కర్ణాటకలోని కొప్పాళ్ నించి హైదరాబాద్‌కి వచ్చే కెఎస్ ఆర్టీసి ఆర్డినరీ బస్ డ్రైవర్ సిహెచ్.సత్యనారాయణ అపూర్వమైన వ్యక్తి. అతను తన ఖర్చుతో తను నడిపే బస్‌లో శుద్ధిచేసిన తాగునీటిని ప్రయాణీకులకి ఉచితంగా అందిస్తున్నాడు. తను ఏర్పాటుచేసుకున్న మైక్‌లో బస్సు ఎక్కడ ఎన్ని గంటలకి ఆగుతుంది అన్న సమాచారాన్ని కూడా ప్రయాణికులకు ముందుగా ఇస్తున్నాడు. బస్‌లో ఫేన్లని కూడా బిగించాడు. ఆత్మతృప్తి కోసమే తనీ సేవ చేస్తున్నానని అతను ఓ విలేకరితో చెప్పాడు.
దురదృష్టపు దొంగ
పెన్సిల్వేనియాలోని లిబర్టీ అనే ఊరికి చెందిన క్రిస్ట్ఫర్ అలెన్ కాక్ (26) అనే దొంగ సిటిజన్స్ అండ్ నార్త్న్ బేంక్ ఆవరణలో ఉదయం పదకొండు నలభైకి ముఖానికి ముసుగు, చేతులకు గ్లౌస్ ధరించి తన కారులో వచ్చి దొంగతనానికి కూర్చున్నాడు. పనె్నండు ఒకటికి బేంక్ మూసేసి కస్టమర్స్ అందరూ బయటికి వచ్చాక బేంక్‌లోకి చొరబడాలని చేతిలో పిస్తోలుతో అతను తయారుగా కూర్చున్నాడు. ఇతన్ని గమనించిన కొందరు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి అలెన్‌ను అరెస్టు చేశారు.
ఉచితం...
ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే సైట్
WAY2SMS.com. మన సెల్‌ఫోన్ నెంబర్‌తో దీన్ని విదేశాలనించి కూడా ఇండియన్ సెల్‌ఫోన్స్‌కి ఎస్సెమ్మెస్ పంపడానికి ఉపయోగించవచ్చు.
హెల్త్ టిప్
చాలామంది ఇంట్లో ట్రెడ్‌మిల్ దగ్గర నడుస్తుంటారు. దానికన్నా ఇంటి బయట నడిచే నడకవల్ల సూర్యరశ్మి ధారాళంగా సోకుతుంది. ఇంట్లోకన్నా శుద్ధమైన గాలిని పీల్చవచ్చు. మనసుకీ ప్రశాంతంగా ఉంటుంది.