హైదరాబాద్, ఏప్రిల్ 17: దక్షిణ మధ్య రైల్వేకి లభించిన గోవింద్ వల్లభ్ పంత్ అవార్డును రైల్వే మంత్రి ముకుల్‌రాయ్ నుంచి ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ జిఎం ఆస్తానా నేతృత్వంలోని బృందం స్వీకరించింది. మంగళవారం ఢిల్లీలోని బరోడా హౌస్‌లో జరిగిన రైల్వే వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఈ అవార్డును జిఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రి చేతుల మీదుగా షీల్డ్‌ను అందుకున్నారు. ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్టేషన్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్స్, లెవెల్ క్రాసింగ్, రోడ్ ఓవర్ బ్రిడ్జి సేఫ్టీ వర్క్స్ విభాగాలకు సంబంధించి 17 రైల్వే జోన్లలో పని తీరును బేరీజు వేసుకున్న అనంతరం పశ్చిమ రైల్వేతో కలిపి ద.మ.రైల్వేకి ఈ అవార్డు లభించింది. (చిత్రం) రైల్వే మంత్రి ముకుల్ రాయ్ నుంచి షీల్డును అందుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు
దక్షిణ మధ్య రైల్వేకి లభించిన గోవింద్ వల్లభ్ పంత్ అవార్డును రైల్వే
english title:
south central railway
Date:
Wednesday, April 18, 2012