Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పశ్చిమ డెల్టా కాలువల మూసివేత

$
0
0

నిడదవోలు, ఏప్రిల్ 17: జిల్లాలోని 5.30 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టాలోని వందలాది గ్రామాలలోని లక్షలాది ప్రజలకు తాగునీటిని అందిస్తున్న పశ్చిమ డెల్టా కాలువలకు వేసవి విరామం నిమిత్తం సోమవారం అర్థరాత్రి దాటిన అనంతరం నీటి విడుదల నిలిపివేశారు. ఈమేరకు గోదావరి జలాశయం నుండి కాలువలకు నీటిని సరఫరా చేసే విజ్జేశ్వరం హెడ్ స్లూరుూస్ గేట్లను అధికారులు కిందికి దింపివేశారు. కాగా ఆధునికీకరణ పనుల నిమిత్తం పశ్చిమ డెల్టా పరిధిలోని అత్తిలి, కాకరపర్రు, బ్యాంక్ కెనాల్, నరసాపురం కాలువలకు గతంలోనే నీటి సరఫరా నిలిపి వేశారు. దీంతో ఆయా కాలువల పరిధిలోని గ్రామాలలో మంచినీటి చెరువులను నింపుకునే నిమిత్తం ఈ నెల 22వ తేదీ నుండి వారం రోజులపాటు వాటికి నీటిని విడుదల చేయనున్నారు. పశ్చిమ డెల్టా కాలువలకు వేసవి మూసివేత విరామ సమయంలో లాకులు, షట్టర్లకు ఆయిలింగ్ నిర్వహించడంతోపాటు రూ.3.5 కోట్ల వ్యయంతో అనాకోడేరు, వెంకయ్య-వయ్యేరు, బలుసుమూడి కాలువల గట్లపై రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుత వేసవి మూసివేత విరామ సమయంలో పశ్చిమ డెల్టా కాలువలకు నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టే లక్ష్యంతో రూ.9 కోట్లు వ్యయంకాగల ప్రతిపాదనలను ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపినట్లు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కృష్ణారావు తెలిపారు.
ఇలా అయితే ఎలా
ఆచంట, ఏప్రిల్ 17: ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్నిచ్చే రిజిస్ట్రేషన్ శాఖపై ఉన్నతాధికారులు అమలుకు సాధ్యం కాని నిబంధనలు జారీచేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే పరిస్థితులు కల్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లావాదేవీలకు సంబంధించి దస్తావేజులపై సంతకాలుచేసే సాక్షులకు సైతం గుర్తింపుకార్డు, ఫొటోలు ఉండాలన్న నిబంధన సోమవారం నుండి అమలుచేయాలని ఆదేశాలు రావడంతో కిందిస్థాయి ఉద్యోగులు, లావాదేవీలు జరుపుకునే రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వచ్చినవారు సాక్షులకు గుర్తింపుకార్డు, ఫొటోలు లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. నూతన విధానం కారణంగా మంగళవారం కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడం విశేషం. పూర్తిగ్రామీణ ప్రాంతమైన ఆచంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి సన్న, చిన్నకారు రైతులు అధిక శాతం ఉన్నారు. ఇంత వరకు దస్తావేజులు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్రయ, విక్రయదారుల ఫొటోలు, గుర్తింపుకార్డులు మాత్రమే ఇస్తున్నారు. ఇక నుండి సాక్షులతో సైతం ఫొటోలు, గుర్తింపుకార్డులు ఉండాలంటే లావాదేవీలు జరుపుకునే వారికి అదనపు భారంగా తయారైందని వాపోతున్నారు. దస్తావేజులో సాక్షి అనేవాడు క్రయ,విక్రయదారులపై ఉన్న మంచితనంతో కార్యాలయానికి వచ్చి సంతకంచేసి వెళ్లేవారని, అలాంటిది గుర్తింపుకార్డు, ఫొటో అంటే ఎలా సాధ్యమని స్థానిక రైతులు సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆచంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి మండలంలో పూర్తిగానూ, పోడూరు, పెనుగొండ మండలాల్లో కొన్నిగ్రామాల ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం ఆచంట రావలసి ఉంటుంది. దూరప్రాంతాల నుండి క్రయ, విక్రయదారులే కాకుండా సాక్షులను కూడా తీసుకురావాలంటే పనుల్లోకి వెళ్లే చిన్నకమతాల వారిని అదనంగా రోజువారీ మొత్తం చెల్లించి ఆ వ్యక్తుల ఫొటోలు, ఖర్చులు సైతం తామేభరించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, వెంటనే సాక్షులపై విధించిన నిబంధనలు ఉన్నతాధికారులు ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూములు, స్థలాలు మార్కెట్ విలువలను విపరీతంగా పెంచేశారని, స్టాంపుడ్యూటీ భారంగా తయారైందని రైతులు వాపోతున్నారు. సాక్షుల గుర్తింపుకార్డులు, ఫొటోలు అమలుసాధ్యమేనా అని సబ్‌రిజిస్ట్రార్ శేఖర్‌బాబును అడిగినప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాలు అమలుచేయడం తమ బాధ్యతని, అయితే స్థానికంగా ఉన్న ఇబ్బందులను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లతానని, అంతవరకు సాక్షులు ఫొటోలు, గుర్తింపుకార్డులు తీసుకురావడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
నేడు, రేపు చంద్రబాబు ప్రచారం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఏప్రిల్ 17: ఉపఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. బుధవారం ఆయన పోలవరం నియోజకవర్గంలోను, గురువారం నర్సాపురం నియోజకవర్గంలోను ఉప ప్రచారం చేయనున్నారు. అభ్యర్ధుల ఖరారు జరిగిపోగా ఊహించినట్లుగానే పోలవరంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. మొడియం శ్రీనివాసు ఎంపిక పట్ల పూనెం వర్గం నిప్పులు చెరుగుతోంది. ఇప్పటికే పూనెం సింగన్నదొర పార్టీపరంగా ఉన్న పదవులకు రాజీనామా చేయగా ఆ మండల పార్టీ కూడా రాజీనామాలు సమర్పించింది. ఈ పరిణామం అసలే ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని మరిన్ని ఇక్కట్లలోకి నెట్టివేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉపఎన్నికల ప్రచారానికి అధినేత రావటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే పోలవరం నియోజకవర్గంలో బలమైన వర్గంగా ఉండి తెలుగుదేశం పార్టీకి తొలినుంచి అండగా నిలబడుతున్న పూనెం సింగన్నదొర వర్గం అసంతృప్తికి గురికావటం మాత్రం పార్టీకి ఇబ్బందేనని చెపుతున్నారు. అయితే సింగన్నదొరను శాంతపరచేందుకు జిల్లా స్ధాయిలో నేతలు చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. చివరకు ఈ పంచాయతీని అధినేత ముందే తేల్చేందుకు నేతలు నిర్ణయించారు. మొడియం శ్రీనివాసు ఎంపికలో అనుసరించిన విధానం, రాజకీయ సమీకరణాలు, ఇతర అంశాల విషయంలో అధినేత అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం సింగన్నదొర వర్గం ఏ నిర్ణయానికి దిగుతుందన్నది వేచి చూడాలి. అయితే అభ్యర్ధి ఎంపిక విషయంలో పార్టీ అధినేత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే పార్టీపరంగా కాకుండా ఇతరత్రా వర్గాల ద్వారా కూడా సర్వేలు, అభిప్రాయసేకరణ నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ నేతలు చెపుతున్నారు. అంతేకాకుండా పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్ధితుల నేపధ్యంలో మొడియం శ్రీను బలమైన అభ్యర్ధి అనే స్ధానిక నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆమోదింపచేసుకోవటంలోనే అధినేత రాజకీయచాతుర్యం ఆధారపడి ఉందని చెపుతున్నారు. జిల్లాలో మొత్తంగా పరిస్ధితిని చూస్తే పోలవరం, నర్సాపురం రెండు నియోజకవర్గాలు తొలుత కాంగ్రెస్ పార్టీకి చెందినవే. అయితే అనంతర పరిణామాల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ వైపు మళ్లిపోయి రాజీనామాలు చేయటంతో ఉపఎన్నికలు తప్పలేదు. గతం నుంచి పోలవరం, నర్సాపురం నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగానే నిలుస్తూ వచ్చాయి. పోలవరంలో పూనెం వర్గం, నర్సాపురంలో కొత్తపల్లి వర్గాలదే ఎప్పుడూ పైచెయ్యిగా ఉంటూ వచ్చింది. తాజా పరిస్దితుల్లో కొత్తపల్లి కాంగ్రెస్ అభ్యర్ధిగా నర్సాపురం నుంచి రంగంలోకి దిగటం, పోలవరంలో పూనెం వర్గం అసంతృప్తికి గురికావటం వంటివి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. గత వైభవాన్ని అందిపుచ్చుకునేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నా అవి ఈ పరిణామాలతో నిర్వీర్యం అవుతాయన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే పార్టీ అధినేత పర్యటన పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించటంతోపాటు క్యాడర్‌కు నూతన ఉత్తేజాన్ని అందించవచ్చునని భావిస్తున్నారు. రెండురోజులపాటు రెండు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేయనున్న చంద్రబాబు ప్రచారంతోపాటు అంతర్గత సమస్యలపై కూడా దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తారని భావిస్తున్నారు. పార్టీ వర్గాల వివరాల ప్రకారం బుధవారం ఉదయం గన్నవరం చేరుకునే చంద్రబాబు అక్కడ నుండి ఏలూరు, గుండుగొలను, నర్లజర్ల మీదుగా ప్రయాణం చేసి 11గంటల సమయంలో కొయ్యలగూడెం చేరుకుంటారు. అక్కడి కృష్ణమనోహర్ ఫంక్షన్ హాలులో పోలవరం నియోజకవర్గంలోని అయిదు మండలాల నాయకులు, కార్యకర్తలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం బయ్యన్నగూడెం నుంచి మధ్యాహ్నం 3గంటలకు రోడ్‌షో ప్రారంభించే చంద్రబాబు సీతంపేట, నర్సన్నపాలెం, లక్ష్మిపురం, దర్భగూడెం, జీలుగుమిల్లి, పాలచెర్ల, మక్కినవారిగూడెంల మీదుగా టి నర్సాపురం చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.30గంటలకు బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి బస దిండి రిసార్ట్సులో చేస్తారు. తిరిగి గురువారం ఉదయం నర్సాపురం చేరుకుని అక్కడి జై రాజేంద్ర లయన్స్ ఆడిటోరియంలో నర్సాపురం నియోజకవర్గంలోని మండలాల నాయకులు, కార్యకర్తలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రోడ్‌షో ప్రారంభిస్తారు. నర్సాపురం రూరల్ లక్ష్మణేశ్వరం నుంచి ప్రారంభమయ్యే రోడ్‌షో చినసార్వా, ఎల్‌బి చెర్ల, మోడి, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, పేరుపాలెం సెంటరు, మోడి(ముత్యాలంపల్లి) మీదుగా మొగల్తూరు చేరుకుంటారు. అక్కడ జరిగే సభలో ఆయన పాల్గొంటారు.

జిల్లాలోని 5.30 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టాలోని వందలాది గ్రామాలలోని లక్షలాది ప్రజలకు
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>