కింద చెప్పిన 15 అంశాల్లో మీరు కనీసం ఏ ఆరేడు
అంశాలకైనా సమాధానం కరెక్టని అనుకున్నారో,
మీకు 21 శతాబ్దంలో టెక్నాలజీ ఓవర్‌డోస్
అయినట్టే.
1. మీరు మైక్రోవేవ్‌లో పాస్‌వర్డ్ ఎంటర్
చేయాలని ప్రయత్నించారు.
2. మీవద్ద మీ కుటుంబంలో ఉండే
నలుగురిని కాంటాక్ట్ చేయడానికి 16 ఫోన్
నెంబర్లున్నాయి.
3. సాలిటయిర్ గేమ్‌ను కంప్యూటర్‌లో
ఆడతారేగానీ, పక్కన పేకముక్కలున్నా ఆడరు.
4. మీ పక్కనున్న మిత్రుడిని లంచ్
చేద్దాం రా అని ఈ-మెయిల్ పంపుతారు. లేదా
ఎస్సెమ్మెస్ ఇస్తారు.
5. ఈ ఏడాది ముక్కూ మొహం తెలీని
అమెరికా మిత్రునితో గంటల తరబడి చాటింగ్ చేసారు
గానీ పక్కింటివారితో మాటైనా మాటాడలేదు.
6. మీ ఫ్రెండ్స్‌తో టచ్‌లో లేరు.
ఎందుకనడిగితే, వారి ఈ-మెయిల్ అడ్రస్‌లు నా
దగ్గర లేవు అంటారు.
7. మీరు జోకులు సైతం పక్కనవారు
వేయడం వల్ల కాకుండా ఈ-మెయిల్స్‌లోనే
ఆస్వాదిస్తున్నారు.
8. రోజంతా ఆఫీసులో పనిచేసి ఇంటికి
వెళ్లాక కూడా మీరు వ్యాపార ధోరణిలోనే ఫోన్
కాల్స్‌ను అందుకొని మాట్లాడుతున్నారు.
9. ఇంట్లో ఉన్నపుడు కూడా
ఆఫీసులో ఇంటర్‌కామ్‌ను వాడినట్టే మీ ఫోన్‌లు
వాడే ప్రయత్నం చేస్తున్నారు.
10. వంటింట్లోనుంచి అమ్మ భోజనానికి
రారా బాబూ అంటే, వంట ఏం చేసేవు అని
ఈ-మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ పంపుతారు.
11. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తప్ప
డబ్బును దాని నిజమైన రూపంలో చూడటం
మరిచిపోయారు.
12. వేలంటైన్స్ డే నాడు గ్రీటింగ్స్
చేతికివ్వకుండా మీ బ్లాగులో ఉంచారు.
13. కాలేజీ హోంవర్కూ, రికార్డులూ,
ప్రాజెక్టు వర్కులూ, అన్నీ మీ మిత్రుని వద్దనుంచి
సీడీ రూపంలో తెచ్చుకున్నారు కాపీ కొట్టడానికి.
14. టీవీలో వచ్చే ప్రతి ప్రకటనలోనూ ఆ
కంపెనీ వెబ్‌సైటు అడ్రసుందా? అని చూస్తారు.
15. ఆఖరుకి ఎవరన్నా మీ గూర్చి
చెప్పమంటే మీ బ్లాగును చూడమనే చెబుతారు. మీ
ఫ్యామిలీ గురించి చెప్పమంటే జీనీ వెబ్‌సైటు
చూడమంటారు.
===========