Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎన్నాళ్లీ బతుకులు..!

$
0
0

కరీంనగర్, ఏప్రిల్ 18: పద్నాలుగు ఏళ్ల క్రితం గ్రామ దీపికలుగా చేరి క మ్యూనిటీ యానిమేటర్స్ (సిఏ)గా మారారు. అప్పటినుంచి పల్లెల్లో సేవలందిస్తూ డ్వాక్రా మహిళా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా కృషిచేశారు. వాళ్ళు వేసిన ఆర్థిక పునాదులు నేడు కోటానుకోట్ల పొదుపున కు ఊతమిచ్చాయి. నాటి ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు నుంచి నేటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వర కు సిఏలు సేవలు అందిస్తూనే ఉన్నా రు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సిఏ, సిఏఎఫ్, విబికే, సంఘమిత్ర వంటి పేర్లు మారినా వారి బతుకులు మా త్రం మారలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు సేవలందిస్తున్న సిఏలకు మాత్రం జీతం వెయ్యి రూపాయలు దాటలేదు. ఇక ప్రయోజనం లేదని భావించిన ఐకెపి-సిఏలు తమ సమస్యల సాధన కోసం ఈ నెల 9నుంచి జిల్లా వ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. ఫలితంగా గ్రామాల్లోని మహిళా గ్రూ పులకు సంబంధించిన లావాదేవీలు స్తంభించిపోతున్నాయి.
1994లో గ్రామ దీపికలుగా ప్రారంభమైన ప్రస్తుత ఐకెపి-సిఏల సేవలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వారి జీవితాలు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉన్నాయి. అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు సిఏలు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సిఏ, సిఏఎఫ్, విబికే, సంఘమిత్ర వంటి పేర్లను మార్చిన వారి బతుకులు మాత్రం మారలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు సేవలందిస్తూ, మహిళా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా కృషిచేసిన సిఏల వేతనాలు వెయ్యి రూపాయలు దాటలేదు. ఎప్పటికైనా, ఎన్నటికైనా తమ జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతుందని ఆశపడిన సిఏలకు నిరాశే ఎదురవుతోంది. ఇక ప్రయోజనం లేదని భావించిన ఇందిరా క్రాంతి పథం కమ్యూనిటీ యానిమేటర్స్ (సిఏ)లు తమ సమస్యల సాధన కోసం సమ్మెకు దిగారు. ఆంధ్రప్రదేశ్ ఐకెపి యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది సిబ్బంది నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో జిల్లాలోని 2లక్షల 13వేల 436 గ్రూపుల్లోని 29లక్షల 88వేల 104 మంది మహిళల ఆర్థిక లావాదేవీలు, పథకాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహిళ గ్రూపులకు రుణాలు అందించడమేకాకుండా 27 ప్రభుత్వ శాఖల ద్వారా లబ్ది చేకూర్చేందుకు సిఏలు విశేష కృషిచేస్తున్నారు. ప్రధానంగా ఆమ్ ఆద్మీ భీమా యోజన, అభయహస్తం పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2లక్షల 13వేల 436 మహిళా గ్రూపులను ఏర్పాటు చేయడంతోపాటు వారికి ప్రతి ఆరు నెలలకు రూ.345కోట్ల రుణాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 2010-11లో 8లక్షల 13వేల 860 మంది వ్యవసాయ కూలీలను ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకంలో చేర్పించారు. ఇందులో మృతి చెందిన 13వేల 70కుటుంబాలకు ఐదువేల రూపాయల చొప్పున తాత్కాలిక ఆర్థిక సహాయాన్ని అందేలా చేశారు. జాతీయ ఉపాధి పథకంలో 444 మంది మృతుల కుటుంబాలకు 22లక్షల 20వేల రూపాయలు అందించారు. వైఎస్సార్ అభయహస్తం పథకంలో 2లక్షల 33వేల 270 మందికి లబ్దిచేకూరేలే చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుపర్చడంతో పాటుగా మహిళలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిఏలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యల సాధన కోసం 2010 జూన్ మాసంలో సిఏలు 21రోజుల పాటు సమ్మె చేయగా, నెలకు మూడు వేలు గౌరవ వేతనంతోపాటు విఏవోలుగా నియమిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ రెండేళ్లుగా నోచుకోలేదు. ఫలితంగా కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. పలుమార్లు వినతిపత్రాలను అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇక ఎంతకాలం చేసిన ప్రయోజనం లేదని భావించిన సిఏలు మరోసారి సమ్మె బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. తొమ్మిది రోజులుగా సిఏలు సమ్మె చేస్తుండటంతో మహిళా సంఘాల సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి సిఏల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తొమ్మిదవ రోజుకు చేరిన సిఏల సమ్మె
తమ సమస్యల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సిఏల సమ్మె బుధవారం నాటికి తొమ్మిదవ రోజుకు చేరింది. ఈ రోజు సమ్మె దీక్షను సంఘం నాయకులు జ్యోతి ప్రారంభించారు. ఈ దీక్షలో సంఘం నాయకులు రజిత, మంజుల, అన్నపూర్ణ, సత్యలక్ష్మి, రాధ, పావని, మమతలతోపాటు వంద మంది సిఏలు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
కరీంనగర్, ఏప్రిల్ 18: కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం నగరంలోని ఒకటవ డివిజన్‌లో బుధవారం నిర్వహించిన ప్రజాపథంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంచినీటి నల్లాలకు మోటార్లు వాడితే అధికారులు చర్యలు చేపడతారని తెలిపారు. మంచినీటిని వృధా చేయకుండా ప్రజలు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. 13వ ఆర్థిక సంఘం నుండి 4కోట్ల రూపాయలతో మంచినీటి పైపులైన్లు పనులు నిర్వహిస్తున్నట్లు, తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించి తాగునీటిని సరఫరా చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ జిల్లాలో కరువు, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా రవాణా, డీపెనింగ్ చేయుట, పంపింగ్ లేదా నీటి వనరులను అద్దెకు తీసుకుని పరిష్కారం చేస్తామని అన్నారు. అదేవిధంగా బిపిఎల్, ఎల్‌ఆర్‌ఎస్, 13వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజాపథంలో తాగునీరు, విద్యుత్ ఏదైనా సమస్య ఉంటే ఏర్పాటు చేసిన టోల్‌ఫీ నెంబర్‌కు పోన్ చేసి తెలియజేస్తే సంబంధిత అధికారులు 24గంటల్లో సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. అనధికార నల్లాలు, మోటార్లు తొలగించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ఒకటవ వార్డులో 233 మంది పెన్షన్ పొందుతున్నారని, ఇంకా సుమారు వంద మంది పెన్షన్‌కు ధరఖాస్తు చేసుకున్నారని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పంపిణీ చేస్తామని అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో ప్రతి రోజు గంట సేపు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజాపథం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.
తెలుగు మహిళల కోటి సంతకాల సేకరణ
కరీంనగర్, ఏప్రిల్ 18: మద్యం మాఫియా, కుంభకోణాలను నిరసిస్తూ తెలుగుమహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం రాధిక ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి మహి ళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బల్మూరి సువర్ణ మాట్లాడుతూ ప్రజలకు పౌష్టికాహారం అందించి వారివారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూ ఆరోగ్యాన్నిపెంపొందించడానికి కృషిచేయడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆదాయం కోసం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. దశలవారిగా మధ్య నిషేధం, బెల్ట్‌షాపుల రద్దు వాగ్ధానాల ద్వారా ప్రజల నుండి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను మర్చిపోయి వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సామాన్యులు, కూలీనాలి చేసుకుని సంపాదించిన మొత్తాన్ని మద్యానికే ఖర్చు చేయడంతో ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, నాయకులందరు లిక్కర్ మాఫియాగా మారి పేద ప్రజలను దోచుకుంటూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, దీనికి నిరసనగానే కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు అమీనాబేగం, మంజుల, ఈశ్వరి, మణెమ్మ, భాగ్యలక్ష్మి, నాయకులు కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, ఎడ్ల వెంకటయ్యలతోపాటు పలువురు పాల్గొన్నారు.
వండర్ ‘టెండర్’ ఫుల్..!
*మున్సిపల్ షాపుల కేటాయంపునకు వేలం
*నిలిపి వేయాలంటూ అధికార నేతల ఆందోళన
*అధికారుల సాక్షిగా పగిడీల పంపకాలు
జగిత్యాల, ఏప్రిల్ 18: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న పదకొండు మున్సిపల్ షాపులకు గానూ బుధవారం టెండర్లు నిర్వహించారు. సదరు షాపుల వేలం పాటను అధికార పార్టీ నేతలు అడ్డుకొని ఆందోళనకు దిగడంతో వారి మెప్పు కోసం కమిషనర్ నుండి ఉద్యోగి వరకు పడరాని పాట్లు పడి నిబంధనలను గాలికొదిలేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సాక్షిగానే వేలం పాటల్లో పాల్గొని షాపులు దక్కించుకోవడానికి యత్నించిన వారు బాహాటంగానే పగిడీలు పంచుకున్నారు. ఈ సంఘటనను చూసిన కొందరిని (విలేఖరులను కూడా) మమ్మల్ని బాధ్యులను చేస్తారని పక్కకు పంపించారు. అనంతరం పదకొండు షాపులకు దాదాపు వెయ్య మంది పోటీ పడగా మున్సిపల్ అధికారులు వేలం పాట నిర్వహించారు. మొదటి దుకాణం బి. పోషయ్య రూ. 85వేలకు దక్కించుకోగా, రెండో షాపును సిహెచ్ రవి 3.90లక్షలకు దక్కించుకోగా మిగతా దుకాణాలకు వేలం నిర్వహిస్తుండగా ఇక ఇలాగైతే మనకు మున్సిపల్ షాపులు దక్కవన్న ఆలోచనతో ఆందోళనకు దిగి వేలం పాటలు నిలిపి వేసి పాత కూరగాయల దుకాణాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొందరు కాంగ్రెస్ నాయకులు వేలం పాటలను అడ్డుకున్నారు. ఉన్న 11మున్సిపల్ షాపులకు వేలం పాటలు నిర్వహించడం వల్ల కూరగాయల మార్కెట్ ఎక్కడ నిర్వహించేదని, కూరగాయల మార్కెట్‌కు స్థలం చూపించాలని పట్టుబట్టారు. మిగతా చోట స్థలం చూపిస్తామని కమిషనర్ జిఆర్ సురేష్ నచ్చజెప్పినా ససేమిరా అంటూ ఇక్కడ షాపులకు వేలం వేయడం ద్వారా కూరగాయల మార్కెట్‌ను తొలగిస్తే ఈప్రాంత వాసులు కూరగాయల కొనుగోలు చేసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాలా..? అంటూ మున్సిపల్ అధికారులను నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మెప్పు కోసం పొంతలేకుండా మిగతా 9మున్సిపల్ షాపులకు వేలం పాటలు నిర్వహించిన అధికార పార్టీ నేతల మెప్పుకోసం మున్సిపల్ అధికారులు పడరాని పాట్లు పడడం గమనార్హం.

మృత్యుంజయం ఆరోపణలు
అవాస్తవం
సిబిఐ విచారణకు సైతం సిద్ధమే
నీవు సిద్ధమయితే ప్రకటించు..
డిసిసి చీఫ్ కో-ఆర్డినేటర్ రవీందర్‌రావు
కరీంనగర్, ఏప్రిల్ 18: ప్రజాదరణ చూసి ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేక తనపై పిసిసి అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం పలు ఆరోపణలు చేశారని, అవన్నీ అవాస్తవమని జిల్లా కాంగ్రెస్ కమిటీ చీఫ్-కోఆర్డినేటర్ కొండూరు రవీందర్‌రావు స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణకు సైతం తాను సిద్ధంగా ఉన్నామని, ఆయన చేసిన అవినీతిపై సిబిఐ విచారణకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. నగరంలోని శ్రీనివాస హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎవర్నీ మోసగించి అస్తులు సంపాదించలేదని, మా తాతల, తండ్రుల కాలం నుంచే మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలిపారు. తనపై, మా కుటుంబంపై ఆయన చేసిన ఆరోపణల్లో ఒక ఇంచు భూమి కూడా ఎవరి నుంచి లాక్కొలేదని స్పష్టం చేశారు. 1995నుంచి మృత్యుంజయంకు, మా కుటుంబానికి రాజకీయ వార్ నడుస్తున్నదని, ఆనాటి నుంచి ఈనాటి వరకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏమిలేని మృత్యుంజయం 60ఎకరాల అధిపతి అయ్యాడని ప్రశ్నించారు. డిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఏడు సంవత్సరాల కాలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో 1119సర్వే నెంబర్‌లోని మూడు గుంటల భూమి ప్రభుత్వం నుంచి అలాట్ చేయించుకుని అమ్ముకున్నాడని, గంభీరావుపేటలోని 237సర్వే నెంబర్‌లో 3ఎరకాల 5గుంటల మామిడితోట కబ్జా చేశారని, ఇదంతా వక్ఫ్‌బోర్డు భూమి అని తెలిపారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని, ఆయన విచారణకు సిద్ధమైతే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఎస్‌యు ఉపకులపతిగా వీరారెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 18: శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కడారు వీరారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని కొడిమ్యాల మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన కడారు వీరారెడ్డి 1979 మే నెలలో కాకతీయ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ పిన్సిపల్‌గా పనిచేస్తూ 2011 జూన్ నెలలో ఉద్యోగ విరమణ చేసిన వీరారెడ్డిని శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉపకులపతి నియామకం విషయంలో గత కొంతకాలంగా అప్పుడు, ఇప్పుడంటూ సాగిన ప్రచారానికి వీరారెడ్డి నియామకంతో తెరపడింది.

పద్నాలుగు ఏళ్ల క్రితం గ్రామ దీపికలుగా చేరి క మ్యూనిటీ యానిమేటర్స్ (సిఏ)గా మారారు. అప్పటినుంచి
english title: 
enna

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>