 6వ వార్డుకు రామలింగేశ్వరరావు, 7వ వార్డుకు అడపా వెంకటరమణ, 8వ వార్డుకు వెంపల హైమావతి, 9వ వార్డుకు యలవర్తి శ్రీనివాసరావు, 10వ వార్డుకు అర్హతున్నీసా, 11వ వార్డుకు ఫాతిమున్నీసా అబ్దుల్, 12వ వార్డుకు షేక్ బాజీభాషా, 13వ వార్డుకు మేరుగు మరియకుమారి, 14వ వార్డుకు జ్యోతుల సత్యవేణి, 15వ వార్డుకు గంధం జూలియమ్మ, 16వ వార్డుకు మాదాసు వెంకటలక్ష్మీకుమారి, 17వ వార