హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేశారు. 23మంది ఐపిఎస్‌లకు స్థానచలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది జిల్లాలకు, మూడు అర్బన్ జిల్లాలకు కొత్త పోలీసు సూపరింటెండెంట్‌లను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న టిపి దాస్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి కల్పించారు. హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి మనీష్ కుమార్ సిన్హాను కడప జిల్లా ఎస్పీగా నియమించారు. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న ఎ సుందర్‌కుమార్ దాస్‌ను బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న అవినాష్ మహంతిని మెదక్ జిల్లా ఎస్పీగా నియమించారు. అక్కడ ఎస్పీగా పని చేస్తున్న పి జాన్ విక్టర్‌ను బదిలీ చేసి హైదరాబాద్ సిటీ డిసిపి క్రైమ్స్‌గా నియమించారు. ఆ స్థానంలో పని చేస్తున్న జె సత్యనారాయణను గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు రూరల్ ఎస్పీగా పని చేస్తున్న ఎ రవిచంద్రను బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా పని చేస్తున్న బి రాజకుమారిని రంగారెడ్డి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆర్ భీమానాయక్‌ను బదిలీ చేశారు. ఎపిఎస్‌పి నాల్గవ బెటాలియన్ కమాండెంట్‌గా వరంగల్ జిల్లాలో పని చేస్తున్న డాక్టర్ అకున్ సభర్వాల్‌ను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ డిసిపిగా బదిలీ చేశారు. అకున్ సభర్వాల్ స్థానంలో సౌత్ జోన్ డిసి మనిషా కుమార్ సిన్హాను నియమించారు. కడప జిల్లాలో అసిస్టెంట్ ఎస్పీగా పని చేస్తున్న ఆర్ జయలక్ష్మిని బదిలీ చేసి కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న పివిఎస్ రామకృష్ణను హైదరాబాద్ సిటీ డిసిపి (ట్రాఫిక్)గా నియమించారు. హైదరాబాద్ సిటీ డిసిపి (ట్రాఫిక్) జివిజి అశోక్‌కుమార్‌ను బదిలీ చేశారు. దేవాదాయ శాఖ రెవెన్యూ విభాగంలో టిటిడి చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న మురుగేష్ కుమార్ సింగ్‌ను హైదరాబాద్ సిటీ డిసిపి (ట్రాఫిక్-2) విభాగానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో పని చేస్తున్న ఎ రవికృష్ణను గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా పని చేస్తున్న ఎస్ శ్యాంసుందర్‌ను వరంగల్ అర్బన్ ఎస్పీగా బదిలీ చేశారు.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్‌లో డిసిపిగా పని చేస్తున్న జి వెంకటగిరి అశోక్‌కుమార్ సర్వీసులను దేవాదాయ శాఖ రెవెన్యూ విభాగానికి బదిలీ చేసి టిటిడి తిరుమల చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించారు. ఎసిబి జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం రమేష్‌ను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. అక్కడ ఎస్పీగా పని చేస్తున్న సి రవివర్మను ఎసిబి జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఎస్పీ డి రామకృష్ణయ్యను సిఐడి ఎస్పీగా బదిలీ చేశారు. సిఐడి ఎస్పీ సిఎస్‌ఆర్‌కె ఎల్‌ఎన్ రాజును విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలో రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా బదిలీపై నియమించారు. రాజమండ్రిలో రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎఎస్ ఖాన్‌ను బదిలీ చేసి కడపలో ఒఎస్‌డి (ఆపరేషన్స్)గా నియమించారు. సిఐడి ఎస్పీగా పని చేస్తున్న ఎస్‌జి జనార్దన్‌ను బదిలీ చేసి అంబర్‌పేట సిపిఎల్ కమాండెంట్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న కె కోటేశ్వరరావును సిఐడి ఎస్పీగా నియమించారు. ఆ స్థానంలో పని చేస్తున్న ఎస్‌జె జనార్దన్‌ను బదిలీ చేశారు. గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న కెవి మోహన్‌రావును మంగళగిరి ఏపిఎస్‌పి మంగళగిరి ఆరవ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేశారు. తిరుపతిలో ఏపి ట్రాన్స్‌కో ఎస్పీగా పని చేస్తున్న టి రవికుమార్ మూర్తిని బదిలీ చేసి రాజమండ్రి అర్బన్ ఎస్పీగా నియమించారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా పనిచ్తేన్న పి ఉమాపతిని బదిలీ చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ చంద్రశేఖర రెడ్డిని బదిలీ చేసి కర్నూలు జిల్లా ఎస్పీగా నియమించారు. అక్కడ ఎస్పీగా పని చేస్తున్న ఎం శివప్రసాద్‌ను బదిలీ చేశారు. గ్రేహౌండ్స్‌లో గ్రూపు కమాండెర్ ఎల్‌కెవి రంగారావును వరంగల్ జిల్లా నాల్గవ బెటాలియన్ ఎపిఎస్‌పి కమాండెంట్‌గా నియమించారు.
ఆరుగురు డిఎస్పీలు బదిలీ
రాష్ట్ర పోలీసు శాఖలో ఆరుగురు డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి వి దినేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా డిటిసిలో డిఎస్పీగా ఉన్న టి రామకృష్ణారావును జంగారెడ్డిగూడానికి, అక్కడ ఉన్న ఎంఆర్ కృష్ణంరాజును సిఐడికి, సిఐడిలో ఉన్న ఎం మునిరామయ్యను రాజంపేటకు, అక్కడ ఉన్న మనే రజనీని గద్వాల్‌కు, తిరుమలలో ఉన్న కెఎస్ నంజుండప్పను తిరుపతి తూర్పు డివిజన్‌కు, సిఐడిలో ఉన్న సి రాజేశ్వర్‌రెడ్డిని కడపకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
23మందికి స్థానచలనం 8జిల్లాలు, 3అర్బన్ ప్రాంతాలకు కొత్త ఎస్పీలు ఎస్‌పిఎఫ్ అదనపు డిజికి డిజిగా పదోన్నతి
english title:
bhareega
Date:
Saturday, April 14, 2012