Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హరివిల్లు

$
0
0

అలవోకగా మోడలింగ్‌లో పోజులిచ్చేసి బాలీవుడ్‌పై అడుగుపెట్టిన దీపికా పదుకొనె వెండితెరపై కూడా తానేంటో నిరూపించుకుంటోంది. బాలీవుడ్‌లో ఎంత మేరకు ఎక్స్‌పోజ్ చేయాలో అంత వరకే చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళుతోంది. దీపికా తన గురించి తాను ఏం చెబుతుందో చూద్దాం...
నా తత్త్వం: షైగా, క్వయిట్‌గా వుంటాను
నచ్చే ఫ్యాషన్ దుస్తులు: వైట్ షర్ట్, జీన్స్
నచ్చే రంగు: నలుపు
నచ్చే డిజైనర్లు: మనీష్ మల్హోత్రా, తరుణ్ తహిలియాని
చేసుకునే మేకప్: మస్కారా, లిప్‌గ్లాస్
నచ్చే హీరోలు: అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్
నచ్చని వ్యాఖ్యలు: ఎవరో ఒకరితో డేటింగ్ చేస్తున్నానంటూ
వచ్చే రూమర్లు
నేను కోరుకునేది: విభిన్నత్వంతో, కొత్తదనంతో ప్రయోగం చేయాలని
నాకు నచ్చేది: అన్ని రకాల సంగీతం
సినిమాలను: మిగతావారిలాగే నేనూ ఆసక్తిగా చూసేదాన్ని
నా ప్రతి అడుగులోనూ: తల్లిదండ్రుల మద్దతు వుంది
అమితానందాన్ని కలిగించే విషయం: హేమమాలిని కళ్ళతో
నా కళ్ళను పోల్చడం
.....................................................................
చిగురిస్తున్న ఆశలు!

అందాల తార ఇలియానాకు టాలీవుడ్‌లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో తెలిసీ, తెలియక చేసిన తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ ఇకపై ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటోంది. అందులో భాగంగానే పారితోషికం విషయంలో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టుకూడదనుకుంటోందట! అవసరమైతే మంచి ప్రాజెక్టులు లభిస్తే పారితోషికం కూడా తగ్గించుకోవడంలో వెనకాడనంటోందని సన్నిహితులు చెబుతున్నారు. పారితోషికం విషయంలో రాజీ కుదరక ఎన్నో మంచి ప్రాజెక్టులు వదులుకున్న ఈ భామ ఇకపై అలా జరగకుండా చూసుకోవాలనుకుంటోందట. మెట్టు దిగిరాకపోవడం వల్లే అనేక అవకాశాలు చేజారిపోయాయి. దాంతో పరిశ్రమలో పూర్తిగా వెనకబడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్‌తో చేస్తున్న ‘జులాయి’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం భారీ విజయం సాధించి మళ్లీ తనకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోందట. అలా జరుగుతుందంటారా?! వెయిట్ అండ్ సీ...!
......................................................
ఇషాకు ఇష్టమైనవి...!

బాలీవుడ్ బ్యూటీ ఇషాడియోల్ తనకిష్టమైన వాటి గురించి ఇలా చెప్పుకొచ్చింది...
ఐస్‌క్రీమ్: చిన్నప్పటి నుంచి నేను ఐస్‌క్రీమ్ ఫ్యాన్‌ని. చాక్లెట్ సాస్‌తో వెనెల్లా అంటే బోల్డంత ఇష్టం.
డ్యాన్స్: నేను ఒడిస్సీ ఫ్యాన్‌ని. ఈ డ్యాన్స్ చేస్తుంటే మనసుకి ప్రశాంతత,
దైవారాధనలో పాల్గొన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఫ్రెండ్స్: వృత్తిపరంగా ఎంతమంది వున్నా మనసుకు నచ్చిన వారితోనే కాలక్షేపం చేస్తా.
ఆహారం: సాంప్రదాయ వంటకాలకే అధిక ప్రాధాన్యతనిస్తా. కానీ షూటింగ్స్‌లో ఫాస్ట్ఫుడ్ తప్పదు.
డ్రెస్: జీన్స్, ప్యాంట్, షర్ట్
సినిమాల ఎంపిక: మమీని తప్పకుండా సంప్రదించే ఎంపిక చేసుకుంటా.
కొలిచే దైవం: శివుడు

దీపికా తత్వం!
english title: 
harivillu
author: 
సమీర్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>