‘మన పెళ్ళయినపుడు పురోహితుడు సంస్కృత మంత్రాలు నీతో చెప్పించి, వాటి అర్థాలు చెప్పాడుగా. నువ్వు నా మాటని అతిక్రమించనని, నేను చెప్పినట్లు వింటానని ప్రతిజ్ఞ చేసావు గుర్తుందా?’’ సుబ్బారావు తన భార్యని కోపంగా అడిగాడు.
‘‘గుర్తుంది. కాని అంతమంది ముందు వాదన ఎందుకని నేను మాట్లాడలేదు’’ సుందరి జవాబు చెప్పింది.
============
డైవర్స్
పెళ్లిళ్లు స్వర్గంలో. విడాకులు భూమీద. అయితే ఎవరూ తాము విడాకులు తీసుకోవాల్సి వస్తుందని పెళ్లి సమయంలో అనుకోరు. కొన్ని వింత కారణాల వల్ల కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుంటారు.
****
రుమేనియాకి చెందిన ఎలీనా (22) తన భర్తనించి పెళ్లయిన పదినెలలకే విడాకులని కోరుకుంది. కారణం అత్తగారు. ఆమె రోజూ లంచ్ టేబుల్ దగ్గర తనని విమర్శించడం భరించలేని ఎలీనా అనేక విధాలుగా ఆమెకి చెప్పి చూసి చివరికి విడాకులకై కోర్టుకెక్కింది.. ‘నువ్వు పెళ్లి చేసుకుంది నీ భర్తని తప్ప, నీ అత్తగారిని కాదు. కాబట్టి ఆవిడకి నిన్ను విమర్శించే హక్కు లేదు’ అని చెప్పి జడ్జి విడాకులు మంజూరు చేసాడు.
============
లింగు: గుండు చేయించుకున్నావు. తిరపతికి వెళ్ళొచ్చావా?
లిటుకు: లేదు. కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళొచ్చాను.
‘మన పెళ్ళయినపుడు పురోహితుడు సంస్కృత మంత్రాలు నీతో చెప్పించి,
english title:
chirunavvuki chirunama
Date:
Wednesday, April 18, 2012