Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గిట్టుబాటు ధర కల్పించమంటే అరెస్టులా?

$
0
0

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 18: రైతులు పండించిన వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేస్తుంటే స్పందించాల్సిన ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేపడుతున్నదని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వార్ల వెంకటయ్య ఆరో పించారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం రైతుల సమస్యలపై ముఖ్యంగా రైతులు పండించిన పత్తి, మిర్చి, పసుపు పంటలకు ప్రభుత్వం కింట్వాలుకు రూ. 10 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాజి ఎమ్మెల్యే, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె రామకృష్ణ ధర్నా చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమని ఆరో పించారు. మాజీ ఎమ్మెల్యే రామ కృష్ణను అరెస్టు చేయడాన్ని నిరసి స్తూ బుధవారం ఎపి రైతు సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేస్తున్న వారినుద్దేశించి వార్ల వెంకటయ్య మా ట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యల గురించి పట్టించుకోవడంలేదని, పైగా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రైతు పండించిన వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించా లని, కరవుతో అల్లాడుతున్న రైతులకు వెంటనే పంట నష్టపరిహారం చెల్లించి సహాయక కార్యక్రమాలను చేపట్టా లని, పశువులకు పశుగ్రాసం, నీటి వసతి కల్పించాలని, గతంలో పెండింగ్‌లో ఉన్న పెద్ద రైతుల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ఆందో ళన కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతామని హెచ్చరించారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపున పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎండ కాలం కావటంతో తాగునీటి కోసం మహిళలు, పిల్లలు అల్లాడిపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చెన్నదాసు, నాయకులు వంకేశ్వరం శ్రీనివాసులు, ఖుత్భోద్దీన్, సత్యం, శ్రీశైలం, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపథంలో తాగునీరు, ఉపాధిపై నిలదీత
వెల్దండ, ఏప్రిల్ 18: తాగునీరు, ఉపాధిహామీ పనులు, విద్యుత్ సమస్య, ఇందిరమ్మ బిల్లులపై ప్రజాపథం గ్రామసభలలో ప్రజలు అధికారులను నిలదీశారు. బుధవారం వెల్దండ మండల పరిధిలోని కొట్ర, తాండ్ర, పోతేపల్లి, గోకారం, చంద్రాయనిపల్లి, జూపల్లి గ్రామాలలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు గోపాల్, శివరామశర్మలు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజాపథం గ్రామసభలలో నెలల తరబడి చుక్కనీటి కోసం పడరానిపాట్లు పడుతున్నా సంబంధిత అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు ఇలాంటి గ్రామసభలు ఎందుకని నిలదీశారు. ఉన్న స్కీం బోర్లు, చేతిపంపుల్లో నీటిమట్టం తగ్గిపోయి తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడుతున్నామని, గ్రామాలలో అదనంగా బోర్లు వేయించి సింగిల్ ఫేస్ మోటార్లు బిగించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. తామేమి చేయలేమని, వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, సాధ్యమైనంత వరకు తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు. ఏడాది కాలంగా ఉపాధిహామీ పథకంలో పనులు చేసినా బిల్లులు ఇవ్వలేదని పోతేపల్లి గ్రామసభలో కూలీలు ప్రశ్నించగా జాబ్‌కార్డులు ఉన్నా వ్యవసాయ పొలాల్లో ఉపాధి పనులు చేపట్టడం లేదని కొట్ర గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొట్ర గ్రామంలో బిల్లుల కోసం విద్యుత్ లైన్‌మెన్ అసభ్యంగా దూషిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు. అకాల వడగళ్ల వర్షాలకు నష్టపోయిన మామిడి, వరి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్ సరఫరాతో మోటార్లు కాలిపోతున్నాయని, ఇచ్చే కరెంట్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరారు. చంద్రాయనిపల్లి గ్రామంలో ప్రజలు లేక గ్రామసభ వెలవెలబోయింది. ముఖ్యంగా ఆయా గ్రామాలలో ప్రత్యేక అధికారి సోమిరెడ్డి పట్టింపులేని తనం, ఎంపిడిఓ బాలశంకర్ కనుసైగలతో ప్రజాపథం గ్రామసభలు వివిధ శాఖలకు సంబంధించిన నివేదికలు చదవకుండానే అర్ధాంతరంగా గ్రామసభలు ముగించి అయిందన్పించుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సోమిరెడ్డి, తహశీల్దార్ గోపాల్, ఎంపిడిఓ బాలశంకర్, ఏఇలు చంద్రశేఖర్, ఫారూఖ్, ఇఓఆర్‌డి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

యుపిఏ పాలన అస్తవ్యస్తం
* బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18: దేశంలో పదేళ్ల యుపిఏ పాలన అస్తవ్యస్తంగా మారి దేశాన్ని భ్రష్టు పట్టించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో బిజెపిని గెలిపించినందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరులో బిజెపి గెలుపు ప్రజల గెలుపుగా భావిస్తున్నామని, తెలంగాణ పట్ల బిజెపికి ఉన్న చిత్తశుద్ధికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. తెలంగాణ విషయంలో విశ్వసనీయతకే ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. బిజెపి గెలిచిందని కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు సంతోష పడుతున్నారని, అధిష్ఠానానికి ఈ గెలుపుతోనైనా కళ్లు తెరుస్తుందని వారు భావిస్తున్నట్లు తన దగ్గర ఉన్న సమాచారమన్నారు. టిఆర్‌ఎస్ 11 ఏళ్లుగా ప్రజాప్రతినిధులుగా గెలుస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, అయితే పాలమూరులో బిజెపి గెలుపుతో కాంగ్రెస్ ఎంపీలలో భయం పుట్టిందని అన్నారు. అందుకే బిజెపితో కలిసి పార్లమెంట్‌లో ఐదు రోజుల పాటు స్తంభింపజేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలను బిజెపి ప్రతిభింభింపజేస్తుందని, ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా పాలమూరు గెలుపుపైనే అన్ని రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతుందని అన్నారు. పాలమూరు గెలుపుతో కాంగ్రెస్‌కు గుణపాలు కుచ్చుకున్నాయని అన్నారు. ఈ సీటు గెలువడంతో బిజెపికి తెలంగాణ ఉద్యమానికి వేయి ఏనుగుల బలం వచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు శిరసావహించి నమస్కరిస్తూ తాను ప్రత్యేక సెల్యూట్ చేస్తున్నానని సభలో కిషన్‌రెడ్డి సెల్యూట్ చేశారు. దేశంలో కాంగ్రెస్ వెలుగులు మూసుకుపోతున్నాయని, ఆ పార్టీకి చీకటి కమ్ముకొస్తుందని, ఢిల్లీలో గత రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో బిజెపి దేశ రాజధానిలో పాగా వేసిందని, ఢిల్లీలో కేవలం ఢిల్లీ వాసులే ఉండరని, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ఓటర్లు అని, ముఖ్యంగా ఆరు లక్షల మంది ప్రజలు తెలుగు ఓటర్లు ఉన్నారని, వీరంతా బిజెపికి బాసటగా నిలిచారని అన్నారు. దేశ ప్రజలు బిజెపి పాలన వైపు మొగ్గు చూపుతున్నారని, 2014లో పార్లమెంట్‌పై కమలం వికసిస్తుందని, అందుకు ఇటీవల జరిగిన దేశంలోని ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పలు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిదర్శనమని అన్నారు. ఈనెల 24వ తేదీ నుండి మళ్లీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలకు కాంగ్రెస్, టిడిపిలే కారణమని, అందుకు సోనియాగాంధీ, చంద్రబాబునాయుడులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంతమంది కడుపుకోతకు గురవుతున్నారో ఓ సారి ఆలోచించాలని, అయితే వేయి మంది చంద్రబాబులు, సోనియాగాంధీ, రాఘవులు, కిరణ్‌కుమార్‌రెడ్డి, అసౌద్దీన్ ఓవైసిలు వచ్చినా 2014లో తెలంగాణ భూమిపై చుక్క రక్తపు బొట్టు పడకుండా బిజెపి తెలంగాణను ఇస్తుందని, దాంతో ఇరు ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా విడిపోయి కలిసి ఉంటారని, రెండు రాష్ట్రాలు ఏర్పడి తెలుగు ప్రజలు అభివృద్ధి చెందుతారని అన్నారు. గుజరాత్ తరహాలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు బిజెపి స్వీకరిస్తుందని అన్నారు. తెలంగాణ కోసం బిజెపి చేస్తున్న ఉద్యమంలో అందరు కలిసిరావాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రావడమే ప్రమాదమని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు దౌర్భాగ్యాన్ని పట్టించిందని, ఈ దౌర్భాగ్యం నుండి ప్రజలే బయట పడేందుకు ఆలోచిస్తున్నారని, అది రాజకీయంగా బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చి కాంగ్రెస్‌ను ఖతం చేయనున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని నియోజకవర్గ ప్రజలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్‌రాజు, ఆచారి, నాగూరావు నామాజీ, కొండయ్య, పద్మజారెడ్డి, రాములు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, ప్రధాన కార్యదర్శులు శ్రీవర్ధన్‌రెడ్డి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం 10 కోట్లతో ప్రతిపాదనలు
- మంత్రి డికె అరుణ

గట్టు, ఏప్రిల్ 18: వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఇదివరకే 10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డికె అరుణ అన్నారు. ప్రజాపథం కార్యక్ర మంలో భాగంగా బుధవారం గట్టు మండల పరిధిలోని బోయలగూడెం, ఇందువాసి గ్రామాల్లో ప్రజాపథం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్దసంఖ్యలో సమావేశానికి హాజరై పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్య లను పరిష్కరించడమే ప్రజాపథం కార్యక్రమం ధ్వేయమన్నారు. మంచి నీటి ఎద్దడి నివారణకు జిల్లాలో నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. 5 కోట్ల రూపాయల పైపులైన్ నిర్మాణం, 6.38 కోట్లతో తాగునీటి కోసం ప్రపంచ బ్యాంక్ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పశువులకు నీరు కోసం నీటితొట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, స్థలాలు, పెన్షన్లు అందని వారు ప్రజాపథంలో దరఖాస్తు చేసు కోవాలని మంత్రి సూచించారు. గత సంవత్సరం 8,38,548 మంది రైతులకు పంట రుణాల కింద 1635 కోట్లు అందించడ జరిగిందన్నారు. పావల వడ్డి కింద 24.21 కోట్లు గత ఏడాది అందజేశామని, ప్రస్తుతం డిసెంబర్ వరకు పావలవడ్డి చెక్కులను మహిళ సంఘాలకు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో పేదప్రజలకు మేమున్నామని ఈ ప్రభుత్వం ధైర్యం చెబుతూ సమస్యలను పరిష్క రిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణరెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రకాంత్‌రెడ్డి, డ్వామా పిడి గోపాల్, ఆర్‌డబ్లుఎస్ ఎస్‌ఇ ప్రభాకర్‌రావు, మార్కెట్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

వాయలార్ రవిని కలిసిన జిల్లా కాంగ్రెస్ నేతలు
జిల్లా పరిస్థితులపై నివేదిక
తెలంగాణ ఇస్తేనే పార్టీకి మనుగడ అంటూ నేతల స్పష్టం

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తెలుసుకునేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి వాయలార్ రవిని బుధవారం జిల్లా కాంగ్రెస్ పెద్దలు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు వాయలార్ రవిని కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితిని వివరించారు. జిల్లాలో ఎమ్మెల్యేల సంఖ్యను కూడా తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాలకు ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా వాయలార్ రవి జిల్లా నాయకులతో ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓటమి చెందిందని కూడా జిల్లా నేతలను ఆయన అడిగినట్లు తెలిసింది. అందుకు జిల్లా నాయకులు ప్రధానంగా తెలంగాణ అంశమే పార్టీ ఓటమికి దారి తీసిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తప్ప పార్టీ మనుగడ జిల్లాలో ఉండదని కూడా తేల్చి చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. అయితే ఎన్ని పథకాలు అమలు చేసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే తప్ప పార్టీ పరిస్థితి బాగుపడదని, అందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలంటూ జగదీశ్వర్‌రెడ్డి, ఉబేదుల్లా కొత్వాల్, ముత్యాల ప్రకాష్ తదితరులు వాయలార్ రవితో నేరుగా చెప్పినట్లు సమాచారం. ఇందుకు వాయలార్ రవి స్పందిస్తూ రాబోయే 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల తరువాత అధిష్ఠానం తెలంగాణపై కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే ఎలాగైనా ప్రత్యేక తెలంగాణ విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నేతలు వాయలార్ రవిని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిందేనని జిల్లా నేతలు వాయలార్ రవితో తేల్చి చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి ఎలా ఉందంటూ కూడా ఆరా తీసినట్లు సమాచారం. అందుకు రవిని కలిసిన జిల్లా నేతలు అక్కడ ఇన్‌చార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిపారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌లో ఉప ఎన్నికలు రాజీనామాలు చేసినందుకు వచ్చాయని, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ వాదంపై గెలిచారని, ఈ విషయాన్ని వాయలార్ రవి దృష్టికి తీసుకెళ్తూనే నాగర్‌కర్నూల్ విషయం కూడా నాగం జనార్ధన్‌రెడ్డి తెదేపాకు గుడ్‌బై చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెలంగాణ వాదంపై గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూనే మహబూబ్‌నగర్‌లో బిజెపి సైతం గెలిచిందంటూ జిల్లా కాంగ్రెస్ నేతలు వాయలార్ రవి దృష్టికి తీసుకువచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తేనే మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని, లేకుంటే పరిస్థితి చేజారిపోతుందని కూడా జిల్లా నేతలవు వాయలార్ రవి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఏదిఏమైనా మాజీ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్‌చార్జి జిల్లా కాంగ్రెస్ పరిస్థితిపై ఆరా తీయడంతో అధిష్ఠానానికి తమ వాదనను, ఇక్కడి పరిస్థితులను వినిపించాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

ఈదురుగాలుల బీభత్సం
* పాఠశాల గోడదిమ్మె కూలి 25 మంది విద్యార్థులకు గాయాలు
గద్వాల, ఏప్రిల్ 18: అయిజ పట్టణంలో వీచిన ఈదురుగాలులుకు, కురిసిన వర్షానికి బుధవారం మధ్యాహ్న సమయంలో పాఠశాల గోడదిమ్మె, పైకప్పు రేకులషెడ్ కూలడంతో 25 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన అయిజలోని మార్కెట్ యార్డు సమీపంలో గల ఏక్లాసుపూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వెంకటరమణా టాలెంట్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈదురుగాలులు, వాన ఒక్కసారిగా రావడంతో పాఠశాలలో ఉన్న మొదటి అంతస్తు పైకప్పు సిమెంటు రేకులు విరిగిపడటం, గోడదిమ్మెలు కూలడంతో అక్కడే చదువుకుంటున్న విద్యార్థులకు గాయ్యాలయ్యాయి. అందులో సుదర్శన్, అనే్వష్, శివకుమార్, నరేందర్, నాగేష్‌లకు తలకు గాయాలై, కాళ్లు, చేతులు విరిగి తీవ్రగాయాలు కావడంతో గద్వాల ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇంకా 20 మందికి గాయాలు కాగా అయిజలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బోరున విలపిస్తు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అయిజ మండల విద్యాధికారి సత్యనారాయణ, నాయకులు గట్టు తిమ్మప్ప, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, ఉప్పరి తిమ్మప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, అంజనేయులు, ప్రసాద్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విద్యార్థులను పరామర్శించారు.

శాస్తవ్రేత్తల పరిశోధనలు రైతుల పంట పొలాల్లోకి వెళ్లాలి
* రాష్ట్ర వ్యవసాయ విస్తరణ సంచాలకులు గిద్దారెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18: వ్యవసాయ శాస్తవ్రేత్తల పరిశోధనలు రైతుల పంట పొలాల్లోకి వెళ్లాలని, అప్పుడే రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ సి.గిద్దారెడ్డి అన్నారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నిర్వహించిన మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశం దక్షిణ తెలంగాణ మండల సమావేశానికి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ శాస్తవ్రేత్తలు, రైతులు, వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. మహబూబ్‌నగర్ జెడ్పీ మీటింగ్‌హాల్‌లో రెండు రోజుల పాటు రాబోయే ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించిన వ్యవసాయ పరిశోధనల సమావేశానికి రాష్ట్ర విస్తీర్ణ సంచాలకులు డాక్టర్ గిద్దారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డాక్టర్ భానుమూర్తి సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాస్తవ్రేత్తలను, రైతులను, వ్యవసాయ అధికారులను ఉద్దేశించి గిద్దారెడ్డి మాట్లాడుతూ పరిశోధనలు వ్యవసాయ విస్తరణకు ఉపయోగకరంగా ఉండాలని, ఇ లాంటి సమావేశాల ద్వారా ఓ చర్చ జరగనుందని తెలిపారు. పరిశోధనలు రైతులకు పనికి వచ్చేటట్లు ఉండాలని అన్నారు. గతంలో వంద పరిశోధనలు చేస్తే కేవలం 25 శాతమే రైతులకు ఉపయోగపడేవని అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలు, రైతులు ఒక వేదికపై కూర్చుంటే పరిశోధనలకు ఫలితాలు వస్తాయని అన్నారు. క్షేత్ర స్థాయి సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. రైతులు కూడా ఓ పరిశోధకులు అని, భూమి, పంటలు వారి చేతిలోనే ఉంటాయని, వారి ఆధీనంలో ఉన్నందున ఏ పంటకు ఏమి చేస్తే బాగుంటుందనే విషయం కూడా రైతులకు బాగా తెలుసని అన్నారు. ముందు దృష్టితో శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేయాలని అన్నారు. పంటల సాగు రైతులకు తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి వచ్చేలా సూచనలు, సలహాలు పరిశోధనల ద్వారా ఇవ్వాలని అన్నారు. డాక్టర్ భానుమూర్తి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటలు పండవని ఒక అపోహా ఉండేదని, అయితే పరిశోధనల ద్వారా ఈ పంటలు రోజురోజుకు విస్తరణ పెరుగుతుందని అన్నారు. రబీలో సైతం వేరుశనగ పంట విస్తీర్ణత అధికంగా పెరుగుతుందని అన్నారు. శాస్తవ్రేత్తలు, వ్యవసాయ అధికారులు అంతర్ పంటలను ప్రోత్సహించాలని అన్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు అధిక దిగుబడి పెరగాలని, అందుకు రైతులకు పరిశోధత్మాకమైన సాగు చేయించాలని అన్నారు. ప్రభుత్వం పరిశోధనలకు బడ్జెట్ కేటాయించడం లేదని, పరిశోధనలు వ్యాపారంగా ఉండాలంటూ ప్రభుత్వాలే సలహాలు ఇస్తున్నాయని, ఇది విచారకరమన్నారు. అందుకే అధికారులు సైతం పరిశోధనల్లో కమర్షియల్ వ్యాపారంగా ఆలోచించాలని అన్నారు. బడ్జెట్ కేవలం జీత భత్యాలకు మాత్రమే కేటాయించి పరిశోధనలకు మాత్రం నిధులు మీరే సమకూర్చుకోవాలని సూచనలు చేస్తున్నందున అందుకు శాస్తవ్రేత్తలు కూడా ఆలోచించాలని అన్నారు. శాస్తవ్రేత్తల పరిశోధనలు రైతులకు మేలు చేకూర్చే విధంగా ఉండాలని ఆయన తెలిపారు.

రహదారులను తీర్చిదిద్దుతాం
* మంత్రి ధర్మాన ప్రసాదరావు
కల్వకుర్తి, ఏప్రిల్ 18: రానున్న మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని రహదారులన్నింటిని తీర్చి దిద్దడంతోపాటు అవసరమున్న చోట రోడ్ల నిర్మాణం చేపడతామని రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ కంటే ఈ ఆర్థిక సంవత్సరం 5వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను రహదారుల నిర్మాణం కోసం పెంచామని చెప్పారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పెద్ద మొత్తంలో రహదారుల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్థిక శాఖకు, ఆర్‌అండ్‌బి శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు. గత పది సంవత్సరాల కన్న ఎక్కువ స్థాయిలో రహదారుల నిర్మాణాన్ని రానున్న మూడు సంవత్సరాలలో చేపడుతామన్నారు. రహదారులను మరింత నాణ్యత ప్రమాణాలతో తీర్చి దిద్దేంకు భారీగా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అధిక నిధులు క్యాప్టల్ మేజర్ పనులపై వెచ్చిస్తామన్నారు.

పాఠశాల గోడదిమ్మె కూలడంపై విచారణకు మంత్రి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18: అయిజ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ ఈదురుగాలులకు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన పై అంతస్తుకు చెందిన గోడదిమ్మె, పైకప్పు సిమెంట్ రేకులు కూలిపడి విద్యార్థులకు తీవ్ర గాయాలైన సంఘటనపై మంత్రి డికె అరుణ విచారణకు బుధవారం ఆదేశిస్తున్నట్లు ఓ ప్రకటన విడుద చేశారు. ఈ సంఘటనపై గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి విచారించాలని రేకులు పడి గోడ కూలి తీవ్రంగా గాయాలబారిన పడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేయాలని కూడా మంత్రి ఆదేశించారు. గోడలు కూలిన సంఘటనపై బాధులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అరుణ హెచ్చరించారు.

సెల్‌టవర్ ఎక్కిన కండక్టర్
* మూడు గంటలు టెన్షన్.. టెన్షన్

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18: ఆర్టీసీ సంస్థలో ఉద్యోగ భద్రత కల్పించాలని సకల జనుల సమ్మెలో భాగంగా అడ్వాన్స్ రూపేణ ఇచ్చిన డబ్బును ఎక్కువ మొత్తంలో కట్ చేయకూడదని ఓ కండక్టర్ ఏకంగా సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. ఆర్టీసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నెరవేర్చాలంటూ మూడు గంటల పాటు మండుటెండలో సెల్‌టవర్‌పై కూర్చోని తాను ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టించాడు. ఈ సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ ఆర్టీసి బస్ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న సహదేవ్ పోస్ట్ఫాసు సమీపంలో గల సెల్‌టవర్ ఎక్కాడు. సెల్‌టవర్ ఎక్కిన తరువాత ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పెద్దఎత్తున నినాదాలు చేయడంతో రోడ్డు వెంట పోతున్న వాహనదారులు ఈ విషయాన్ని గమనించారు. ఒక్కొక్కరుగా సెల్‌టవర్ దగ్గర గూడిగుడటంతో ఈ విషయం పట్టణంలో వ్యాపించింది. ఆర్టీసి కండక్టర్ సహదవ్ సెల్‌టవర్ ఎక్కాడని ఆర్టీసి కార్మికులకు, అధికారులకు, యూనియన్ నాయకులకు తెలియడంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆర్‌ఎం అన్సారీతో పాటు ఆర్టీసి అధికారులు సహదేవ్‌ను ఎంత ప్రాదేయపడినా కిందకు దిగలేడు. యూనియన్ నాయకులు పలుమార్లు ఫోన్లో సంభాషిస్తూ తామున్నామంటూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకూడదని కోరారు. ఇంతలోపే కండక్టర్ సహదేవ్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందింది. ఆయన భార్య జయమ్మతో పాటు పిల్లలు కూడా అక్కడికి చేరుకుని సెల్‌టవర్ దిగాలంటూ బోరున విలపించారు. భార్య జయమ్మ రోదించిన సంఘటన పలువురిని కలచివేసింది. సహదేవ్ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కూడా తండ్రి సెల్‌టవర్ ఎక్కడంతో విలపించారు. పలుమార్లు ఫోన్లో పిల్లలు, భార్య మాట్లాడినా ఆయన వినలేదు. సెల్‌టవర్ ఎక్కిన మూడు గంటల తరువాత ఆర్‌ఎం అన్సారీ మరోసారి ఫోన్ చేసి చర్చలు జరిపారు. సకల జనుల సమ్మెలో ఇచ్చిన అడ్వాన్స్‌ను ఒకేసారి జీతంలో కట్ చేయకూడదని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పలు సమస్యలను ఆర్‌ఎం దృష్టికి తీసుకువచ్చారు. భార్య, పిల్లలు రోడ్డుపై పడి రోదిస్తున్నారని, దయచేసి సెల్‌టవర్ దిగాలని ఆర్‌ఎంతో పాటు పోలీసులు, యూనియన్ నాయకులు కోరడంతో ఎట్టకేలకు సహదేవ్ సెల్‌టవర్ దిగాడు. మూడు గంటల పాటు సెల్‌టవర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

మాజీ ఎమ్మెల్యే అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>