డుంబ్రిగుడ, ఏప్రిల్ 16: మండలంలోని లైగండ, తూటంగి, అరమ పంచాయతీలలోని గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించని పక్షంలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న ప్రజాపథాన్ని బహిష్కరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ మండల నాయకుడు పి.రాందాస్ హెచ్చరించారు. సోమవారం ఆయన స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో జరిగిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలలో పలు గ్రామాల గిరిజనులు తమ సమస్యలను అధికారులకు తెలియజేసినా పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. గతంలో అందిన సమస్యలను ముందుగా పరిష్కరించేందుకు కృషిచేయాలని ఆయన కోరారు. గతంలో గిరిజనులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించని పక్షంలో ప్రస్తుతం నిర్వహించే ప్రజాపథాన్ని బహిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని లైగండ, తూటంగి, అరమ పంచాయతీలలోని
english title:
will boycott prajapatham
Date:
Tuesday, April 17, 2012