Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గ్రహబలం ఏప్రిల్ 15 నుండి 21 వరకు

$
0
0

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)

మీకున్న నాయకత్వ లక్షణాలు బహిర్గతమయ్యే అవకాశాలు పొడసూపుతాయి. మీరు కన్న కలలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది. విద్యుక్త ధర్మ నిర్వహణలో తోటి వారిని దాటి ముందుకు దూసుకుపోతారు. చెప్పుకోదగ్గ మొత్తాల్లో ఆదాయం ఉండటంతో స్థలాలు, యంత్ర పరికరాల కొనుగోలుకై సన్నద్ధమవుతారు. ప్రార్థనా స్థలాలు, దేవాలయాలను సందర్శిస్తారు. 16, 17 తేదీల్లో కొత్త వ్యక్తుల కలయిక, తద్వారా అభివృద్ధి పథకాలలో ప్రగతి గమనించవచ్చు.

వృషభం (ఏప్రిల్ 21 - మే 21)

సుహృద్భావ వాతావరణంలో చర్చలు, సమాలోచనలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధునిక పరిజ్ఞానంతో రోజువారీ కార్యక్రమాలు సులభంగా నిర్వహించ గలుగుతారు. భాగస్వాములు, మిత్రుల చంచలత్వానికి అడ్డుకట్ట వేసి మార్గాంతరాలు చూపించ గలుగుతారు. మీ స్వంత ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి సరైన సమయం ఇది. ఇబ్బడిముబ్బడిగా ఖర్చులున్నా తగినంత ధనం ఏదో విధంగా మీ చేతికందుతూనే ఉంటుంది. మీ వల్ల లాభం పొందిన వారు కృతజ్ఞతలు తెలుపుతారు.

మిథునం (మే 22 - జూన్ 21)

వారారంభంలో మీరనుకున్న రీతిలో పనులు సాగకపోయినా చింతించాల్సిన అవసరం లేదు. బుధ, గురువారాల్లో ఉల్లాసకర పరిణామాలు ఏర్పడి అన్ని రంగాల్లో వేగం పుంజుకుంటారు. ప్రాముఖ్యత గల ప్రాజెక్టులు, ప్రజాహిత కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహిస్తారు. వాణిజ్య, సాహిత్య రంగాల్లో సమున్నత స్థానాన్ని సంపాదించడంలో సఫలీకృతులవుతారు. పదునైన భావజాలంతో అభిమానులను, ఆశ్రీతులను ఉత్తేజపరుస్తారు.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23)

పండితులు, బ్రహ్మజ్ఞానం సాధించిన వారితో పరిచయం మీ ఆలోచనా సరళిలో మార్పులు తెస్తాయి. భవసాగరాలను తప్పించుకుని విజయ తీరాలను చేరుకో గలుగుతారు. మంగళ, బుధవారాలు మినహాయిస్తే తక్కిన రోజుల్లో ఆర్థిక లావాదేవీలు, సంప్రదింపులు అనుకూలిస్తాయి. మీ విచక్షణా జ్ఞానంతో ఆశ్రీతుల, సహచరుల ఇబ్బందులకు సరైన మార్గాంతరాలు సూచించగలుగుతారు. ఆర్థిక నిల్వలు పెరుగుతాయనడంలో సందేహం లేదు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23)

విశే్లషణాత్మక అధ్యయనం ద్వారా నూతన విషయాలను తెలుసుకుంటారు. సన్నిహితుల ద్వారా శుభ వార్తలు, కుటుంబంలో శుభ కార్యాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. కష్టసాధ్యమైన కార్యక్రమాలను చేపట్టి మీ ప్రతిభకు, మేధస్సుకు తగిన సముచిత స్థానాన్ని సంఘంలో పొందగలుగుతారు. ఇన్సూరెన్స్, స్పెక్యులేషన్‌ల ద్వారా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. రాశికన్నా వాసి మేలని ఇతరులకు మీ చర్యల ద్వారా తెలియజేస్తాయి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23)

వెంటనే ఫలితాలందలేదని విచారించకుండా మనస్సును అదుపులో ఉంచడం ముదావహం. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడం, కీలక సమాచారం అందడం మీకు ఉత్సాహాన్నిస్తాయి. విదేశీ సంచారం, అధికార ప్రాప్తికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సంస్కృతీ సంప్రదాయాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఖర్చులు అదుపు చేయలేక పోయినా ఆదాయం పెరగడం సంతృప్తినిస్తుంది. గృహ వాతావరణం కోలాహలంగా, సందడిగా ఉంటుంది.

తుల (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)

వర్ణ, వర్గ భేదాలను పక్కనబెట్టి అందరినీ ఒక్కతాటిపై నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయుల అవసరాలు తీర్చి వారిని మీ గురించి ఆలోచించేలా చేస్తారు. మీరు చేసిన కృషికి, అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ఆదరణ, పారితోషికాలను పొందుతారు. విద్యార్థులు ఆశించిన ర్యాంకులను, అనుకూల విద్యాలయాల్లో సీట్లను పొందగలుగుతారు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని నూతన పెట్టుబడులకు పూనుకుంటారు.

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 23)

మీ ప్రోత్సాహంతో ఇంటా బయటా అన్ని పనులు నిర్విరామంగా కొనసాగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజాహిత కార్యక్రమాలు సక్రమంగా నడవడంలో మీ పాత్ర ఎన్నతగినదిగా ఉంటుంది. గృహారంభాలు, నిర్మాణాలతో ఈ వారం అంతా సందడిగా ఉండవచ్చు. మీ ప్రాథమిక అవసరాలకు సరిపడా ఆదాయం ఉంటుందనవచ్చు. బుధ, గురు వారాల్లో మానసికోల్లాసం, ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. నచ్చిన వస్తువులు, పుస్తకాలు సంపాదించుకుంటారు.

ధనుస్సు (నవంబర్ 24 - డిసెంబర్ 22)

మీకు సంబంధం లేకపోయినా సన్నిహితుల శ్రేయస్సుకై కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఆధ్యాత్మిక, మనోవిజ్ఞాన సదస్సులు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు, స్నేహితులను కలుసుకుని ఆనందిస్తారు. అప్రయత్నంగానే పాత బాకీలు కొన్ని మీ చేతికందుతాయి. వృత్తి విద్యా రంగాల్లో మీ హోదా, బాధ్యతలు పెరుగవచ్చు. పరీక్షలు, ఎలక్షన్‌లలో గెలుపొంది అనేకుల నుండి అభినందనల నందుకోగలరు. బలహీన వర్గాలు, వ్యక్తుల పట్ల ఆదరం చూపి మీ ఔన్నత్యం చాటుకుంటారు.

మకరం (డిసెంబర్ 23 - జనవరి 22)

మీకున్న పరిమితులు, వసతులు అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకుంటారు. పెద్దలు, గొప్ప వ్యక్తుల ఆశీర్వాదం, సహకారం పొంది, విద్యా ఉద్యోగాలలో ఉన్నతమైన లక్ష్యాలను శ్రమ లేకుండానే సాధించగలుగుతారు. విందులు, వినోదాలతో గృహ వాతావరణం కోలాహలంగా ఉంటుంది. అవకాశాలు మెరుగవడంతో దీర్ఘకాలిక ప్రణాళికలను, పెట్టుబడులను సమీక్షించి, నిర్వహించడానికి ఉద్యుక్తులవుతారు.

కుంభం (జనవరి 23 - ఫిబ్రవరి 20)

అస్థిర భావాలతో, సంశయాలతో ఊగిసలాడుతూ ఆపిన వ్యవహారాలు ఈ వారంలో సులువుగా ముగింపునకు రావచ్చు. మీ ఆధ్వర్యంలో, నాయకత్వంలో ప్రబోధాత్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తికరంగా సాగుతాయి. క్రీడలు, కుటుంబ విషయాలు మిమ్మల్ని అలరిస్తాయి. ప్రయాణాలలో అనుకూలత, నూతన విషయాలను తెలుసుకోవడం, ఆస్తి లావాదేవీలలో అవసరమైన వారి నుండి సహకారం ఉంటాయి. సలహాలు, మార్గదర్శకాలు సూచించి తోటి వారి బాధల్ని తగ్గించగల్గుతారు.

మీనం (్ఫబ్రవరి 21 - మార్చి 20)

రుణ విముక్తులవడం, కొన్ని బాధ్యతలు తీరడం మీ మనస్సుకు హాయినిస్తాయి. ప్రముఖులతో కలిసి మీ అవసరాలను, అభిప్రాయాలను తెలియజేస్తారు. సంబరాలు, సమాహారాలలో సన్నిహితుల ప్రోద్బలంతో పాల్గొంటారు. భాగస్వాములతో చర్చించి మనోవికాసం పొంది, వ్యవహార శైలిలో మార్పులు చేపడతారు. పితృవర్గం బంధువులతో అనుకూలత, రాకపోకలు పెరగడం, దినచర్యలో మార్పు రావడం, బలహీనంగా ఉన్న సంబంధాలు పునరుద్ధరింపబడటం ఉంటాయి.

మేషం
english title: 
grahabalam
author: 
ఎస్.రవిప్రకాశ్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>