చైనా వృద్ధాప్యంతో బాధపడుతున్నది! రెండుమూడు దశాబ్దాల క్రితం దేశ జనాభాలో అత్యధిక శాతం మంది యువకులే ఉండడంతో శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన చైనాకు ఇప్పుడు పెరుగుతున్న వృద్ధుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాది సేకరించిన జనాభా లెక్కల ప్రకారం చైనాలో 12.30 కోట్ల మంది వృద్ధులున్నారు. దేశ జనాభాలో ఇది 9.1 శాతం. సంపాదించేవారు, వృద్ధుల నిష్పత్తి క్రమంగా పెరుగుతూ 2050 సంవత్సరం నాటికి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులకు సౌకర్యాలు కల్పించడం, వారి పోషణ, ఆరోగ్య పరిరక్షణకు భారీగా ఖర్చు చేయడం వంటి అంశాలు ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారునున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల చైనా భవిష్యత్తులో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా కూడా రికార్డులకు ఎక్కుతుందేమో!
===========
వింతలోకం
అమెరికాలో వివాహేతర సంబంధంతో పెళ్లిచేసుకోకుండా జీవించే విధానం అధికమైంది. అలాంటివారు పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. కొందరు మహిళలు ఇలాంటి సంబంధాలు ఇష్టంలేక ఒంటరిగా జీవిస్తున్నారు. అలాంటివారికి పసి పిల్లల ముచ్చట తీర్చడానికి న్యూయార్క్‌కి చెందిన ఆట వస్తువుల కంపెనీ నెలల పసిపిల్లల బొమ్మలని తయారు చేసి అమ్ముతోంది. అప్పుడప్పుడూ ఏడవడం, కేరింతలు కొట్టడం, పాకడం, కళ్ళు మూసుకుని నిద్రపోవటం లాంటి చేష్టలన్నీ ఈ బొమ్మ చేస్తుంది. ఏడ్చినప్పుడు ఎత్తుకుంటే ఏడుపు ఆగిపోతుంది. ఈ బొమ్మలకి మంచి గిరాకీ ఏర్పడింది. ఒంటరి మహిళలని ఇవి అర్థరాత్రి ఏడిచి నిద్రలేపటం విశేషం.
===========
హాలీవుడ్ కబుర్లు
కొందరు హాలీవుడ్ నటులు వయసు పైబడ్డాక తమకన్నా బాగా చిన్నవాళ్ళని పెళ్లిచేసుకున్నారు. హంఫ్రీ బోగర్ట్, లారెన్ బకాల్‌ని ఆమె పదహారవ ఏట వివాహం చేసుకున్నాడు. పీటర్‌సెల్లర్స్, బ్రిట్ ఎక్లండ్‌ని ఆమె పదిహేడవ ఏట, వారెన్ బెట్టీ, అనె్నట్టె బెనింగ్‌ని ఆమె ఇరవై ఒకటో ఏట, క్లింట్ ఈస్ట్‌వుడ్ డయానా రూయిజ్‌ని ఆమె ముప్ఫై ఐదో ఏట వివాహం చేసుకున్నారు. రిచర్డ్ గెరే సిండీ క్రాఫోర్డ్‌ని ఆమె పదిహేడవ ఏట వివాహం చేసుకున్నాడు.
చైనా వృద్ధాప్యంతో బాధపడుతున్నది!
english title:
china growing old
Date:
Wednesday, April 18, 2012