ఇండియాలో టెక్నాలజీ లేటే. ప్రపంచ దేశాల్లో 3జి
వచ్చాక మనం 2జికి వెళ్లాం. అంతలోనే 3జి
అంటూ హడావిడి చేశారు. స్కాములూ జరిగాయి
కానీ 3జి సక్సెస్ కాలేదు. ఇంతలోనే 4జి రెడీ.
ఇప్పటికే 4 సర్కిల్స్‌లో 4జి అమలు చేయడానికి
లైసెన్సులు దక్కించుకున్న ఏర్‌టెల్ సంస్థ
కోల్‌కతాలో 4జి సేవలను ఆరంభించింది. మరో నెల
వ్యవధిలో బెంగుళూరులోనూ ఆరంభిస్తున్నట్లు వార్త.
ముంబై మినహా మహారాష్టల్రో, చండీగఢ్‌లో మరో 6
నెలల్లో 4జి సేవలను అందుబాటులోకి తేనున్నదని
వార్త. మరి మనకంటారా- లెటజ్ వెయిట్ అంట్
సీ...
=========
ప్రశ్న - జవాబు
Q. సాఫ్ట్‌వేర్‌కు లైసెన్సు కీ ఎలా తెలుస్తుంది?
ఒకవేళ సాఫ్ట్‌వేర్‌లో అది బిల్డిన్ అయితే దాన్ని
తెలుసుకోవడం ఎలా?
-Naveen,
(lukky.q22@gmai.com)
A. సాఫ్టువేర్‌కు లైసెన్సు కీ అనేదొక నిర్దిష్ట ప్రకియ
ప్రకారం రూపొందుతుంది. దానిని రిజిస్ట్రీలో
ఉంచుకుంటుంది. దయచేసి లైసెన్సు కీలతో,
రిజిస్ట్రీలతో ప్రయోగాలు చేయవద్దు.
=========
పనికిరాని పరిజ్ఞానం
రిజల్యూషన్, డైనమిక్ రేంజి
డిజిటల్ ఆడియోలో సౌండ్‌కు సంబంధించిన పలు
విలువలు సంఖ్యలుగా సేకరిస్తారు. అవి బిట్స్‌గా సేవ్
అవుతాయి. ఒక శాంపిల్ (శాంపిల్ అంటే ఒక నిర్దిష్ట
సమయం వద్ద శబ్ద తరంగాలకు సంబంధించిన
విలువ) విలువను దాచేందుకు వాడే బిట్స్
సంఖ్యను బిట్ డెప్త్ అంటారు. ఆ కేటాయించిన
బిట్స్‌లో దాయగల అతి తక్కువ విలువ, అతి
పెద్దవిలువ మధ్య ఉండే రేంజిని రిజల్యూషన్
అంటారు. ఏ సాధనమైనా ప్రాసెస్ చేయగల అతి
తక్కువ స్థాయి, అతి పెద్ద స్థాయిల మధ్య ఉండే
విలువల రేంజిని డైనమిక్ రేంజి అంటారు.
=======
పద పారిజాతం
Non-Impact Printer - నాన్ ఇంపాక్ట్
పద్ధతిలో పనిచేసే ప్రింటర్. అంటే ఒత్తిడివల్ల
కాకుండా ఇంకు వెదజల్లడం ద్వారా ముద్రణ చేసే
ప్రింటర్. లేజర్ ప్రింటర్. ఇంక్‌జెట్ ప్రింటర్
ఉదాహరణలు.
Non-volatile memory - నాన్ వొలటైల్
మెమరీ అంటే విద్యుత్ సరఫరా ఆగిపోయినా అందలి
డేటా లేదా సమాచారం మాత్రం సురక్షితంగా
ఉంటుంది. డిస్క్ మెమరీ, ప్లాపీ, రీడ్ ఓన్లీ
మెమరీలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
Notebook - నోట్‌బుక్ లేదా నోట్‌బుక్
కంప్యూటర్ అనేది దాదాపు మనం నిత్యం వాడే
నోట్‌బుక్ ఆకారంలో తక్కువ బరువుతో ఉండి,
బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో ఎల్‌సిడి మానిటర్
ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌లు తరచూ వాడుతూ
ఉంటారు.
=============
షార్ట్ కట్స్
ALT+End రో చివరికి
వెళ్లడానికి
ALT+ Shift+End రో
చివరిదాకా హైలెట్ చేయడానికి
CTRL+Shift+enter-
కాలమ్ బ్రేక్ చేయడానికి
==============
సామెత
డేటా కార్డులమ్మినచోట పాతకాలం
మోడెములమ్మవద్దు
===========