పెదవేగి, ఏప్రిల్ 17 : మండలంలోని కొప్పాక గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పెదవేగి ఎస్‌ఐ ఆనందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెదకడిమికి చెందిన పర్వతనేని రామకృష్ణ చౌదరి (34), ఉండవల్లి శివశంకర్(35) వీరిరువురు కొప్పాక నుండి చినబోయినపల్లి వెళ్లే రోడ్డులో గో సంరక్షణ సమితి భూముల సమీపంలో సిడి డీలక్స్ మోటారు సైకిల్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఇరువురు అక్కడికక్కడే మరణించారు. రోడ్డుకు ఇరువైపులా శవాలు పడి వున్నాయి. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గుర్తుతెలియని భారీ వాహనం ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ందని ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఉండవల్లి శివశంకర్‌కు భార్య, కుమార్తె వున్నారు. పర్వతనేని రామకృష్ణ చౌదరికి ఇంకా వివాహం కాలేదు. ఇటీవల జరిగిన బలివే తిరునాళ్లలో జరిగిన చిన్న గొడవ కారణంగా ముసునూరు పోలీస్‌స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది. కోర్టు పని నిమిత్తం నూజివీడు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజాపధం కార్యక్రమంలో నుండి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు.
రాజకీయాల్లో నీతిమంతులెవరూ లేరు
మొగల్తూరు, ఏప్రిల్ 17: తనతో పాటు సహా అందరూ నీతి తప్పిన వారేనని, ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ నీతిమంతులు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ పార్టీ ప్రచారంలో భాగంగా మంగళవారం శేరేపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో కలిసి ప్రచారంచేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటిసి నిప్పులేటి మాణిక్యాలరావు ఇంట్లో జరిగిన సమావేశంలో జోగయ్య మాట్లాడుతూ ప్రజలు అవినీతిని పట్టించుకోవడం లేదని, సమర్ధవంతమైన నాయకునికే ఓట్లు వేస్తారని, జగన్‌కు ఆ సమర్థత ఉందని ప్రజలు నమ్మారన్నారు. ప్రజలు ఏ పక్షాన ఉంటే తానూ ఆ పక్షాన ఉంటానని చెప్పారు. జిల్లాలో రూ.14 కోట్లతో ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టిన ఘనుడు వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. డబ్బులిస్తే తీసుకోవాలని, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తే నిర్మించుకోవాలని, రోడ్లు వేయిస్తే వేయించుకోవాలి, ఓట్లు మాత్రం ప్రసాదరాజుకు వేయాలని జోగయ్య కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జోహార్‌వతి, జిల్లా యూత్ అధ్యక్షులు కె రత్నం, పి నాగరాజు, కె ఏసుబాబు, రంగశెట్టి ఏసు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని కొప్పాక గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
english title:
r
Date:
Wednesday, April 18, 2012