హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ ఉద్యమం సందర్భంగా గత ఏడాది హైకోర్టులో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఇద్దరు న్యాయవాదులకు కోర్టు మే ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిలో గంప వెంకటేశ్‌ను సిసిఎస్ సిట్ అరెస్టు చేయగా, ఠాకూర్ రూపాసింగ్ అనే మహిళా న్యాయవాది కోర్టులో లొంగిపోయారు. కాగా, హైకోర్టులో జరిగిన సంఘటనలపై సిట్ కేసు నమోదు చేసి విచారణ జరిపిన అనంతరం నాంపల్లి కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. నిజానికి ఈ కేసులో 10 మందిపై సిట్ కేసులు నమోదు చేసింది. అయతే హైకోర్టులో ఆందోళనలు చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేసు నమోదైన వారిని వెంటనే ఆరెస్టు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించిన క్రమంలో ఒకరు అరెస్టు కాగా, మరొకరు లొంగిపోయారు. మిగతా 8 మందీ ఒకటి రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా గత ఏడాది హైకోర్టులో జరిగిన
english title:
remand
Date:
Wednesday, April 18, 2012