గంట్యాడ, మార్చి 20 : మండలంలోని 19 ఎంపిటిసి పదవులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం చివరి రోజైన గురువారం 60 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ సిపి, సిపిఎం పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్ధులు వారి అనుచర గణంతో ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయానికి తరలివచ్చి నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. పెదవేమలి ఎంపిటిసి స్థానానికి వైఎస్సార్ సిపి -1, పెదమజ్జిపాలెంనకు తెలుగుదేశం -2,పెంటశ్రీరాంపురం కాంగ్రెస్ -2, వైఎస్సార్‌సిపి-2, పెనసాంనకు వైసిపి-1, బుడతనాపల్లికి టిడిపి-2, స్వతంత్ర అభ్యర్ధి-1, సిపిఎం-2 నామినేషన్లు దాఖలయ్యాయి.
అలాగే రేగుబల్లి ఎంపిటిసి పదవికి వైఎస్సార్ సిపి-1, వసాదికి కాంగ్రెస్-2,రామవరానికి వైసిపి-2, మదనాపురానికి తెలుగుదేశం-4, లక్కిడాంనకు టిడిపి-2, స్వతంత్ర-1, సిరిపురానికి టిడిపి-1, వైసిపి-2, స్వతంత్ర-2, తాటిడిపూడికి టిడిపి-3, వైసిపి-2, బోనంగికి కాంగ్రెస్ -,వైసిపి-3, వసంతకు టిడిపి-2,వైసిపి-3, కోర్లాంనకు టిడిపి 2, కాంగ్రెస్-2, వైసిపి-2, గొడియాడకు తెలుగుదేశం-3, కాంగ్రెస్ -2, వైసిపి -3 చొప్పున అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం దాఖలైన నామినేషన్ల సంఖ్య 129కి చేరింది.
చీపురుపల్లి, : మాజీ ఎంపిపి ఇప్పిలి వెంకటనర్సమ్మ తన నామినేషన్ గురువారం అట్టహానంగా దాఖలు చేశారు. గతంలో కూడా తన స్వంత గ్రామమైన రామలింగాపురం నుండే పోటీ చేసిన ఇప్పిలి వెంకటనర్సమ్మ తిరిగి పోటీ చేస్తున్నారు. ఈసందర్భంగా రామలింగాపురం గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ దాఖలు చేశారు.
ఈమెకు మద్దతుగా మజీ జెడ్‌పిటిసి రౌతు సునీత, బెవర ఉమాకుమారి, పత్తికాయవలస సర్పంచ్ దన్నాన పద్మావతి, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎంపిటిసి ఎన్నికల నామిమేషన్లు గురువారం చివరి రోజుకావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు అట్టహాసంగా వేసారు. ఈనెల 17 నుంచి ప్రారంభమైన ఎంపిటిసి నామినేషన్ల గురువారం ముగింపు నాటికి అన్ని పార్టీలు కలిపి 140 నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు 58 మంది నామినేషన్లు వేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 25 మంది నామినేషన్లు వేశారు. అలాగే వైఎస్సార్ పార్టీకి చెందిన వారు 46 మంది ఎంపిటిసి అభ్యర్ధులుగా నామినేషన్లు వేశారు. అలాగే లోక్‌సత్తా-1, స్వతంత్ర అభ్యర్ధులు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు
మహిళా ఓటర్లు అధికం
విజయనగరం(రూరల్) : మండలంలోని ప్రాదేశిక నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మండలం మొత్తంమీద 29689 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1049, మహిళలు 1065 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో భాగంగా ఎంపిటిసి వారిగా పరిశీలిస్తే గూల్లలపేట, కొత్తరు పురుషులు 1049, మహిళలు 1065, కొరుకోండ పురుషులు 1088, మహిళలు 1126, నారాయణపురం, బియ్యాలపేట పురుషులు 1263, మహిళలు 1305, గుంకలాం పురుషులు 1339, మహిళలు 1463, దుప్పాడ పురుషులు 1446, మహిళలు 1488, కొండకరకాం పురుషులు 1164, మహిళలు 1237 ఈ విధంగా 6 ఎంపిటిసిలలో మహిళలు అధికంగా ఉన్నారు.
ముగిసిన నామినేషన్ల ఘట్టం
నెల్లిమర్ల, : మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు గురువారంతో నామినేషన్ల 15 ప్రాదేశిక స్థానాలకు టిడిపి నుంచి అత్యధికంగా 33 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వైఎస్సార్ పారీట నుంచి 26 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు బరిలో నిలిచారు. నామినేషన్లు ప్రారంభమైన 17,18 రోజుల్లో నామినేషన్లు తక్కువగా వచ్చాయి.
19వ తేదీన అత్యధికంగా 59 నామినేషన్లు రాగా నామినేషన్లు చివరి రోజు గురువారం 25 దాఖలయ్యాయి.
భోగాపురం, : స్థానిక ఎన్నికల్లో భాగంగా మండలంలో మొత్తం 16 ఎంపిటిసిలకి గాను 108 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫణిప్రకాష్ తెలిపారు. వీటిలో కాంగ్రెస్ పార్టీ తరపున -27, తెలుగుదేశం పార్టీ తరపున 34, వైఎస్సార్ పార్టీ తరపున 43, స్వతంత్ర అభ్యర్ధులు 4 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. శుక్రవారం పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.
నేడు పట్టణంలో కాంగ్రెస్ బహిరంగ సభ
* పిసిసి అధ్యక్షుడు, చిరంజీవి, బొత్స రాక
విజయనగరం, మార్చి 20:రాష్ట్రంలో కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తలపెట్టిన 3బస్సు యాత్ర శుక్రవారం మధ్యాహ్నాం పట్టణానికి చేరనుంది. ఈ బస్సు యాత్రను శ్రీకాకుళం నుంచి పూసపాటిరేగ మీదుగా విజయనగరం చేరుకుంటారు. ఈ యాత్రలో నూతన పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ఎన్.రఘువీరారెడ్డి, పిసిసి ప్రచార కన్వీనర్, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పనబాక లక్ష్మి, డొక్క మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని న్యూపూర్ణ జంక్షన్‌లో బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బహిరంగ సభ వేదికపై డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రానున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించనుందని తెలిపారు. ఆసక్తి గల వారు తమ సూచనలను ఈ డ్రాప్ బాక్స్‌లో వేయాలని ఆయన సూచించారు. అలాగే కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన విధులు, విధివిధానాల పట్ల ప్రజలు వారి సూచనలను తెలియజేయాలని కోరారు. అలాగే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయదలచిన అభ్యర్థులు నేరుగా తమ దరఖాస్తులను పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అందజేయవచ్చని ఆయన తెలియజేశారు.
పట్టణంలో జోరందుకున్న ప్రచారాలు
విజయనగరం, మార్చి 20:మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అన్ని వార్డులలోను అభ్యర్థులు ఉదయం ఆరు గంటలకే తమ ప్రచారాలను ప్రారంభిస్తున్నారు. ఎండలకు భయపడి ఉదయం పది గంటలలోగా ప్రచారాలను ముగిస్తున్నారు. సాయంత్రం వేళ మరో రెండు గంటల పాటు ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని 37వార్డు టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన కంది మురళీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులో బూర్లుపేట, డక్కిన వీధి, అరకాల గెడ్డ, అరుంధతికాలనీ, కొత్తదేవర వీధి ప్రాంతాల్లో ఆయన ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పధం కలిగిన తనకు కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే వార్డులో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. వార్డులో మంచినీటి సమస్య ఎద్దడి నివారించేందుకు కృషి చేస్తానని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. 23వార్డులో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకా అనంతలక్ష్మి ఆ వార్డులో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. గురువారం ఆమె ఇందిరానగర్, ఆర్‌కె అపార్ట్‌మెంట్స్, ప్రదీప్‌నగర్, నోబుల్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకొని తనను గెలిపిస్తే వార్డులో వౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. అలాగే మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 39వార్డు టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కెల్ల వరలక్ష్మి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె శాంతినగర్, కొత్తఅగ్రహారం, అరుంధతి కోలనీ, బుచ్చన్నకోనేరు వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కడితే వార్డులో మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెబుతున్నారు. పట్టణంలోని 20వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోలగట్ల వెంకట రమణి తనను మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వార్డులో గతంలో అభివృద్ధి పనులు అనేకం చేపట్టామని మరోసారి తనకు అవకాశం కల్పిస్తే వార్డును మరింత మెరుగుపరుస్తానని చెబుతున్నారు. లోక్‌సత్తా తరఫున బరిలో దిగిన శ్రీనివాసరావు ప్రచారం చేపట్టారు.
ముగిసిన నామినేషన్ల ఘట్టం
విజయనగరం, మార్చి 20:జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన గురువారం నాడు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఆఖరి రోజున 168 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 250 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 547 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు 250 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా పరిశీలిస్తే... సిపిఎం 11, కాంగ్రెస్ 44, వైకాపా 89, టిడిపి 88, సిపిఐ 2. లోక్‌సత్తా 3, స్వతంత్రులు 10, బీఎస్పీ 1, బీజేపి 2 నామినేషన్లు దాఖలయ్యాయి.
జిల్లాలో 547 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 3324 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం ఒక్క రోజున 1901 నామినేషన్లు దాఖలు కావడంతో మొత్తం నామినేషన్లు 3324కు చేరాయి. పార్టీల వారీగా పరిశీలిస్తే... బీజేపి 2, సిపిఐ 2, సిపిఎం 68, కాంగ్రెస్ 657, వైకాపా 1038, టిడిపి 1323, లోక్‌సత్తా 8, ఇతర పార్టీలు 51, స్వతంత్ర అభ్యర్థులు 175 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన వారిలో చీపురుపల్లి మాజీ ఎఎంసీ చైర్మన్ మీసాల వరహాలనాయుడు టిడిపి తరఫున నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బోడసింగి నారాయణరావు నామినేషన్లు చేశారు. అలాగే గరుగుబిల్లి కాంగ్రెస్ అభ్యర్ధిగా గంటా లక్ష్మి,డెంకాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బడ్డుకొండ శంకర ప్రసాద్, పాచిపెంట వైకాపా అభ్యర్థిగా సలాది అనురాద, సాలూరు వైకాపా అభ్యర్థిగా రెడ్డి పద్మావతి, జామి స్వతంత్ర అభ్యర్థిగా జి.వేణుగోపాల్, కొత్తవలస బీఎస్పీ అభ్యర్థిగా బోను లక్ష్మి, జిఎల్ పురం టిడిపి అభ్యర్థిగా కొవ్వాడ జగన్నాధచారి, కురుపాం టిడిపి అభ్యర్థిగా ఎస్.జి.లక్ష్మి, తెర్లాం వైకాపా అభ్యర్ధిగా ఎన్.వి.రామలక్ష్మి,పాచిపెంట కాంగ్రెస్ అభ్యర్థిగా గొర్లె సత్యవతి, నెల్లిమర్ల వైకాపా అభ్యర్థిగా గదల సన్యాసినాయుడు, కొత్తవలస వైకాపా అభ్యర్థిగా బి.సుజాత, ఎల్‌కోట టిడిపి అభ్యరిథగా కర్రెడ్డి ఈశ్వరరావు, బలిజపేట వైకాపా అభ్యర్ధిగా మామిడి సుజాత, మెంటాడ వైకాపా అభ్యర్థిగా వడ్డి గంగమ్మ, సాలూరు టిడిపి అభ్యర్ధిగా డొంక అన్నపూర్ణ, పాచిపెంట టిడిపి అభ్యర్థిగా కె.పద్మవతి, సాలూరు సిపిఎం అభ్యర్ధిగా గొర్లె వరలక్ష్మి, పార్వతీపురం సిపిఎం అభ్యర్థిగా బంటు పార్వతి, విజయనగరం కాంగ్రెస్ అభ్యరిథగా బోడసింగి కృష్ణారావు, నారాయణరావులు, పూసపాటిరేగ వైకాపా అభ్యర్థిగా బర్రి చిన్నప్పన తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.
వేడెక్కిన మున్సిపల్ ఎన్నికల వాతావరణం
విజయనగరం , మార్చి 20: మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో పట్టణంలో రాజకీయ వాతావారణం వేడెక్కింది. రాష్టవ్రిభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగడంతోప్రధాన రాజకీయపక్షాలు నువ్వా? నేనా? అనే రీతో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్, వెఎస్సార్ పార్టీలతోపాటు సిపిఐ, సిపిఎం,బిజెపి, లోక్‌సత్తా పార్టీలు కొన్నివార్డుల్లో పోటీ చేస్తున్నాయి. పట్టణంలో 40 వార్డులు ఉండగా అన్నివార్డుల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్థులను పోటీలో దింపగా, కాంగ్రెస్ 38 వార్డుల్లోను, వైఎస్సార్ 39 వార్డుల్లోను పోటీకి దింపాయి. ఈసారి మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకరంగా తీసుకున్నాయి. నువ్వా?నేనా? అనే రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా పట్టణంలో జరిగిన అలజడి వల్ల కర్ఫ్యూ విధించడంతో కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే వైఎస్సార్‌పార్టీకి బలమైన నాయకత్వలోపం ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్యలు చేరడంతో తెలుగుదేశానికి బలం పెరిగింది. ప్రధానంగా పదేళ్లపాటు పాలనలో ఉన్న కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంటడటంతోపాటు స్థానిక కాంగ్రెస్‌నాయకత్వం పట్ల కూడా ప్రజల్లో అసహానం ఉంది. మూడుపార్టీలు ముందుకు సాగుతున్నాయి.
అంతుచిక్కని స్వతంత్రుల అంతరంగం
విజయనగరం, మార్చి 20:మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన అభ్యర్థుల అంతరంగం అర్థంగాక ప్రధాన పార్టీలు అయోమయం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, వైకాపా, టిడిపి పార్టీలలో గ్రూపు రాజకీయాలు కారణంగా పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన వ్యక్తులు ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. మరికొంత పార్టీని ఆయా పార్టీల నేతలే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయమని సలహాలు కూడా ఇచ్చారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నుంచి మొత్తం 155 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో విజయనగరం నుంచి 65 మంది, బొబ్బిలి 23, సాలూరు 22, పార్వతీపురం నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటీవల రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కొంత మంది నేరుగా ఆ పార్టీ జెండా పట్టుకొని ఎన్నికల బరిలో దిగేందుకు సాహసం చేయని వారు స్వతంత్ర అభ్యర్థులుగానే తమ గెలుపు సునాయాసమని భావించి స్వతంత్ర అభ్యర్థులుగా దిగారు. అదే తరుణంలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నాయకులను బుజ్జగిస్తూ బి ఫారం లేకున్నా తమ మద్దతు మీకేనంటూ కొంత మంది నేతలు తమ అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దించారు. దీంతో వీరు ఎటువైపు మొగ్గుచూపుతారన్నదీ ఇతమిద్దంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనా స్వతంత్ర అభ్యర్థుల అంతరంగం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలపై ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నరు.
‘ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ’
విజయనగరం , మార్చి 20: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ కోరారు. గురువారం ఇక్కడ రెవెన్యూహోమ్‌లో ప్రిసైడింగ్ అధికారులకు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ కేంద్రాల్లో వారి బాధ్యతల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమన్నారాయణ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లోను, పోలింగ్ నిర్వహించేటప్పుడు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అలాగే ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో పోలింగ్ విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే పోలింగ్ కేంద్రం బయట పోటీ చేసే అభ్యర్థుల జాబితా, పోలింగ్ ఏరియా, మొత్తం ఓటర్ల సంఖ్య తెలియజేసే నోటీసు ప్రదర్శించాలన్నారు. కంట్రోల్ యూనిట్‌లో కాండ్ సెట్ సెక్షన్‌కు వేసి ఉన్న సీల్, అడ్రస్ ట్యాగ్ పోలింగ్ ఏజెంట్లకు చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఒ జె.వెంకటరావు పాల్గొన్నారు.