పాలకొల్లు, ఏప్రిల్ 17: పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాని అధికార సమావేశాలుగాని జరగుతున్నాయంటే అధికారులకు కంగారుగా ఉంటుంది. ప్రజలకు ఎవరితో మాట్లాడితే ఏవౌవుతుందోనన్న భయం. చూసే వారికి మన రాజకీయ నాయకులు పరిస్థితి ఇలా ఉందన్న భావన కలుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బంగారు ఉషారాణి ఉన్నారు. ఎమ్మెల్సీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకా శేషుబాబు ఉన్నారు. మరో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికయ్యారు. వీరు ముగ్గురు పాలకొల్లుకు చెందిన వారు కావటంతో, ఏ అధికార కార్యక్రమం జరిగినా వీరిని పిలుస్తారు. ఒక వేళ ఎవరైనా పిలవక పోతే అధికారుల సంగతి అంతే. మంగళవారం ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఉషారాణి పాలకొల్లు మండలంలో వరిధనం నుండి ముఖ్య అతిథిగా పాల్గొని ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేశారో చెప్పుకుంటూ వచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో వస్తున్న మహిళలకు, రైతులకు యిచ్చిన రాయితీలు చెబుతూ వచ్చారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులు వివరిస్తూ వచ్చారు. పెదమామిడిపల్లిలో ఆమె మధ్యలో తనకు పనుందని వెళ్లటానికి సిద్ధపడిన సమయంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు వచ్చారు. అభివృద్ధి పనుల సమీక్ష పూర్తిచేసి వెళ్లపోతున్న ఆమెను ఇద్దరు ఉండగా తమ సమస్యలు చెప్పుకుంటామని గ్రామ ప్రజలు కోరగానే, ఉషారాణి కొంత సమయం వేచి ఉన్నారు. డ్రెయిన్లు తవ్వకం పనులు జరగలేదని, మంచినీటి సమస్యపై ఈ ప్రభుత్వం పనిచేయలేదని ప్రజలు విమర్శలు కురిపించారు. దాంతో ఉషారాణి డ్రైనేజీ అధికారులతోనూ, శేషుబాబు ఆర్‌డబ్ల్యుయస్ అధికారులతోను ఫోన్‌లో ప్రజల ముందు వివరణ కోరటం ప్రారంభించారు. డ్రెయిన్ పనులు మంజూరయ్యాయని, కాంట్రాక్టు కూడా ఇచ్చారని, కాని కాంట్రాక్టు పనులు పూర్తికాలేదని తెలిసింది. ఇక ఉషారాణి సమావేశం నుండి పనుందని నిష్క్రమించారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సమావేశం ముగిసే వరకు ఉండి ఈ ప్రభుత్వం ఏమీ చేయటంలేదని విమర్శలు గుప్పించారు. దిగమర్రులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తిరిగి పాల్గొన్నారు. కాని శేషుబాబు పాల్గొనలేదు.
విఆర్‌ఎ కోడళ్లకు ఓకే!
-ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం-
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఏప్రిల్ 17: స్థానికేతర నిబంధన విఆర్‌ఎ కోడళ్లకు ప్రతిబంధకంగా మారటం, దానిపై విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఆ నిబంధనకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేరే ప్రాంతానికి కోడళ్లుగా వెళ్లి అక్కడ విఆర్‌ఎ పోస్టులు సాధించిన మహిళలకు అనుమతిస్తూ ప్రభుత్వం జివో విడుదల చేసింది. దీనిప్రకారం ఒక మండలానికి చెందిన మహిళ వివాహం అనంతరం వేరే ప్రాంతంలో ఉన్న అత్తింటికి వెళ్లటం సహజం. సంప్రదాయం ప్రకారం వివాహం అయిన మహిళకు అత్తింటి మండలమే స్ధానిక మండలంగా ఉంటుంది. అయితే విఆర్‌ఎ ఎంపికల్లో ఈ అంశం స్ధానికేతరులుగా ఈ మహిళలను గుర్తించే పరిస్దితి వచ్చింది. ఈవిధంగా దాదాపు 68 మహిళలు విఆర్‌ఎ పోస్టులు సాధించినా ఫలితం లేకపోయింది. దీనిపై పూర్వాపరాలు పరిశీలించిన ప్రభుత్వం ఈవిధంగా ఒక మండలంలో పుట్టి మరొక ప్రాంతంలో వివాహం కారణంగా నివసిస్తున్న మహిళలను ఆ ప్రాంత స్ధానికులుగానే గుర్తించి ఈ పోస్టులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 466 విఆర్‌ఎ పోస్టులకు గాను 284 పోస్టులను భర్తీ చేశారు. స్ధానికేతర అంశం కారణంగా 68 మహిళలకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికి కూడా పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కాగా మిగిలిన పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు లేకపోవటంతో మరోసారి విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారానే వీటిని భర్తీ చేయటం జరుగుతుందని అధికారులు చెప్పారు.
జిల్లాలో 49 వీఆర్వో పోస్టులకు అభ్యర్ధులను జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఎంపిక చేసింది. వీరందరికి పోస్టింగ్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే వీరిలో ఒకరు తన పోస్టుకు రాజీనామా చేస్తూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆమోదముద్ర పడితే ఆ పోస్టులో జాబితాలో ఈ అభ్యర్ధి తర్వాత ఉన్న అభ్యర్ధికి అవకాశం లభించనుంది.
యనమదుర్రు ఆధునికీకరణకు మూడు సంస్థలు సిద్ధం:ఇఇ
ఉండి, ఏప్రిల్ 17: యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనుల నిర్వహణకు మూడు సంస్థలు సిద్ధమైనట్టు పశ్చిమ డెల్టా ఇరిగేషన్ ఇఇ వి కృష్ణారావు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. దువ్వ నుండి నందమూరు అక్విడెక్టు వరకు ఎడమ గట్టును పటిష్ఠం చేసి డ్రెయిన్ అధునికీకరణకు సంబంధించి భూ సేకరణ నిమిత్తం 105 ఎకరాలకు రూ.5.5 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే ఆ పని ప్రారంభమవుతుందన్నారు. పిప్పర నుండి గొల్లవానితిప్ప వరకు గట్టు పటిష్ఠ పర్చటంతో పాటు బెడ్ కటింగ్‌కు రూ.33 కోట్లతో పనులు వేసవిలో ప్రారంభం కానున్నాయన్నారు. అదేవిధంగా గొల్లవానితిప్ప నుండి సముద్ర ముఖద్వారం వరకు రూ.14 కోట్లతో డ్రెడ్జింగ్‌కు కూడా ఏజన్సీ ఖరారయ్యిందన్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాని అధికార సమావేశాలుగాని జరగుతున్నాయంటే
english title:
o
Date:
Wednesday, April 18, 2012