Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అత్యాచారం కేసులో ప్రేమానంద స్వామికి ఏడేళ్ల శిక్ష

$
0
0

నెల్లూరు , మార్చి 20 : ఒక యువతిని భక్తి పేరును వంచించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడన్న కేసులో నిందితుడయిన మేకల శ్రీనివాసులు అలియాస్ ప్రేమానందస్వామికి దిగువకోర్టు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను ఖరారు చేస్తూ జిల్లాసెషన్స్‌జడ్డి సిహెచ్‌కే దుర్గారావు గురువారం తీర్పు చెప్పారు. కేసువివరాల మేరకు కోవూరుకు చెందిన నిందితుడు మేకల శ్రీనివాసలు భక్తిచాటున ప్రేమానంద స్వామిగా మారి కల్లూరుపల్లిలో 2003లో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. ఇతను తన భక్తినటనతో గౌరవ కుటుంబానికి చెందిన మహిళను ఆశ్రమానికి రప్పించాడు. ఈ నేపథ్యంలో గౌరవ కుటుంబానికి చెందిన ఒక తల్లి, ఆమె కూతురు ఈయన భక్తివలలో పడ్డారు. 2004లో తన భక్తిలోపడ్డ యువతిని ప్రేమానంద స్వామి మాయమాటలు చెప్పి ఆమెనుఉత్తరాది రాష్ట్రాలకు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈమేరకు 2005లో రెండవ అదనపు మెజిస్ట్రేట్‌కోర్టులో ప్రేమానంద స్వామిపై కేసు నమోదయ్యింది. కేసు విచారణ అనంతరం 2009లో నెల్లూరు అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్‌లో ప్రేమానంద స్వామికి ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ తీర్పును సవాలుచేస్తూ ప్రేమానంద స్వామి జిల్లా సెషన్స్ కోర్టులో ్రఅప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ అనంతరం జిల్లా సెషన్స్ ప్రధానన్యామూర్తి పై మేరకు తీర్పు చెప్పారు.
టిడిపి నుంచి వేనాటి, కంభం, వైకాపా అభ్యర్థి బొమ్మిరెడ్డి

నెల్లూరు, మార్చి 20: జడ్పీ పీఠంపై కనే్నసిన ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. వైఎస్‌ఆర్‌సిపి తరపున జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరును నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ప్రకటించారు. టిడిపి తరపున నిన్నా, మొన్నటి వరకు సూళ్లూరుపేట నుంచి జడ్పీటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేనాటి రామచంద్రారెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న సమయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కొండాపురం జడ్పీటిసి అభ్యర్థిగా టిడిపి తరఫున నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అనుహ్యంగా టిడిపి వీరు ఇరువురుల్లో ఎవరో ఒకర్ని ఒకటి రెండురోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలనే కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి కంభం విజయరామిరెడ్డి పార్టీలో చేరారు. గతంలో టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్‌లోకి చేరారు. వేనాటి రామచంద్రారెడ్డి ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వేనాటి సూళ్లూరుపేట సమితి అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు. మేజారిటి జడ్పీటిసి స్థానాలు గెలుచుకున్న తర్వాత చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. జడ్పీ చైర్మన్ పదవి క్యాబినెట్ మంత్రి హోదా కావడంతో పోటీ రసవత్తంగా, ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే జడ్పీటిసిలకు సుమారు 400 నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం కూడా పూరైంది. వైఎస్‌ఆర్‌సిపి నుంచి చైర్మన్ రేసులో ఉన్న బొమ్మి రాఘవేంద్రరెడ్డి ఆత్మకూరు జడ్పీటిసిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు వైకాపా సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆయన వెంట రాకా నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. బొమ్మిరెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి ఆత్మకూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా, డాక్టర్‌గా సుపరిచితుడు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కొండాపురం జడ్పీటిసిగా నామినేషన్ వేశారు.
విభజనకు ఆద్యుడు వైఎస్సే
* వైఎస్సార్‌సిపికి ఓటేయమని ఎలా అడుగుతారు? * టిడిపి నగర అధ్యక్షుడు కోటంరెడ్డి ధ్వజం
నెల్లూరు, మార్చి 20: నగరంలో బుధవారం రాత్రి వైఎస్ షర్మిల ప్రచారం, రోడ్డుషో జనం లేక వెలవెలబోయందని టిడిపి నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనకు అధ్యుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, ఆయనను చూసి వైకాపాకు ఓటు వేయాలని ఏ మొకం పెట్టుకొని ఓటు అడుగుతోందని దుయ్యబట్టారు. నగరంలోని ఓటర్ల జాబితాలో చాలా వరకు దొంగ ఓట్లు ఉన్నాయని, అవకతవకలపై కూడా కలెక్టర్ స్పందించి జాబితాను సవరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో జనం లేకపోవడంతో షర్మిల ఖంగుతినిందని, దీంతో వైఎస్‌ఆర్‌ను చూసి వైకాపాకు ఓట్లు వేయాలని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. విభజనకు మొదటి ముద్దాయి వైఎస్‌ఆర్ అని, 1999లోనే అంకుర్పాణ చేసింది ఆయనేనని గుర్తుచేశారు. 18వేల 350 మందికి పట్టాలు పంపిణీ చేశారని, కానీ ఇంత వరకు స్థలాలు చూపించలేదన్నారు. నీ తండ్రి మోసపూరితమైన(దొంగ) పట్టాలు ఇచ్చారని ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ హయాంలో అనేక సార్లు డీజల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారన్నారు. విచ్చలవిడిగా ప్రజల సంపదను దోచుకొని, దానికి మీ అన్న జగన్‌మోహన్‌రెడ్డిని అధిపతిని చేశారని ఓట్లు వేయాలా అని అన్నారు. 2005లో కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి గెలుస్తోందని భయపడిన వైఎస్ రాత్రిరాత్రే అధికారులను బదిలీ చేయించి ఓటర్ల జాబితాను గందగోళం చేశారన్నారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని, నిజాయితీకి గల పార్టీ టిడిపికే ఓట్లు వేసేందుకు సిద్దమయ్యారన్నారు. ఆనం కుటుంబం వారు తవ్వుకున్న గోతులోనే వారు పడిపోయారన్నారు. షాజిమంజిల్‌లో ఎన్నికల అధికారులు పెట్టిన సమీక్షా సమావేశంలో అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారన్నారు. దీనిని బట్టి చూస్తే నగరంలో ఏ విధంగా ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ స్పందించి జాబితాను సరిచేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఆకుల హనుమంతరావు, వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
అత్యధిక జెడ్‌పిటిసి స్థానాలు వైఎస్సార్‌సిపికే!
నెల్లూరు, మార్చి 20: జిల్లాలో అత్యధిక జెడ్‌పిటిసి స్థానాలు వైఎస్సార్‌సిపి కైవసం చేసుకుంటుందని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. నెల్లూరుజిల్లా పరిషత్ వైకాపా చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని గురువారం ఎంపి మేకపాటిప్రకటించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎంపి మేకపాటి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డిని ప్రకటించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించాలని కోరారు. జిల్లాలోని 46 జడ్పీటిసి స్థానాల్లో అత్యధిక స్థానాలు వైకాపా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బొమ్మిరెడ్డి మంచి మెజారిటితో గెలుస్తారన్నారు. జడ్పీటిసితోపాటు ఎంపిపి, ఎంపిటిసి స్థానాలను కూడా గెలుచుకుంటుందన్నారు. జిల్లాలో నాలుగురోజుల పాటు వైఎస్ షర్మిలా పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. షర్మిలా పర్యటనను విజయవంతం చేసినా నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షులు మేరిగ మురళిధర్, సిటీ, రూరల్ సమన్వయకర్తలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ కుటుంబాన్ని వెలేయాలి
* పోలవరం అడ్డుకుంటే తగిన గుణపాఠం చెప్తాం *టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి హెచ్చరిక
నెల్లూరు, మార్చి 20: కెసిఆర్ అధికారం కట్టబెట్టితే దొరల రాజ్యం వస్తుందని, ఆ కుటుంబాన్ని వెలి వేయాలని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటామన్న కెసిఆర్ ప్రస్తుతం మాట మార్చారని, పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తోందని హెచ్చరించారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అన్నీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్నారు. ఆదాయం వారు తీసుకొని 60శాతం అప్పు మనకు ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్డుకుంటానని మాట్లాడటాన్ని చూస్తే కెసిఆర్ దుర్భద్దికి నిదర్శనమన్నారు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారన్నారు. అతని కుటుంబ రాజకీయం కోసం శవాలపై రాజకీయం చేస్తున్నారన్నారు. 2004లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని, అప్పుడు ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రశ్నిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబ్లి ప్రాజెక్టు కోసం ఏనాడు మాట్లాడ లేదని విమర్శించారు. ఎన్‌టిఆర్ హయాంలో దొర తనాన్ని పక్కనపెట్టారన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. తుపాకీతో కాల్చుతామన్న కొండా సురేఖ దంపతులను నేడు వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించారని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ది గురించి ఏరోజైనా పార్లమెంట్‌లో మాట్లాడావా అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలంటే నీ తాత దిగివాలన్నారు. చంద్రబాబు హయాంలోనే సీమాంధ్ర ప్రాంతాన్ని 10 రెట్లు అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. అగ్ర దేశాల్లో పోటీ పడతామన్నారు. ఇప్పటికీ తెలంగాణలో కెసిఆర్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ పార్టీని, ఆ కుటుంబాన్ని తరిమి తరమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
‘బిజెపి, కాంగ్రెస్, టిడిపికి గుణపాఠం తప్పదు’
గూడూరు, మార్చి 20: మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి, టిడిపికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కోవూరు మాజీ తాజా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన టిడిపికి గుడ్‌బై చెప్పి వైకాపా తీర్ధం పుచ్చుకున్న యారం మంజుల నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రం సర్వనాశనం కావడానికి సోనియా, చంద్రబాబు, బిజెపి, కాంగ్రెస్ ప్రధాన కారణమన్నారు. సీమాంధ్రలో ఉన్న 25 ఎంపి స్థానాల్లో తమ పార్టీకి 22 స్థానాలు దక్కుతాయన్నారు. వైకాపా కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను వైఎస్‌ఆర్‌సిపి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, అధిక స్థానాలు కైవసం చేసుకొని గూడూరుపురపాలక సంఘాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తానన్నారు. ఈ సమావేశంలో వైకాపా నియోజక వర్గ సమన్వయ కర్త పాశం సునీల్‌కుమార్, పట్టణ కన్వీనర్ నాసిన నాగులు, ఇతర ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
వైకాపా గూటికి చేరిన మాజీ
మున్సిపల్ చైర్‌పర్సన్, మాజీ ఎంపిపిలు
గూడూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ యారం మంజుల, ఆమె భర్త చిల్లకూరు మాజీ ఎంపిపి యారం వెంకటసుబ్బయ్యలు తమ నివాసంలో గురువారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కోవూరు తాజామాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు.
రాజన్న పాలన జగన్‌కే సాధ్యం: షర్మిల
కావలి, మార్చి 20: వైఎస్ తరహా పాలన జగన్‌కే సాధ్యమని జగన్ సోదరి షర్మిల అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ జనభేరి పేరిట గురువారం పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఆమెతోపాటు ఎంపి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు రోడ్‌షో నిర్వహించారు. రానున్న మున్సిపల్, జడ్‌పిటిసి, ఎంపిటిసి, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెపుతూ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి పోటీ చేస్తున్న అలేఖ్య, 21వ వార్డు నుంచి పోటీచేస్తున్న శ్రీలతలను పరిచయం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రలు పన్ని ప్రధాన భూమిక పోషించారని ఆరోపించారు. తన మూడేళ్ళ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా 32వేల కోట్ల విద్యుత్ పన్నులతోపాటు వేలాది కోట్ల పన్నుల భారం వేసిన మాజీ ముఖ్యమంత్రి ఓ కొత్త పార్టీ అధ్యక్షులు కిరణ్‌కుమార్‌కు ప్రజల బాధలు తెలుసా అని ప్రశ్నించారు. అనంతరం వైఎస్‌ఆర్ జనభేరి సభలో ప్రజల సమక్షంలో నినాదాల మధ్య కావలి అసెంబ్లీ స్థానానికి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోటీచేస్తారని, అలాగే నెల్లూరు ఎంపి స్థానానికి ప్రస్తుత ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభ్యర్ధిగా జనం ముందుకు రానున్నారని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రతాప్‌కుమార్‌పై పలువురు వ్యతిరేక ప్రచారం చేస్తుండగా, షర్మిల ప్రకటన కార్యకర్తల్లో ఉన్న అయోమయానికి తెరదించింది. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు గ్రంధి యానాదిశెట్టి, పొనుగోటి శ్రీనివాసులురెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి దక్కేదెవరికో?
వెంకటగిరి, మార్చి 20: వెంకటగిరి మున్సిపాలిటీకి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల బరి నుంచి గిరిదాటి పదవిని చేజిక్కించుకునేందుకు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. టిడిపి అభ్యర్థిగా దొంతు శారద 14వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తోకల బేబమ్మ 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నుంచి మేరువురాణి 6వ వార్డు నుంచి బరిలో ఉన్నారు.
గత ఎన్నికల్లో టిడిపి 12 వార్డులు కైవసం చేసుకోగా, 13 వార్డులు కాంగ్రెస్ గెలిచి ఆ పార్టీ అభ్యర్థి అల్లం చంద్రమోహన్‌రావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈసారి టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపితో పాటు కొన్ని వార్డుల్లో బిజెపి, ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల్లోని అభ్యర్థుల గెలుపు కోసం పట్టణంలోని ఆయా పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు ఇటు వారి గెలుపుకోసం అటు మిగతా వార్డులో ఉన్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చైర్మన్ పదవి రావడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైన టిడిపి కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పావులు కదుపుతున్నారు. మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగిన వైఎస్‌ఆర్‌సిపి కూడా చైర్మన్ పదవి తమకే దక్కాలంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. రెండవ సారి కూడా చైర్మన్ పదవి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్థానిక నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద చైర్మన్ పదవి ఎవర్ని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
ఎన్నికల్లో పాతకాపులు నలుగురు
గత ఎన్నికల్లో పాటీ చేసి విజయం సాధించి ఐదేళ్లు కౌన్సిలర్లుగా పనిచేసిన పాతకాపులు ఈ ఎన్నికల్లో కూడా నలుగురు ఉండడం విశేషం.
17వ వార్డు నుంచి టిడిపి అభ్యర్థిగా బీరం రాజేశ్వరరావు, 15వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యిర్థిగా పోరుబోయిన వనజ, 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యిర్థిగా పూజారి లక్ష్మి, 24వ వార్డు నుంచి వైఎస్‌ఆర్‌సిపి నుంచి నక్కా వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు.
ముత్తుకూరులో 116 నామినేషన్లు
ముత్తుకూరు, మార్చి 20: ముత్తుకూరు మండలంలోని 17 ఎంపిటీసి స్థానాలకు 116 నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల అధికారి సత్యన్నారాయణ వెల్లడించారు. ఐనంపురం ఎంపిటీసి స్థానాకికి టిడిపి అభ్యర్థులు ఆరుగురు, వైకాపా నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నేలటూరు సెగ్మెంట్‌కు టిడిపి అభ్యర్థులు ముగ్గురు, వైకాపా నుంచి ఇద్దరు, సిపిఎం నుంచి ఒకరు, బిజెపి నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. పిడతాపోలూరు 1 సెగ్మెంట్‌కు టిడిపి 4, వైకాపానుంచి ఇద్దరు, సిపిఎం ఒకనామినేషను వేశారు. పిడతాపోలూరు రెండుకు టిడిపినుంచి నలుగురు, వైకాపానుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. బ్రహ్మదేవి ఒకటవ సెగ్మెంట్‌కు టిడిపినుంచి ఇద్దరు, వైకాపా నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌నుంచి ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు నామినేను దాఖలు చేశారు. బ్రహ్మదేవి 2నుంచి టిడపి ఇద్దరు, వైకాపానుంచి మూగ్గురు నామినేషన్ వేశారు. క్రిష్ణపట్నం ఒకటవ సెగ్మెంట్‌నుంచి టిడిపి నుంచి ముగ్గురు, వైకాపా నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. క్రిష్ణపట్నం రెండవ సెగ్మెంట్‌కు టిడిపి నుంచి ఇద్దరు, వైకాపా ఇద్దరు, ముత్తుకూరు 1వ సెగ్మెంట్‌కు టిడిపి 3, వైకాపా రెండు, సిపి ఐ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు , ముత్తుకూరు 2సెగ్మెంట్‌కు టిడిపి రెండు, వైకాపా నాలుగు, సిపిఐ నుంచి ఒకటి, బిజెపి నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ముత్తుకూరు 3కు టిడిపి 3, వైకాపా 2. ముత్తుకూరు 4కు టిడిపి 4, వైకాపా 2. సిపిఐ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు. పొట్టెంపాడునుంచి టిడిపి మూడు, వైకాపా 3 చొప్పున దాఖలు చేశారు.

ఖరారు చేసిన జిల్లాకోర్టు
english title: 
jail

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>