హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో రాష్టప్రతి ఉత్తర్వుల అమలు తీరుకు సంబంధించిన అంశాలను సమీక్షించేందుకు ప్రభుత్వం జస్టిస్ బిఎస్ రాయ్‌కోటి ఆధ్వర్యంలో శుక్రవారం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. తెలంగాణ జాయింట్ ఏక్షన్ కమిటీతో గత ఏడాది అక్టోబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగానే ఈ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. రాష్టప్రతి ఉత్తర్వుల అమలు అంశంపై తెలంగాణ ప్రాంత ఉద్యోగులు గత సెప్టెంబర్ 13నుంచి సమ్మె చేసిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. రాష్టప్రతి ఉత్తర్వులు అమలులో లోపాలను గుర్తించి, వాటిని సరిచేసే సూచనలను కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల నుంచి ఫిర్యాదులను, విజ్ఞాపనలను స్వీకరించి వాటిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. జస్టిస్ రాయ్‌కోటి 1937 అక్టోబర్ 7న జన్మించారు. కర్నాటక యూనివర్శిటీలో ఎంఎ, ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1965లో బార్‌లో చేరారు. బెంగళూరు జగద్గురు రేణుకాచార్య కాలేజీలో లా ప్రొఫెసర్‌గా పనిచేశారు.
చైర్మన్‌గా జస్టిస్ రాయ్‌కోటి
english title:
r
Date:
Saturday, April 14, 2012