హైదరాబాద్, ఏప్రిల్ 17 : రాష్ట్రంలో వరిధాన్యం సేకరణ ఉధృతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సిఐ), పౌరసరఫరాలు, ఐకెపి, రైస్ మిల్లర్ల ద్వారా 96,92,563 టన్నుల ధాన్యాన్ని సేకరించామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హరిప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, కేవలం రైస్‌మిల్లర్లే 86.92 లక్షల టన్నుల ధాన్యం సేకరించారని చెప్పారు.
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మేరకు గ్రేడ్-ఎ ధాన్యానికి 1110 రూపాయలు, సాధారణ రకానికి 1080 రూపాయలు లభించేలా చూస్తున్నామన్నారు. రైతులు ఎవరైనా వరిధాన్యం విక్రయంలో కనీస మద్దతు ధర లభించకపోయినా, ఇతరత్రా ఏదైనా అసౌకర్యం ఎదుర్కొంటున్నా తమకు ఫోన్ ద్వారా (టోల్‌ఫ్రీ నెంబర్ 18004 252977 లేదా 18004 250092) తెలియచేయాలని కమిషనర్ సూచించారు.
సమస్యలుంటే సంప్రదించండి: కమిషనర్
english title:
procurement
Date:
Wednesday, April 18, 2012